Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

బోట్ ఇయ‌ర్ ఫోన్స్‌.. 30గంట‌ల ప్లేబ్యాక్‌



సంగీత ప్రియుల కోసం బోట్ కంపెనీ కొత్త వైర్‌లెస్ నెక్‌బ్యాండ్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. బోట్ రాకర్జ్ 335(Boat Rockerz 335 ) పేరుతో విడుద‌ల చేసిన ఈ  బ్లూటూత్ వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ ధ‌ర రూ. 1,999. ఈ నెక్‌బ్యాండ్ ప్ర‌స్తుతం ఈ ధ‌ర‌ల శ్రేణిలో  అందుబాటులో ఉన్నవాటిలో  అధునాతనమైనవి. ఇవి ఏకంగా 30 గంట‌ల పాటు ప్లేబ్యాక్ టైం ఇవ్వ‌డం వీటి ప్ర‌త్యేక‌త‌. ఈ నెక్‌బ్యాండ్ వ‌న్‌ప్ల‌స్ బుల్లెట్స్ వైర్‌లెస్ జెడ్ ఇంకా, ఒప్పో ఎంకో ఎం 31 వంటి ఇయ‌ర్‌ఫోన్ల‌కు పోటీ ఇవ్వనున్నాయి. ఇదే ధరల శ్రేణిలో  రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్ లేదా రియల్‌మే బడ్స్ క్యూ వంటి వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నా అవి బోట్ కంపెనీ పేర్కొన్న‌ట్టు బ్యాట‌రీ బ్యాక‌ప్ ను ఇవ్వ‌లేవు.

 బోట్ రాకర్జ్ 335 స్పెసిఫికేష‌న్లు 

 బోట్ రాకర్జ్ 335 ఛార్జీకి 30 గంటల వరకు బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను ఇస్తుంది.  దీంతో రోజంతా పాటలు వినడం లేదా కాల్ చేయడం వంటివి చేయొచ్చు.  ప్ర‌స్తుతం మార్కెట్‌లో ఈ ప్రైస్ రేంజ్‌లో ల‌‌భ్య‌మ‌య్యే ఇయ‌ర్ ఫోన్ల‌లో  అత్య‌ధిక బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను ఇచ్చేది ఇదే. మ‌రో విశేష‌మేమంటే ఇందులో  ఫాస్ట్ ఛార్జింగ్ సౌక‌ర్యం కూడా ఉంది,  కేవ‌లం 10 నిమిషాల ఛార్జ్‌తో 10 గంటల వరకు పాట‌లు వినొచ్చు. 40 నిమిషాల్లో  ఫుల్  ఛార్జ్ చేయొచ్చు. చార్జింగ్ కోసం  USB టైప్-సి పోర్ట్ ఉంటుంది. బోట్ రాక‌ర్జ్ 335 నెక్‌బ్యాండ్‌ .ఎరుపు, పసుపు మరియు నీలి రంగు వేరియంట్‌లలో లభిస్తుంది.

ఇవి కాకుండా, రాకర్జ్ 335 ఇయర్‌ఫోన్‌లు క్వాల్‌కామ్ ఆప్టిఎక్స్ బ్లూటూత్ కోడెక్‌తో వ‌స్తున్నాయి. అలాగే నాయిస్ క్యాన్స‌లేష‌న్ సౌక‌ర్యం ఉటుంది.  ఈ ఇయర్‌ఫోన్‌లలో 10 ఎంఎం డ్రైవర్లను వినియోగించారు. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.0 ఉన్నాయి. అలాగే ఇయర్‌ఫోన్‌లు వాట‌ర్ రెసిస్టెంట్‌. ఈ బ్లూ టూత్ ఇయర్ ఫోన్ ప్రస్తుతం ఫ్లిప్కార్ట్ లో అందుబాటులో ఉంది.


Post a Comment

0 Comments