మొబైల్ ఫోన్లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అందించడంలో అన్ని కంపెనీల కంటే నోకియా ఎప్పుడూ ముందుంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో నోకియా ఫోన్ వినియోగదారులకు నోకియా సంస్థ ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ ను త్వరలో రోల్ అవుట్ చేయనున్నట్లు తెలుస్తోంది.
నోకియా 2.4 మరియు నోకియ 3.4 తో సహా నోకియా హ్యాండ్‌సెట్‌ల కోసం ఆండ్రాయిడ్ 11 యొక్క రోల్అవుట్ షెడ్యూల్‌ను హెచ్‌ఎండి గ్లోబల్ ప్రకటించింది. ఆసక్తికరంగా.. నోకియా కంపెనీ మొదట విషయాన్ని ట్విట్టర్‌లో పేర్కొని వెంటనే దానిని డిలీట్ చేసింది. కొంత లోపం కారణంగా ఆ సమాచారం బయటికి వచ్చింది. ఏదేమైనా, ఆండ్రాయిడ్ 11 నోకియా ఫోన్‌లకు త్వరలో రాబోతోందని తెలుస్తోంది.
నోకియా సంస్థ తన వినియోగదారులకు కచ్చితంగా మూడేళ్ల పాటు సాఫ్ట్ వేర్ అప్‌డేట్‌లు ఇస్తామని సంస్థ గతంలోనే ప్రకటించింది. నోకియా సంస్థ తన నోకియా 2.2, నోకియా 5.3, నోకియా 8.1 తో క్యూ 4 2020 లోనే అంటే ఈ ఏడాది చివరలో ప్రారంభమవుతుందని నోకియా మొబైల్ తన ట్వీట్‌లో పేర్కొంది. అప్పుడు, క్యూ 1 2021లో, నోకియా 1.3, నోకియా 4.2, నోకియా 2.4, నోకియా 3.4, మరియు నోకియా 2.3 మోడళ్లకు ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్‌ను స్వీకరించడం ప్రారంభిస్తాయి. నోకియా 3.2, నోకియా 7.2, నోకియా 6.2, నోకియా 1 ప్లస్ మరియు నోకియా 9 ప్యూర్ వ్యూ ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ చివరి దశ క్యూ 2 2021 లో రోల్ అవుట్ అవుతుంది. మిగిలిన నోకియా పరికరాలు ఎప్పుడు ఆండ్రాయిడ్ 11 నవీకరణను అందుకుంటాయనే దానిపై సమాచారం లేదు.




1 Comments
Nice
ReplyDelete