మానిటర్ వర్సస్ ఎల్ఈడీ టీవీ
కొత్తగా పీసీని కొనుగోలు చేసేటపుడు మానిటర్ విషయంలో అనేక సందేహాలు వస్తాయి. ఎక్కువ డబ్బులు పెట్టి మానిటర్ కొనే బదులు తక్కవ ఖర్చుతో ఎల్ఈడీ టీవీనే కంప్యూటర్ మానిటర్‌గా ఉపయోగించొచ్చు కాదా అనే ఆలోచన రాక మానదు. కొన్నేళ్లుగా టీవీలనే కంప్యూటర్ మానిటర్లుగా వినియోగించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దానికి కారణాలు అనేకమున్నాయి. అవి పరిశీలిస్తే..
గతంలో మాదిరిగా టీవీలు ఇప్పుడు పెద్ద పరిమాణంలో డబ్బాల వలె రావడం లేదు. పలుచగా అచ్చం మానిటర్ల సైజులో వస్తున్నాయి. టీవీలు కూడా అన్ని సైజుల్లో 20 ఇంచులు మొదలు కొని 65 ఇంచుల వరకు అందుబాటులో ఉంటున్నాయి.
కంప్యూటర్లకు కనెక్ట్ చేయాల్సిన అన్ని పోర్టులు (యూఎస్‌బీ, హెచ్‌డీఎంఐ, వీజీఏ లాన్ పోర్టులు) అన్నీ ఇప్పుడు ఎల్ఈడీ టీవీలకు వస్తున్నాయి. బ్రాండెడ్ కంపెనీలకు చెందిన 24 ఇంచుల మానిటర్లు ప్రస్తుతం మార్కెట్‌లో రూ.8వేల నుంచి ప్రారంభమవుతున్నాయి. కానీ ఎల్ఈడీ టీవీల విషయానికొస్తే మార్కెట్‌లో 24ఇంచులవి కేవలం రూ.6వేలకే లభ్యమవుతున్నాయి. ఈ-కామర్స్ సైట్లలో ఆఫర్ల సమయంలో ఇంకా తక్కువకే లభిస్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మానిటర్‌కు బదులుగా ఎల్ఈటీ టీవీలను మానిటర్లుగా ఉపయోగించుకునేవారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. మరోవైపు టీవీల్లో ఇన్‌బిల్ట్ స్పీకర్లు ఉండడం వల్ల ప్రత్యేకంగా స్పీకర్లను వాడాల్సిన అవసరం ఉండదు.
అయితే మానిటర్లుగా టీవీలను ఉపయోగించడం మంచిదేనా అనే విషయంపై ఇప్పుడు తెలుసుకుందాం..
స్క్రీన్ రీఫ్రెష్ రేట్
మానిటర్లు సాధారణంగా అత్యధిక రిఫ్రెష్ రేట్(సుమారు 120హెడ్జ్ నుంచి 240 వరకు ) కలిగి ఉంటాయి. అలాగే టీవీల కంటే వేగంగా రెస్పాంసివ్‌గా ఉంటాయి. ఇవి గేమింగ్‌కు అనుకూలంగా రూపొందించబడి ఉంటాయి.
మరొక వైపు, టీవీల స్క్రీన్లు పెద్దగా ఉంటూ సినిమాలు మరియు టీవీ షోలను చూడటానికి అనూకూలంగా తయారుచేయబడతాయి. ఇందులో స్క్రీన్ రీఫ్రెష్ రేట్ సాధారణంగా కేవలం 60Hz కే పరిమితమవుతాయి. రీఫ్రెష్ రేట్ తక్కవగా ఉంటే గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అంతగా బాగుండదు.
రెస్పాన్స్ టైం:
మానిటర్ల కంటే ఎల్ఈడీ టీవీల్లో పిక్సెల్ రెస్పాన్స్ టైం ఎక్కవుగా ఉంటుంది. దీని ప్రకారం.. పిక్సెల్ కలర్ మారే సమయం టీవీల్లో కంటే మానిటర్లలోనే అతితక్కువగా ఉంటుంది. దీనివల్ల గ్రాఫిక్స్ ఎడిటింగ్ అద్భతంగా ఉంటుంది. మానిటర్లలో మోషన్ బ్లర్ అంతగా కనిపించదు. సగటు ఐపిఎస్ ప్యానెల్ మానిటర్ ప్రతిస్పందన సమయ వేగం m 5 ఎంఎస్ అయితే, ఒక ఐపిఎస్ ప్యానెల్ టివిలో 15 ఎంఎస్ ఉంటుంది, దీని ఫలితంగా వేగంగా కనిపించే దృశ్యాలు టీవీల్లో కంటే మానిటర్లలోనే బాగుంటుంది.
స్క్రీన్ రిజల్యూషన్
ఎల్ఈడీ టీవీలు 32 ఇంచుల విభాగంలో కేలం హెచ్‌డీ రెడీ మాత్రమే లభ్యమవుతున్నయి. కానీ మానిటర్ల విషయానికొస్తే ఇందులో ఫుల్ హెచ్‌డీ, 2560 × 1440 పిక్సెల్‌లతో QHD రిజల్యూషన్‌తో కూడా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాక ప్రస్తతుతం 21: 9 నిష్పత్తితో అల్ట్రా-వైడ్ మానిటర్లు లభ్యమవుతున్నాయి. ఈ ఫీచర్ వల్ల మానిటర్లను దగ్గరుండి చూసినా మన కళ్లకు ఇబ్బంది ఉండబోదు.కానీ పెద్ద స్ర్కీన్ గల టీవీని ఎక్కువ సేపు దగ్గరుండి చూడడం వల్ల కళ్లకు హాని కలుగొచ్చు.
ఇక టీవీలను మానిటర్‌గా ఉపయోగించడం వల్ల హెచ్‌డీఎంఈ పోర్టులను ఉపయోగించి ఒకేసారి సీపీయూ, సెట్‌టాప్ బాక్స్‌లను కనెక్ట్ చేయొచ్చు. ఇష్టమున్నపుడు టీవీగా, కంప్యూటర్‌గా వినియోగించుకోవచ్చు. టీవీల్లో ఇన్‌బిల్ట్ స్పీకర్లు ఉండడం వల్ల ప్రత్యేకంగా స్పీకర్లను వినియోగించాల్సిన అవసరం ఉండదు. అయితే టీవీనే మానిటర్‌గా ఉపయోగించుకొనేవారు వీజీఏ పోర్టు, హెచ్‌డీఎంఐ పోర్టులు ఉంటేవీ మాత్రమే కొనుగోలు చేయాలి.
తరచుగా తక్కువగా కంప్యూటర్లను వినియోగించుకునేవారు టీవీలను మానిటర్లుగా వాడొచ్చనేది నిపుణుల మాట. ఎల్ఈడీ టీవీలు గేమింగ్‌కి, వీడియో ఎడిటింగ్, ఫొటోషాప్, హెడీ గ్రాఫిక్స్‌కి అంతగా పనిచేయవు. వీటి కోసం మానిటర్లే సరైన ఆప్షన్ అని చెబుతున్నారు.
-------------------------------




1 Comments
👍
ReplyDelete