Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

సాంసంగ్ ఏ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల ధ‌ర‌లు త‌గ్గాయ్‌

ప్రముఖ స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ సాంసం‌గ్ తన ఏ సిరీస్‌లోని ప‌లు ఫోన్ల ధ‌ర‌ల‌ను త‌గ్గించింది. ఏ సిరీస్ ఫోన్లు ఆన్‌లైన్ ఈకామ‌ర్స్ సైట్ల‌తో పాటు ఆఫ్‌లైన్‌లో అన్ని రిటైల్ దుకాణాల్లో ల‌భ్య‌మ‌వుతాయి. కాగా సాంసంగ్ ఫోన్ల‌పై రూ.500 నుంచి రూ.1,500 వరకు  ధ‌ర‌ల‌ను త‌గ్గించారు.  

 సాంసంగ్ గెలాక్సీ ఏ71పై అత్య‌ల్పంగా రూ.500 ధ‌ర త‌గ్గించ‌గా, సాంసంగ్ గెలాక్సీ ఏ51 ధర రూ.1,500 తగ్గింది. శాసంగ్ గెలాక్సీ ఏ71, సాంసంగ్ గెలాక్సీ ఏ51, సాంసంగ్ గెలాక్సీ ఏ31, సాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్, సాంసంగ్ గెలాక్సీ ఎం01ఎస్, సాంసంగ్ గెలాక్సీ ఎం01 కోర్ స్మార్ట్ ఫోన్ల ధరలను  తగ్గించింది.

సాంస‌గ్ గెలాక్సీ ఏ71


సాంసంగ్ గెలాక్సీ ఏ71 స్మార్ట్ ఫోన్ ధర  గ‌తంలో రూ.29,999కి విక్ర‌యించారు. అయితే ప్రస్తుతం ఇది రూ.500 తగ్గింపుతో రూ.29,499కు ల‌భ్య‌మ‌వుతోంది. ఇక స్పెసిఫికేషన్ల విష‌యానికొస్తే ఇందులో వెనుక‌వైపు 64MP + 12MP + 5MP + 5MP క్వార్డ్‌కెమెరా సెట‌ప్ ఉంటుంది. ముందు వైపు  32MP కెమెరా ఉంటుంది. 4500 mAh లిథియం అయాన్ బ్యాట‌రీ,  క్వాల్క‌మ్ SM7150 ప్రాసెస‌ర్‌ను వినియోగించారు. ఇందులో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ ఉంటుంది. సాంసంగ్.కాం, శాంసంగ్ ఒపేరా హౌస్, ఇతర ఆన్‌లైన్ పోర్టల్స్‌లో ఈ ఫోన్ తగ్గిన ధరలకే అందుబాటులో ఉంది. ప్రిజం క్రష్ బ్లాక్, ప్రిజం క్రష్ సిల్వర్, ప్రిజం క్రష్ బ్లూ, హేజ్ క్రష్ సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

సాంసంగ్ గెలాక్సీ ఏ51


ఈ మోడ‌ల్‌ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999 నుంచి రూ.22,999కు త‌గ్గించారు. అంటే రూ.1,000 త‌క్కువ‌కు కొనుగోలు చేయొచ్చు. ఇక 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999 నుంచి రూ.24,499కి త‌గ్గింది. దీనిపై రూ.1,500 డిస్కౌంట్ ల‌భిస్తోంది. ఇక స్పెసిఫ‌కేష‌న్ విష‌యానికొస్తే ఇందులో వాడిన ప్రాసెస‌ర్ పెద్ద డ్రాబ్యాక్‌.. సాంసంగ్ త‌న సొంత ప్రాసెస‌ర్ అయిన ఎక్సినోస్ 9611 ప్రాసెస‌ర్‌ను వినియోగించారు. రీర్ కెమెరా 48MP + 12MP + 5MP + 5MP, ఫ్రంట్ కెమెరా 32ఎంపీ. బ్యాట‌రీ 4000ఎంఏహెచ్‌. ప్రిజం క్రష్ బ్లాక్, ప్రిజం క్రష్ సిల్వర్, ప్రిజం క్రష్ బ్లూ, హేజ్ క్రష్ సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉంది. 

శాంసంగ్ గెలాక్సీ ఏ31


గ‌తంలో ఈ ఫోన్ ధర రూ.20,999గా ఉండ‌గా  ప్ర‌స్తుతం రూ.19,999కు తగ్గించారు. ఇందులో వెనుక‌వైపు 48MP + 8MP + 5MP + 5MP |క్వార్డ్  కెమెరా సెట‌ప్, ముందు వైపు 20ఎంపీ కెమెరాను అమ‌ర్చారు. 5000 mAh లిథియం అయాన్ బ్యాట‌రీ ఉంది. ఇందులో వాడిన మీడియాటెక్  (MT6768) Octa Core ప్రాసెస‌ర్ ఈ మోడ‌ల్‌కు పెద్ద డ్రాబ్యాక్‌. ఈ మోడ‌ల్  ప్రిజం క్రష్ బ్లాక్, ప్రిజం క్రష్ వైట్, ప్రిజం క్రష్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డులతో ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ.1,000 తగ్గింపు కూడా లభించనుంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ21ఎస్

ఇందులో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై రూ.1,500, త‌గ్గించారు. ఈ వేరియంట్ ధర రూ.16,499 నుంచి రూ.14,999కు దిగి వచ్చింది. అలాగే 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.17,499 నుంచి రూ.16,499కు తగ్గించారు. ఈ ఫోన్ వెనుక‌వైపు 48MP + 8MP + 2MP + 2MP క్వార్డ్ కెమెరా సెట‌ప్, అలాగే ముందు వైపు 13ఎంపీ కెమెరాను వినియోగించారు. ఇది బ్లాక్, బ్లూ, వైట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. శాంసంగ్, అమెజాన్ వెబ్ సైట్లలో అందుబాటులో ఉంది.  

శాంసంగ్ గెలాక్సీ ఎం01ఎస్

బ‌డ్జెట్ కేట‌గిరిలోని ఈ ఫోన్ ధర రూ.9,999 నుంచి రూ.9,499కు తగ్గింది. ఇందులో వెనుక‌వైపు 13MP + 2MP డుయ‌ల్ కెమెరా, ముందు వైపు | 8MP కెమెరా ఉంటుంది. ఇందులో 4000 mAh బ్యాట‌రీ, అలాగే మీడియాటెక్  MT6762 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌ను వినియోగించారు. ఇది గ్రే, లైట్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్, అమెజాన్ వెబ్ సైట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

సాంసంగ్ గెలాక్సీ ఎం01 కోర్

సాంసంగ్ త‌న ఎంట్రీ లెవ‌న్ స్మార్ట్ ఫోన్  గెలాక్సీ ఎం01కోర్ మోడ‌ల్‌పై రూ.500 తగ్గించారు. ఇందులో 1 జీబీ ర్యామ్ + 16 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.4,999కు, 2 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.5,999కు తగ్గింది. ఇందులో రీర్ కెమెరా 8MP, ఫ్రంట్  5MP కెమెరా ఉంటుంది. సాంసంగ్, అమెజాన్ వెబ్ సైట్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


Post a Comment

0 Comments