Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

iPhone పాత మోడ‌ళ్ల ధ‌ర‌లు త‌గ్గాయి..

రిటైల్ బాక్స్ లో  పాడ్స్ హెడ్‌ఫోన్లు మాయం

ఆపిల్ ఐఫోన్ ధ‌ర‌లు త‌గ్గాయి. ఐఫోన్‌ 12 సిరీస్‌ను ప్రారంభించిన త‌క్ష‌ణ‌మే ఆపిల్ సంస్థ ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది.  ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ ఎస్ఈ (2020) తోపాటు  ఐఫోన్ 11 మోడ‌ళ్ల ధ‌ర‌లు త‌గ్గాయి. కొత్త  ధరలు (MRP) ఇప్పుడు ఆపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌లో క‌నిపిస్తున్నాయి.  అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ మార్కెట్‌లతో సహా ఇత‌న వెబ్‌సైట్ల‌లో ఇంకా సవరించిన ధరలను ప్ర‌ద‌ర్శించ‌లేదు. కాగా ఐఫోన్ల ధరల‌ తగ్గింపుతో పాటు, ఆపిల్ ఐఫోన్ XR, ఐఫోన్ SE (2020) మరియు ఐఫోన్ 11 యొక్క రిటైల్ బాక్స్ నుండి ఛార్జర్, ఇయర్ పాడ్స్ హెడ్‌ఫోన్‌లను తొలగించ‌డం మీరు గుర్తించ‌వ‌చ్చు.  . ఐఫోన్ 12 సిరీస్‌ల‌కు కూడా ఛార్జర్, ఇయర్‌పాడ్‌లను క‌ట్ చేసింది.  

  • iPhone XR            64GB Rs.52,500 Rs.47,900
  • iPhone SE (2020) 64GB  Rs.42,500 Rs.39,900
  • iPhone SE (2020) 128GB Rs.47,800 Rs.44,900
  • iPhone SE (2020) 256GB Rs.58,300 Rs.54,900
  • iPhone 11              64GB Rs.68,300 Rs.54,900


కాస్ట్ కటింగ్ పేరుతో ప్ర‌స్తుతం  ఆపిల్ ఐఫోన్ XR, ఐఫోన్ SE (2020) మరియు ఐఫోన్ 11 యొక్క రిటైల్ బాక్స్ నుండి ఛార్జర్ మరియు ఇయర్‌పాడ్స్ హెడ్‌ఫోన్‌లను తొలగించింది.  “మా పర్యావరణ లక్ష్యాలను చేరుకోవటానికి మేము ఐఫోన్ 11 లో పవర్ అడాప్టర్ ఇయర్‌పాడ్‌లు తొల‌గించాం.  దయచేసి మీ ప్రస్తుత ఆపిల్ పవర్ అడాప్టర్ మరియు హెడ్‌ఫోన్‌లను విడిగా కొనండి ”అని ఐఫోన్ 11 ఆపిల్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ వెబ్‌సైట్‌లో పేర్కొంటున్నారు.  ఇది ఐఫోన్ అభిమానుల‌కు చేదువార్తే.

ఆపిల్ మొదట్లో ఆపిల్ వాచ్ సిరీస్ 6తోపాటు ఆపిల్ వాచ్ సిరీస్ SE బాక్స్ నుంచి ఛార్జర్‌ను తొలగించింది. దీని కొస‌నసాగింపుగా ఐఫోన్ 12 సిరీస్ యొక్క రిటైల్ బాక్స్ నుండి ఛార్జర్ మరియు ఇయర్ పాడ్స్‌ను తొలగించ‌డం గ‌మ‌నార్హం.  

అమేజాన్‌, ఫ్లిప్‌కార్ట్ లో ఐఫోన్ల‌పై భారీ డిస్కౌంట్లు 


అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫ‌ర్ల‌లో భాగంగా ఐఫోన్ 11 మోడ‌ల్‌ను కేవ‌లం రూ. 47,999కే విక్ర‌యించ‌నున్న‌ట్లు అమేజాన్ తన వెబ్‌సైట్‌లో ఓ పోస్ట‌ర్ ద్వారా వెల్ల‌డించింది. మ‌రోవైపు ఫ్లిప్‌కార్ట్ కూడా  లాస్ట్ ఇయ‌ర్ లాంచ్ చేసిన ఐఫోన్ పై రూ.26వేలు డిస్కౌంట్ ప్ర‌క‌టించిన‌ట్లు తెలుస్తోంది.  అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో ఐఫోన్ 11 ధ‌ర రూ. 61,990 నుంచి రూ. 47,999 వ‌ర‌కు త‌గ్గిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. అమెజాన్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులు లేదా ఇఎంఐ లావాదేవీల ద్వారా చెల్లింపులు చేసే వినియోగదారులకు అదనపు రాయితీలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చే ఐఫోన్ 11 యొక్క బేస్ వేరియంట్‌కు ఈ రాయితీ ధర వర్తిస్తుంది. 

భారతదేశంలో ఐఫోన్ 11 ప్రో ధర తగ్గింపు

ఒకవేళ మీకు ఐఫోన్ 11 వద్దనుకుంటే.. ఇంకా ప్రీమియం ఫోన్ కొనాల‌నుకుంటే ఫ్లిప్‌కార్ట్‌లో మ‌రో ఆఫ‌ర్ ఉంది. బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో భాగంగా  రూ. 1,06,600 ధ‌ర క‌లిగిన‌ ఐఫోన్ 11 ప్రో( 64 జిబి స్టోరేజ్ వేరియంట్‌)ను రూ. 26,601 త‌గ్గింపుతో రూ 79,999కే విక్ర‌యించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ కూడా ఎస్‌బిఐ కార్డును ఉపయోగించి డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు. 

వివ‌రాల కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి

https://amzn.to/2SW6gLb



Post a Comment

1 Comments