Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

తోషిబా 4కే స్మార్ట్ టీవీలు వస్తున్నాయ్


జ‌పాన్‌కు చెందిన టెక్ దిగ్గ‌జం తోషిబా తన స‌రికొత్త స్మార్ట్ టీవీల‌ను  ఇండియాలో విడుదల చేయడానికి సిద్దమైంది.  ఈనెల 18న దేశంలోని అన్ని ఆన్‌లైన్ రిటైలర్లలో విక్ర‌యించ‌నుంది. తోషిబా అల్టిమేట్ 4 కె టివి సిరీస్ ల‌ను  అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్ అలాగే, టాటాక్లిక్ వంటి ఈకామ‌ర్స్ ల‌లో అందుబాటులో ఉంటాయి. 

కొత్త తోషిబా టెలివిజన్లు 2014 లో హిస్సెన్స్ కంపెనీ  అభివృద్ధి చేసిన విడా ఆపరేటింగ్ సిస్టమ్ పై న‌డుస్తాయి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగ‌దారులకు అనువుగా కాస్టోమైజ్ చేసిన‌ట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌టీవీల్లో  నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్‌తో సహా అన్ని ప్ర‌ముఖ‌మైన యాప్‌లు మరియు స్ట్రీమింగ్ సేవలకు అందిస్తుంది. ఈనెల 18 నుండి 21 వరకు తోషిబా టీవీల‌ను కొనుగోలు చేసే వినియోగ‌దారుల కోసం ప్యానెల్‌పై కంపెనీ నాలుగేళ్ల వారంటీని అందిస్తోంది.

తోషిబా అల్టిమేట్ 4కె టివి సిరీస్ లోని ఎల్‌ఇడి స్మార్ట్ టీవీల ధ‌ర‌ల‌ను ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు. అయితే అల్టిమేట్ 4 కె టివి సిరీస్ ధర రూ. 30,000 నుంచి ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం.. ఈ సిరీస్ నాలుగు సైజు వేరియంట్లలో వస్తుంది - 43 అంగుళాలు, 50 అంగుళాలు, 55 అంగుళాలు మరియు 65 అంగుళాలు - ఇవ‌న్నీ  డాల్బీ విజన్ హెచ్‌డిఆర్ ఇంకా డాల్బీ అట్మోస్ సౌండ్‌తో వస్తాయి. తోషిబా తన ప్రధాన 65 ఇంచుల  క్యూఎల్‌ఇడి టివిని సెప్టెంబర్ 18 న విడుదల చేయనుంది, 43 ఇంచుల ఫుల్‌హెచ్‌డి మరియు 32-అంగుళాల హెచ్‌డి రిజల్యూషన్ స్మార్ట్ టివిల‌న్నీ విడా స్మార్ట్ ప్లాట్‌ఫామ్‌లో నడుస్తాయి. కొత్త తోషిబా టీవీ శ్రేణి భారతదేశంలో ఇటీవల ప్రారంభించిన హిస్సెన్స్ కంపెనీ టీవీలతో సమానంగా ఉంటుంది,  


Post a Comment

1 Comments