Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

17 నుంచి అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్


ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తున్న అమేజాన్  గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మేళా నిర్వ‌హించే తేదీల‌ను ఎట్ట‌కేల‌కు అమేజాన్ వెల్ల‌డించింది. పండుగ సేల్స్‌ను  అక్టోబర్ 17 నుండి ప్రారంభమవుతుందని ఇ-కామర్స్ దిగ్గజం మంగ‌ళ‌వారం ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2020 ఈనెల 16 నుండి 21 వ‌ర‌కు నిర్వ‌హిస్తుండగా,  అమెజాన్ సేల్స్ మాత్రం మ‌రుస‌టి రోజు మొద‌లుపెట్టనుంది. అయితే అమేజాన్ త‌న  ప్రైమ్ సభ్యుల కోసం 24 గంటల ముందుగానే మేళాను ప్రారంభించ‌నుంది .  ప్రైమ్ సభ్యులు ఇతర వినియోగదారుల కంటే ఒక‌రోజు ముందుగానే అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మేళాలో డిస్కౌంట్లను పొందగలుగుతారు. ఈ మేళాలో అమెజాన్ వివిధ మొబైల్ ఫోన్లు మరియు ఇత‌ర వ‌స్తువుల‌పై ఆఫర్లను తీసు‌కురానుంది.

కొత్త స్మార్ట్ ఫోన్ల ప్రారంభం

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో కొత్తగా కొనుగోళ్లు చేసే వినియోగదారులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులు ఇంకా ఈఎంఐ లావాదేవీలను ఉపయోగించి 10 శాతం డిస్కౌంట్‌ను పొంద‌వ‌చ్చు.  కనీస కొనుగోలుపై ఐదు శాతం అదనపు క్యాష్‌బ్యాక్ కూడా ఉంటుంది. ఇంకా, వన్‌ప్లస్ 8టి స్మార్ట్‌ఫోన్‌తోపాటు  శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 20 ఎఫ్‌ఇ(ఫాన్ ఎడిష‌న్‌)తో సహా ప‌లు మోడ‌ళ్ల‌ను లాంచ్ చేయ‌నున్నారు.  

మొత్తం 6వేల డీల్స్‌,, 

అమెజాన్ ప్రదర్శించిన ప్రత్యేక మైక్రోసైట్ ప్రకారం, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో ఎలక్ట్రానిక్స్ మరియు ఉపకరణాలపై 6,000 డీల్స్‌ను ముందుకు తెస్తోంది. మొబైల్ ఫోన్లు మరియు ఇత‌ర వ‌స్తువుల‌లో కొన్ని ఆక‌ట్టుకునే ఆఫర్లు కూడా ఉంటాయి. అమెజాన్ మేళా సమయంలో  గేమింగ్ పరికరాలు 55 శాతం వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా అమెజాన్ వివిధ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులపై 70 శాతం వరకు తగ్గింపును ఇవ్వ‌నుంది.  

బ‌జాజ్ ఈఎంఐ స‌దుపాయం

అమెజాన్ త‌న సొంత ఉత్ప‌త్తులైన అమేజాన్ ఎకో, ఫైర్ టివి,  కిండ్ల్ పరికరాలపై 50 శాతం తగ్గింపును ఇస్తోంది. ఇంకా, టీవీలు, గృహోపకరణాలకు 65 శాతం వరకు తగ్గింపు ఉంటుంద‌ని కంపెనీ పేర్కొంది. అలాగే వివిధ ఉత్పత్తులపై నో-కాస్ట్ ఇఎంఐ ఆప్షన్లను అందించడానికి అమెజాన్ బజాజ్ ఫిన్సర్వ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంకా, ఈ అమ్మకం ప్రత్యేక HDFC బ్యాంక్ కార్డ్ ఆఫర్లను తెస్తుంది. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఈనెల 17న ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌టించిన అమేజాన్ ఎప్పుడు ముగుస్తుంద‌నేది ప్ర‌క‌టించ‌లేదు.  కానీ అమ్మకం 5 రోజులు ఉంటాయ‌ని తెలుస్తోంది. 

అమేజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ ఆఫ‌ర్ల కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి

 https://amzn.to/350T1OM

Post a Comment

1 Comments