Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Jio Postpaid Plus ప్లాన్ వ‌చ్చేసింది..


దేశీయ టెల్కో జియో సంస్థ త‌న వినియోగ‌దారుల కోసం కొత్త‌గా Jio Postpaid Plus ప్లాన్‌ను ప్ర‌క‌టించింది. తాజా జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్‌లో వీడియో స్ట్రీమింగ్ సేవలు మరియు జియో యాప్స్‌, డేటా రోల్‌ఓవర్ తోపాటు అంతర్జాతీయ కాలింగ్  వంటి సేవ‌లు అందించ‌నున్నారు. ఇందుకోసం జియో చందాదారులు కొత్త సిమ్ కార్డు పొందవలసి ఉంటుంది, అయితే ఫోన్ నంబర్ అలాగే ఉంటుందని కంపెనీ తెలిపింది. జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ 2020 సెప్టెంబర్ 24 నుండి లభిస్తుంది. ఇందులోని అన్ని ప్లాన్ల‌పై కూడా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ + హాట్‌స్టార్ తోపాటు మరిన్ని OTT ఫ్లాట్‌ఫాంల‌ను  ఉచితంగా అందిస్తుంది.  ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ వంటి ఖ‌రీదైన ఓటీటీ యాప్ యాక్సెస్‌ను ఉచితంగా అందించ‌డం ఆహ్వానించ‌ద‌‌గిన విష‌యం. 

జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్లు..

Jio Postpaid Plus  ప్లాన్లు రూ. 399 నుంచి ప్రారంభ‌మై రూ 1,499 వ‌ర‌కు ఉన్నాయి. . ఈ ప్లాన్ల‌న్నీ అపరిమిత వాయిస్ కాలింగ్ సౌక‌ర్యం ఉంంటుంది. రూ. 399 ప్లాన్‌లో 75 జీబీ డేటా, 200 జీబీ డేటా రోల్‌ఓవర్ ఉన్నాయి. రూ. 599 ప్లాన్‌లో 100 జిబి డేటా, 200 జిబి డేటా రోల్‌ఓవర్ వ‌స్తుంది. అలాగే ఫ్యామిలీ ప్లాన్‌తో ఒక అదనపు సిమ్ కార్డ్ ఉన్నాయి. ఇక రూ. 799 ప్లాన్ తో 150 జిబి డేటా, 200 జిబి డేటా రోల్‌ఓవర్ మరియు ఫ్యామిలీ ప్లాన్‌తో రెండు అదనపు సిమ్ కార్డులు లభిస్తాయి. రూ.999 ప్లాన్ చందాదారులకు 200GB డేటా, 500GB డేటా రోల్‌ఓవర్ మరియు ఫ్యామిలీ ప్లాన్‌తో మూడు అదనపు సిమ్ కార్డులు లభిస్తాయి. ఇక చివరగా రూ. 1,499 ప్లాన్ చందాదారులకు 300 జిబి డేటా, 500 జిబి డేటా రోల్‌ఓవర్, యుఎస్ మరియు యుఏఈలో అపరిమిత డేటా మరియు వాయిస్ మరియు ఇతర ప్రయోజనాలు లభిస్తాయి.

సౌక‌ర్యాలు ఇవీ..

Jio Postpaid Plus ‌తో వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపికి చందాలతో పాటు 650 కి పైగా లైవ్ టివి ఛానెల్స్, వీడియో కంటెంట్, 5 కోట్ల పాటలు మరియు 300 కి పైగా వార్తాపత్రికలతో జియో యాప్‌ల‌ను పొందుతారు. వినియోగదారులకు ఇండియాతోపాటు విదేశాలలో 500GB డేటా రోల్‌ఓవర్ మరియు వై-ఫై కాలింగ్ లభిస్తుంది.Jio Postpaid Plus  ప్లాన్‌లలో వివిధ అంతర్జాతీయ రోమింగ్ ప్రయోజనాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులకు విమానంలో కనెక్టివిటీ లభిస్తుంది. చందాదారులు యుఎస్ మరియు యుఎఇలలో అంతర్జాతీయ కాల్స్ ఉచితంగా చేసుకోవ‌చ్చు.  

Jio Postpaid Plus  ప్లాన్‌ను ఇలా పొందండి 

జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్‌లో చేరాలనుకునే పోస్ట్‌పెయిడ్ యూజర్లు వాట్సాప్‌లో 8850188501 నంబ‌ర్‌కు ‘హెచ్‌ఐ’ పంపాలి. అప్పుడు వారు తమ జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ సిమ్ హోమ్ డెలివరీ పొందడానికి jio.com/postpaid ని సందర్శించాలి లేదా 1800 88 99 88 99 కు కాల్ చేయాలి. సిమ్ పొందడానికి వారు సమీప జియో స్టోర్ లేదా రిలయన్స్ డిజిటల్ స్టోర్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు. వారు తమ కుటుంబ సభ్యులను లేదా స్నేహితులను ఫ్యామిటీ ప్లాన్‌తో లింక్ చేయాలనుకుంటే, వారు మైజియో యాప్ ద్వారా చేయవచ్చు.

జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్‌లో చేరాలనుకునే ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్లు  జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ సిమ్ పొందడానికి పైన పేర్కొన్న జియో వెబ్‌సైట్‌ను లేదా జియో డిజిట‌ల్ ఔట్‌లెట్‌ను సందర్శించాలి.  జియో పోస్ట్‌పెయిడ్ ప్లస్ సెప్టెంబర్ 24 గురువారం నుండి అందుబాటులో ఉంటుంది. 




Post a Comment

0 Comments