Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

డ‌బ్బాటీవీల‌ను స్మార్ట్ టీవీలుగా మార్చేయండి

మార్కెట్‌లో ఉత్త‌మ స్ట్రీమింగ్ డివైజ్‌లు ఇవే..

పాత‌కాల‌పు టీవీల‌ను స్మార్ట్ టీలుగా మార్చే స్ట్రీమింగ్ డివైజ్‌ల‌కు ప్ర‌స్తుతం మార్కెట్‌లో మంచి గిరాకీ ఉంది. మీడియా స్ట్రీమింగ్ డివైజ్‌ల సాయంతో డ‌బ్బా టీవీల్లోనూ అమేజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్ తో స‌హా మ‌రెన్నో ఓటీటీ యాప్‌ల సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. అయితే వినియోగ‌దారుల నుంచి వ‌చ్చే డిమాండ్‌తో ప్ర‌ముఖ కంపెనీల‌తో పాటు చిన్నాచిత‌కా సంస్థ‌లు ఈ స్ట్రీమింగ్ ప‌రిక‌రాల‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేస్తున్నాయి.  ప్ర‌స్తుతం అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ (4 కె), నోకియా మీడియా స్ట్రీమ‌ర్‌, ఎంఐ బాక్స్ 4కే, ఎంఐ ఫైర్ టీవీ తోపాటు మ‌రెన్నో కంపెనీల ప‌రిక‌రాలు అందుబాటులో ఉన్నాయి. 

ఆమేజాన్ ఫైర్‌టీవీ 4కే



అద్భుతమైన ఇంటర్‌ఫేస్, అత్యంత ప్రాచుర్యం పొందిన స్ట్రీమింగ్ సేవలతో ఆద‌ర‌ణ పొందింది అమేజాన్ ఫైర్‌టీవీ 4కే డివైజ్‌.  పాపుల‌ర్ ఓటీటీ యాప్స్ మరియు 4 కె, హెచ్‌డిఆర్ కంటెంట్‌ను ప్రసారం చేసే ఈ అమెజాన్ ఫైర్ టివి స్టిక్ 4 కె అమేజాన్ వెబ్‌సైట్‌లో అమ్మ‌కానికి ఉంది. దీని ధ‌ర రూ. 5,999.

ఫైర్ టీవీ స్టిక్ 4 కె రెజెల్యూష‌న్‌తో అమెజాన్ ప్రైమ్ వీడియోల‌ను చూడొచ్చు. అలాగే  ఇందులో నెట్‌ఫ్లిక్స్, జియో సినిమా, హాట్‌స్టార్, గానా, సోనీ లివ్, వూట్, జీ 5, ఎన్‌డిటివి, హఫింగ్టన్ పోస్ట్ మరియు వాషింగ్టన్ పోస్ట్ వంటి ఓటీటీ యాప్‌ల‌ను పొంద‌వ‌చ్చు.  వీటిల్లో కొన్ని కంటెంట్‌ను ఉచితంగా యాక్సెస్ చేయడానికి వీలుంది. మరికొన్ని నెల‌వారీ, ఏడాది స‌భ్యత్వంతో కంటెంట్‌ను పొందవలసి ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఫైర్ టివి స్టిక్ లోని ప్రాధమిక కంటెంట్ ప్లాట్‌ఫాం. అమేజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌తో మీకు అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ ను టీవీలో కూడా ఉచితంగా ఆశ్వాదించ‌వ‌చ్చు. అలాగే ఫైర్ టీవీ స్టిక్ పరిధిలో ప్లే గేమ్‌లను కూడా ఇన్‌స్టాల్ చేయవచ్చు.

అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4 కెలో అతిపెద్ద లోప‌మేంటంటే కంప్లీట్ యూట్యూబ్ యాప్ లేక‌పోవ‌డం . వెబ్ బ్రౌజర్‌గా పనిచేసే యాప్  నుంచి యూట్యూబ్ యొక్క వెబ్ వెర్షన్ ఉప‌యోగించాల్సి ఉంటుంది.  అమేజాన్ ఫైర్ టీవీ స్టిక్‌తో అలెక్సా రిమోట్ వ‌స్తుంది. అమెజాన్ ఫైర్ టివి స్టిక్ 4 కె ఇప్పుడు మిరాకాస్ట్ ద్వారా స్క్రీన్ మిర్రరింగ్‌కు మద్దతు ఇస్తుంది.

