Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

ట్రిపుల్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో ఎల్‌జీ క్యూ52


దక్షిణ కొరియా సంస్థ ఎల్‌జీ నుంచి మ‌రో స‌రికొత్త స్మార్ట్ ఫోన్ విడుద‌లైంది. LG Q51 మోడ‌ల్ కొన‌సాగింపుగా ఎల్జీ క్యూ52 పేరుతో మార్కెట్‌లోకి వ‌చ్చింది. ఈ ఫోన్ రీర్ కెమెరా కింద ఏకంగా మూడు ఫ్లాష్ లైట్లు ఉండ‌డం దీని ప్ర‌త్యేక‌త‌.  ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. LG Q51 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.  మైక్రో SD కార్డ్ సపోర్ట్ చేస్తుంది. ఇది 4,000 ఎంఏహెచ్ బ్యాటరీతో  సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను వినియోగించారు.  

LG Q52 ధర

ఎల్‌జీ క్యూ52 4GB + 64GB స్టోరేజ్ మోడల్  KRW 3,30,000 ( ఇండియాలో సుమారు రూ. 21,500) ధరతో దక్షిణ కొరియాలో విడుద‌ల చేశారు. ఈ ఫోన్ సిల్కీ వైట్, సిల్కీ రెడ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఎల్‌జీ క్యూ 52 అక్టోబర్ 28 నుంచి అమ్మ‌కాలు ప్రారంభం కానున్నాయి.  

LG Q52 స్పెసిఫికేష‌న్లు

ఈ స్మార్ట్ ఫోన్  720p రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల ఐపిఎస్ ఎల్‌సిడితో డిస్ల్పేతో వ‌స్తుంది. తెర మధ్యలో పంచ్-హోల్ లో  13MP కెమెరాను కలిగి ఉంది, ఇది మీకు అవసరమైనప్పుడు స్క్రీన్‌ను ఫ్లాష్‌గా ఉపయోగిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 2.3GHz మీడియాటెక్ హెలియో పి 35 ప్రాసెసర్‌ను వినియోగించారు. 4 జీబీ ర్యామ్ మరియు 64 జీబీ స్టోరేజ్ ఉంటుంది. గ‌తంలో వ‌చ్చిన Q51 మోడ‌ల్‌లో మీడియా టెక్ హీలియో P22 చిప్‌సెట్‌ను అమ‌ర్చారు. దీనిని బ‌ట్టి క్యూ52లో ప్రాసెస‌ర్‌ను కొద్దిగా అప్‌గ్రేడ్ చేసిన‌ట్టు గుర్తించ‌వచ్చు.  

ఈ ఫోన్‌ను తీవ్రమైన వాతావరణం, క్లిష్ట పరిస్థితులను భరించడానికి అనుగుణంగా త‌యారు చేశారు.  దీనికి MIL-STD-810G ధృవీకరణ లభించింది, అంటే ఒక పర్వతం ఎక్కేటప్పుడు లేదా చల్లని ప్రదేశంలో ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఉపయోగించుకునేంత బలంగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లోని పవర్ బటన్‌లో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ అమర్చారు. ఇది ఆండ్రాయిడ్ 10 తో న‌డుస్తుంది.  

కెమెరా స్పెసిఫికేష‌న్లు

ఇక కెమెరాల విష‌యానికొస్తే LG Q51లో ప్ర‌ధాన కెమెరా 48MP సెండ‌రీ 8MP( వైడ్ యాంగిల్ కెమెరా), 2MP(మాక్రో కెమెరా) మరియు 2MP (డెప్త్ సెన్సార్ )  ఉన్నాయి. LG Q52 ఫోన్‌లో 4000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది ఎలాంటి ఫాస్ట్ చార్జింగ్‌ను స‌పోర్ట్ చేయ‌దు.  ఇక ధ‌ర విష‌యానికొస్తే చాలా ఎక్కువైంద‌నే చెప్ప‌వ‌చ్చు. మీడియాటెక్ హీలియో 35తో వ‌చ్చే ఇత‌ర కంపెనీల ఫోన్లు రూ.7వేల నుంచే అందుబాటులో ఉన్నాయి. 


Post a Comment

0 Comments