Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

సాంసంగ్ ఏ7 టాబ్ ప్రీబుకింగ్ ఆర్డ‌ర్స్ షురూ..


ఈనెల 12 నుంచి అమేజాన్‌లో సేల్స్‌లోకి..

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఎక్క‌డా పాఠ‌శాలు తెరుచుకోలేదు. ఆన్‌లైన్‌లోనే త‌ర‌గ‌తుల‌ను బోధిస్తున్నారు. ఫ‌లితంగా ఇప్ప‌డు పిల్ల‌లు మొబైల్ ఫోన్ల ద్వారానే క్లాసులు వినాల్సి వ‌స్తోంది. అయితే ఫోన్ల‌లోని చిన్న తెర‌ల‌పై గంట‌ల త‌ర‌బ‌డి వీడియోల‌ను చూడ‌డం పిల్ల‌ల‌కు ఎంతో అసౌక‌ర్యంగా ఉంటోంది. దీంతో చాలా మంది ఇప్పుడు లాప్‌టాప్‌లు, టాబ్‌లపై చూసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ టాబ్‌ల విష‌యానికొస్తే వీటి ధ‌ర బ్రాండ్‌ను బ‌ట్టి రూ.4వేల నుంచి ప్రారంభ‌మ‌వుతాయి. త్వ‌ర‌లో సాంసంగ్ కంపెనీ ఇటీవ‌ల సాంసంగ్ టాబ్ ఏ7 వైఫై వేరియంట్ అమేజాన్, సాంమ్‌సంగ్.కామ్‌‌లో ఈనెల 12 నుంచి విక్ర‌యానికి సిద్ధం చేస్తున్నారు. దీనిని కొనాల‌నుకునేరు ప్రీఆర్డ‌ర్ చేసుకోవ‌చ్చు.

ఇటీవ‌లే  వై-ఫై తోపాటు ఎల్‌టిఇ వేరియంట్‌లతో ఏ7 టాబ్లెట్‌ను ఇండియాలో విడుదల చేశారు. గెలాక్సీ టాబ్ A7 10.4-అంగుళాల డిస్ప్లే, నాలుగు స్పీకర్లను క‌లిగి ఉంది.  ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్ను వినియోగించారు. అయితే ప్ర‌స్తుతం 3GB రామ్‌ + 32GB ఇంట‌ర్న‌ల్ మోమోరీ వేరియంట్ మాత్ర‌మే అందుబాటులో ఉంది. 

 శామ్‌సంగ్ టాబ్ ఎ7 వై-ఫై ధర 

శామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఏ7 వై-ఫై వేరియంట్ ధర రూ. 3GB + 32GB మోడల్‌కు రూ.17,999. ఇది గ్రే, గోల్డ్ ఇంకా సిల్వర్ రంగుల్లో ల‌భ్య‌మ‌వుతోంది. టాబ్లెట్ ప్రస్తుతం ప్రీ-ఆర్డర్‌ల కోసం అమెజాన్ మరియు శామ్‌సంగ్.కామ్‌లో న‌మోదు చేసుకోవ‌చ్చు. అమెజాన్ లిస్టింగ్ అక్టోబర్ 12 నుండి అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్ల‌డించింది. 

 అయితే ఈ టాబ్‌తోపాటు వినియోగదారులు బుక్ కవర్‌ను డిస్కౌంట్‌పై రూ.1,875( ఇది అసలు ధర రూ. 4,499). ఐసీఐసీఐ క్రెడిట్‌, డెబిట్ కార్డ‌దారుల‌కు రూ. 1,500 రూపాయల క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్ ఉంది. 

శామ్సంగ్ టాబ్ A7 వై-ఫై గురించి సంక్షిప్తంగా..

శామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ A7 ఆండ్రాయిడ్ 10 ఆప‌రేటింగ్ సిస్టంపై వన్ UI 2.5లో నడుస్తుంది. ఇది 10.4-అంగుళాల WUXGA + (2,000x1,200 పిక్సెల్స్) TFT డిస్ప్లేని కలిగి ఉంది. ఇది ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 SoC ప్రాసెస‌ర్‌ను వినియోగించారు .  3GB RAMతో వ‌స్తుంది. ఇంట‌ర్న‌ల్ మెమోరీ  32GB.  మైక్రోఎస్టీ కార్డ్‌తో  1TB వరకు విస్త‌రించుకోచ్చు.  ఇక వీడియోల కోసం, శామ్సంగ్ గెలాక్సీ టాబ్ A7లో  వెనుక‌వైపు 8 ఎంపీ కెమెరా ఉంటుంది. దీంతో ఫుల్‌హెచ్‌డీ క్వాలిటీతో వీడియోలను రికార్డ్ చేయొచ్చు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమోరాను పొందుప‌రిచారు.  

క‌నెక్టివిటీ ఫీచ‌ర్లు

ఇక కనెక్టివీటీ విష‌యానికొస్తే ఇందులో డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, జిపిఎస్, గ్లోనాస్, బీడౌ, గెలీలియో, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఛార్జింగ్ కోసం యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. 7,040 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ ఉంది. టాబ్లెట్‌లోని సెన్సార్లలో యాక్సిలెరోమీటర్, గైరో సెన్సార్, జియో మాగ్నెటిక్ సెన్సార్, హాల్ సెన్సార్ మరియు యాంబియంట్ లైట్ సెన్సార్ ఉన్నాయి. టాబ్లెట్ 157.4x247.6x7.0mm మరియు 476 గ్రాముల బరువు ఉంటుంది.

ఇందులో వినియోగించిన క్వాడ్ స్పీకర్ సెటప్‌ డాల్బీ అట్మోస్ కు స‌పోర్ట్ ఇస్తుంది. డిస్ప్లే చుట్టూ త‌క్కువ సైజులో ఉండే బెజెల్స్ ఉండ‌డంతో చ‌క్క‌ని వీక్ష‌ణ అనుభాన్ని ఇస్తుంది. గెలాక్సీ టాబ్ A7 కాల్స్ లేదా టెక్స్ట్ మెసేజ్ వచ్చినప్పుడు చూపించడానికి శామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానం చేసుకోవ‌చ్చు.  

ప్రీబుకింగ్ కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

https://amzn.to/3iry6ch



Post a Comment

2 Comments