 అమెజాన్ ఫైర్ టివి స్టిక్

మీ ఇంట్లో 4 కె లేదా హెచ్‌డిఆర్ స్మార్ట్ టీవీ లేకుంటే అమెజాన్ ఫైర్ టివి స్టిక్‌ని వినియోగించుకోవ‌చ్చు. ఇది కొంచెం ఓల్డ్ వెర్ష‌న్  ఇది 4 కె వెర్షన్ వలె అదే ఇంటర్ఫేస్ అవే యాప్‌లను అందిస్తుంది. అయితే దీనితో ఫుల్ HD కి పరిమితం చేసిన రిజల్యూషన్‌తో 4K మరియు HDR కంటెంట్‌ను ప్రసారం చేయలేరు,  రెగ్యులర్ ఫైర్ టీవీ స్టిక్ ధర రూ. 2,999.   ఇది మిరాకాస్ట్‌కు స‌పోర్ట్ ఇవ్వ‌డం మ‌రో విశేషం. 

నోకియా మీడియా స్ట్రీమ‌ర్ 



ఎంఐ(షావోమీ) ఫైర్‌స్టిక్‌, ఆపిల్ టివి, అమెజాన్ ఫైర్ టివి స్టిక్ ల‌కు పోటీగా నోకియా కంపెనీ కూడా టీవీ స్ట్రీమింగ్ ‌ప‌రిక‌రాన్ని మార్కెట్లో విడుదల చేసింది.  ఇది ప్ర‌స్తుతం ఇండియాలో మాత్ర‌మే అందుబాటులో ఉంది.  ఫ్లిప్‌కార్ట్ లో ఎక్స్‌క్లూజివ్‌గా దీనిని విక్ర‌యించనున్నారు.  నోకియా మీడియా స్ట్రీమర్ ధర ₹ 3,499. నోకియా మీడియా స్ట్రీమర్ డిజైన్ ప‌‌రిశీలిస్తే  ఆపిల్ టీవీల మాదిరిగానే క‌నిపిస్తుది.  వివిధ యాప్ల‌ను స్టోర్ చేయ‌డానికి 1GB RAM మరియు 8GB ఇన్‌బిల్ట్ మెమోరీ ఉంది. నోకియా మీడియా స్ట్రీమర్ ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్‌లో న‌డుస్తుంది. ఇందులో ముంద‌స్తుగా నెట్‌ఫ్లిక్స్, జీ 5, యూట్యూబ్, గూగుల్ మ్యూజిక్, గూగుల్ ప్లే స్టోర్ ఇంకా గూగుల్ ప్లే సినిమాలు వంటి యాప్స్ ఇన్‌స్టాల్ చేసి ఉంటాయి. దీనితోపాటు వ‌చ్చే రిమోట్‌లో నెట్‌ఫ్లిక్స్‌, జీ5 వంటి డెడికేటివ్ బ‌ట‌న్లు ఉన్నాయి. నోకియా మీడియా స్ట్రీమింగ్ పరికరంలో గూగుల్ వాయిస్ అసిస్టెంట్ ఫీచ‌ర్ కూడా ఉండ‌డం విశేషం. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లలో రిమోట్ లాగా మార్చుకోవ‌డానికి ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. 

ఆపిల్ టీవీ 4 కె


అమేజాన్ ఫైర్‌టీవీ 4కే స్ట్రీమింగ్ ప‌రికరం మాదిరిగానే ప్ర‌ఖ్యాత‌  ఆపిల్  సంస్థ కూడా ఆపిల్ టీవీ 4కే ప‌రిక‌రం అందుబాటులో ఉంది. ఇది మిగ‌తా అన్నింటికంటే పిక్చ‌ర్‌ నాణ్యత, స్టేబిలిటీ, యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్ వంటి విష‌యాల్లో ఉత్త‌మ‌మైన‌ది.  కానీ దీని ధ‌ర చాలా ఎక్క‌వ. ఆపిల్ టీవీ 4 కె ధర రూ.32 జీబీ వెర్షన్‌కు రూ.15,900 ,  64 జిబి వెర్షన్‌కు రూ.17,900. అమెజాన్ ఫైర్ టివి స్టిక్ 4 కె ధర కంటే మూడు రెట్లు ఎక్క‌వ.  

