కేవలం రూ.1 చెల్లించి ప్రీబుకింగ్ చేసుకోండి
ఫ్లిప్‌కార్ట్ ప్లస్ వినియోగదారులకు 17న సాయంత్రం 6 నుంచే ప్రారంభం
కాగా బిగ్ సేవింగ్ డేస్‌లో విక్రయించబోయే ఉత్పత్తుల వివరాలను ఫ్లిప్‌కార్ట్ ఇంకా వెల్లడించలేదు. మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లను కొనదలిచినవారి కోసం నో కాస్ట్ EMI ప్లాన్లు, కార్డ్‌లెస్ క్రెడిట్ మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. టీవీలు మరియు ఉపకరణాలపై ఆసక్తి ఉన్న కస్టమర్ల కోసం, ఫ్లిప్‌కార్ట్ నోకాస్ట్ EMI, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు అందిస్తోంది.
నోకాస్ట్ EMI మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో బిగ్ సేవింగ్ డేస్ సందర్భంగా మూడు కోట్లకు పైగా ఎలక్ట్రానిక్స్ వస్తువులు అమ్మకానికి పెట్టారు. ఇందులో వైర్‌లెస్ మౌస్, కీబోర్డులు, పవర్ బ్యాంకులు, కేబుల్స్, హెడ్‌ఫోన్‌లు ఇతర వస్తువులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ఉన్నాయి. అదనంగా, ఎస్బిఐ కార్డ్ వినియోగదారులు ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ మరియు ఇఎంఐ లావాదేవీలతో 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.
రూ.1కే ప్రీ బుకింగ్
అలాగే ఆసక్తిగల దుకాణదారులు తమ వస్తువును కేవలం రూ.1కే ముందే బుక్ చేసుకోవచ్చు కావలసిన వస్తువును ఈనెల (సెప్టెంబర్) 15 నుంచి 16 లోపు ప్రీ-బుక్ చేసుకోవాలి. దీని కోసం, వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ హోమ్‌పేజీలోని ప్రీ-బుక్ స్టోర్‌ను సందర్శించాలి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ చివరిసారి గత నెలలో నిర్వహించారు. అందులో ఐఫోన్ ఎక్స్ఆర్ (రూ. 44,999), ఐఫోన్ ఎస్‌ఈ (2020) (రూ. 36,999), ఒప్పో రెనో 2 (రూ .10,000 డిస్కౌంట్) మరియు ఇతర స్మార్ట్‌ఫోన్‌లపై డిస్కౌంట్లను ప్రకటించారు. ఆపిల్ హోమ్‌పాడ్ (రూ .18,900), గూగుల్ హోమ్ మినీ (రూ .2,299) కూడా రాయితీ ధరలకు లభించాయి.



1 Comments
Good
ReplyDelete