Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

ప‌బ్జీ కథ ప‌రిస‌మాప్తం



మ‌న‌దేశంలో విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకున్న చైనా గేమింగ్ యాప్ ప‌బ్జీని  డేటా సెక్యూరిటీ లోపాల కార‌ణంగా సెప్టెంబ‌రులో నిషేధించిన విష‌యం తెలిసిందే. మొద‌ట PUBG మొబైల్, PUBG లైట్ వెర్ష‌న్‌ యాప్‌ను గూగుల్ ప్లే, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి తొల‌గించారు. అయితే అప్ప‌టికే మొబైల్ ఫోన్లు, టాబ్‌ల‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న‌వారు ఇప్ప‌టివ‌ర‌కు దానిని వినియోగిస్తూ వ‌స్తున్నారు. కాగా ఇన్‌స్టాల్ చేసిన ప‌బ్జీ మొబైల్ యాప్ కూడా అక్టోబ‌రు 30 నుంచి ఇండియాలో ప‌నిచేయ‌కుండా నిలిపివేశారు.  

ఈమేర‌కు గురువారం, PUBG మొబైల్ ఇండియ‌లో తన అధికారిక ఫేస్బుక్ పేజీ ద్వారా వెల్ల‌డించింది. దేశంలో ప్రస్తుతమున్న  PUBG మొబైల్ నోర్డిక్ మ్యాప్: లివిక్, PUBG మొబైల్ యాప్‌ల‌ను భారతీయ వినియోగదారులకు అన్ని సేవలను, యాక్సెస్‌ను నిలిపివేసిన‌ట్లు ప్ర‌క‌టించింది.  

"వినియోగదారు డేటాను రక్షించేందుకు మేం నిరంతం క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని భారతదేశ డేటా రక్షణ చట్టాలు మరియు నిబంధనలకు లోబడి ఉన్నాము. మా ప్రైవ‌సీ విధానంలో వెల్లడించిన విధంగా వినియోగదారులందరి గేమ్‌ప్లే సమాచారం పారదర్శకంగా ప్రాసెస్ చేయబడుతుంది ”అని PUBG మొబైల్ తెలిపింది. "ఈ ఫలితాన్ని మేము తీవ్రంగా చింతిస్తున్నాము మరియు భారతదేశంలో PUBG మొబైల్‌పై మీ స‌పోర్ట్ మరియు ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు" అని ఆట తన ఫేస్‌బుక్ పేజీలో తెలిపింది.

తాజా మార్పు ఫలితంగా, PUBG మొబైల్ యాప్‌లు ఇకపై భారతదేశంలో అందుబాటులో ఉండవు. అయినప్పటికీ, వినియోగదారులు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) ను ఉపయోగించి ఆటను కొనసాగించే అవ‌కాశ‌ముంది. 

***************

 

Post a Comment

1 Comments