ఆపిల్ ప‌రిక‌రాలు వాడేవారికి ఇదేమంత పెద్ద మొత్తం కాబోదు. ఆపిల్ టీవీ 4 కె తో, మీరు 4 కె మరియు హెచ్‌డిఆర్ కంటెంట్‌ను సపోర్ట్ చేసే ప్రొవైడర్ల నుండి యాక్సెస్ చేయవచ్చు. ఇందులో ఐట్యూన్స్ మూవీస్, నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో ఉన్నాయి. అలాగే హాట్స్టార్, జియో సినిమా, ది వాషింగ్టన్ పోస్ట్, ఎన్డిటివి, సోనీ లివ్ మరియు జీ 5 తో సహా ఇతర యాప్‌ల‌ను అందిస్తుంది. ఫైర్ టీవీ స్టిక్‌తో పోలిస్తే ఇందులో హెవీ గేమ్స్ ఆడొచ్చు.  

షియోమి మి బాక్స్ 4 కె/ ఎంఐ టివి స్టిక్


ఇటీవలికాలంలో అమేజాన్ ఫైర్ టీవీ స్టిక్ మాదిరిగానే ఇండియాలో చైనాకు చెందిన షియోమి మి బాక్స్ 4 కె బాగా పాపుల‌ర్ అయింది. దీని ధ‌ర రూ. 3,499. ఈ ప‌రికరాన్ని టీవీలోని HDMI పోర్ట్‌లోకి ప్లగ్ చేపి వాడుకోవ‌చ్చు ఈ స్ట్రీమింగ్ ప‌రిక‌రం  Android TV 9 పై టీవీని  నడుపుతుంది, ఇందులో  Google Play స్టోర్ నుండి వివిధ యాప్‌ల‌ను మరియు గేమ్‌ల‌ను డౌన్‌లోడ్ చేసుకొని వాడుకోవ‌చ్చు. ఎంఐ బాక్స్‌తోపాటు వ‌చ్చే రిమోట్ ఉపయోగించి ఆప‌రేట్ చేయొచ్చు. ఎంఐ టివి స్టిక్  పరికరం ధర రూ. 2,799, మి టీవీ స్టిక్ పూర్తి-హెచ్‌డి రిజల్యూషన్‌లో వీడియోల‌ను చూడొచ్చు.  చిన్న టెలివిజన్ల‌కు ఇది బాగా స‌రిపోతుంది. ఎంఐ బాక్స్ 4 కె మాదిరిగా, ఇది ఆండ్రాయిడ్ టివి 9 పైని నడుపుతుంది మరియు గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్‌ల‌ను గేమ్‌ల‌ను పొంద‌వ‌చ్చు.  

మార్కెట్‌లో మ‌రెన్నో స్ట్రీమింగ్ పరికరాలు

కాంపాక్ట్ స్ట్రీమింగ్ పరికరాలైన మార్క్యూ( ఫ్లిప్‌కార్ట్) టర్బోస్ట్రీమ్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ స్టిక్ వంటివి కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు పరికరాలు ఆండ్రాయిడ్ టీవీలో నడుస్తాయి, ఎయిర్‌టెల్ పరికరం ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లాట్‌ఫామ్‌కు మరింత ప్రాధాన్య‌మిస్తుంది.  మీకు స్మార్ట్ టీవీ లేకపోతే, లేదా మీ ప్రస్తుత టీవీ యొక్క స్మార్ట్ ఇంటర్‌ఫేస్‌తో మీకు న‌చ్చ‌కుంటే ఇటువంటి పరికరాలు బాగా ఉపయోగపడతాయి. వీటితోపాటు మార్కెట్‌లో చాలా స్ట్రీమింగ్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి త‌క్కువ ధ‌ర‌ల‌కు ల‌భిస్తూ స్మార్ట్‌ఫోన్‌లు లేదా కంప్యూటర్ల నుండి స్క్రీన్ మిర్రరింగ్‌కు స‌పోర్ట్ నిస్తాయి. బిగ్గ‌ర్‌, రోకు, ఎన్విడియా షీల్డ్ టివి వంటివి అందుబాటులో ఉన్నాయి. 

=========================================




 

Post a Comment

1 Comments