ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్2020 ఆఫర్లో భాగంగా విక్రయం
ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్ గురించి అందరికీ తెలిసిందే. కావలసిన వస్తువులను ఆన్లైన్లో ఇంటికి చేరవేసే ఫ్లిప్‌కార్ట్ కంపెనీ తన సొంత బ్రాండ్ తో ఎలక్ట్రానిక్, గృహోపకరణాలను ఉత్పత్తి చేస్తున్నవిషయం చాలా మందికి తెలియదు. ఫ్లిప్‌కార్ట్ సొంత బ్రాండ్ MarQ పేరుతో టీవీలు, వాషింగ్మిషన్లు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాటర్ప్యూరిఫయర్లు ఇతర గృహోపకరణాలను తయారు చేస్తోంది.
ప్రస్తుతం కొనసాగుతున్న ఫ్లిక్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‌లో భాగంగా MarQ Smart Tvలపై పలు ఆఫర్లను ప్రకటించింది. 43అంగుళాల 4కే స్మార్ట్ టీవీని కేవలం రూ.21,999కే విక్రయిస్తోంది. టెలివిజన్లలో చైనా బ్రాండ్లు వద్దనుకునేవారికి అతితక్కువ ధరలో ఈ మార్క్యూ బ్రాండ్ అందుబాటులో ఉంది. దీనితోపాటు తక్కువ ధరలో కొడాక్ కంపెనీకి చెందిన 43 ఇంచుల 4కే స్మార్ట్ టీవీ కేవలం రూ.23,999కే లభిస్తోంది.
Flipkart MarQ భారతదేశంలో తాజాగా మూడు కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. ఇందులో 32 అంగుళాల హెచ్డి టీవీ, 43 అంగుళాల ఫుల్ హెచ్డీ టీవీ, 4 కే అల్ట్రా హెచ్డీ మోడళ్లు ఉన్నాయి. 32 ఇంచుల టీవీ ధర రూ. 11,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ టీవీలు ఆండ్రాయిడ్ 9 ఆపరేటింగ్ సిస్టంపై నడుస్తాయి. అలాగే ఈ టీవీల్లో ఇన్‌బిల్ట్ క్రోమ్‌కాస్ట్ మరియు డాల్బీ ఆడియో సపోర్ట్ కలిగి ఉంటాయి. ఇంకా, కంపెనీ కొత్త మార్క్ స్మార్ట్ హోమ్ స్పీకర్లను కూడా ప్రవేశపెట్టింది.
టీవీల ధరలు ఇలా..
Flipkart స్మార్ట్ టీవీ ధర 32 అంగుళాల మోడల్‌కు రూ.11,999. మరియు 43 అంగుళాల హెచ్డీ మోడల్ ధర రూ. 20,999. ప్రీమియం 4 కె అల్ట్రా హెచ్డి టీవీ మోడల్ ధర రూ. 21,999గా నిర్ణయించారు.
MarQ స్మార్ట్ టీవీ ఫీచర్లు
MarQ స్మార్ట్ టీవీలు రెటీనా-సేఫ్ టెక్నాలజీకి సపోర్టునిస్తాయి. డాల్బీ ఆడియో సరౌండ్ సౌండ్ మరియు ఇన్‌బిల్ట్ క్రోమ్‌కాస్ట్‌తో 20W స్పీకర్లను కలిగి ఉంది. ఈ మూడు టీవీ సెట్లు మాలి 470 జిపియుతో జతచేయబడిన క్వాడ్-కోర్ మీడియాటెక్ సిఎ 53 ప్రాసెసర్ తో పనిచేస్తాయి. ఇవి వైర్లెస్ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.0 ఉంది.
32-అంగుళాల మరియు 43-అంగుళాల HD మోడళ్లు 1GB RAM మరియు 8GB అంతర్గత నిల్వను కలిగి ఉంటాయి. ఈ నమూనాలు క్రోమా డిస్ప్లే ఇంజిన్ టెక్నాలజీతో పాటు కస్టమ్ పిక్చర్ మరియు ఆడియో ట్యూనింగ్కు సపోర్ట్నిస్తాయి. వైర్డ్ కనెక్టివిటీ కోసం ఇవి మూడు హెచ్డిఎంఐ పోర్ట్‌లు మరియు రెండు యుఎస్బి పోర్ట్‌లతో వస్తాయి.
ఇక 43-అంగుళాల 4 కె అల్ట్రా హెచ్డి మోడల్ కస్టమ్ పిక్చర్ మరియు ఆడియో ట్యూనింగ్‌ను కూడా అందిస్తుంది, అయితే వివిడ్ ప్రో 4 కె టెక్నాలజీ మరియు హెచ్‌డిఆర్ 10 తో క్రోమా డిస్ప్లే ఇంజిన్‌కు సపోర్డ్నిస్తుంది. ప్రీమియం మోడల్ 1.5 జిబి ర్యామ్ మరియు 8 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌ను ప్యాక్ చేస్తుంది. ఇందులో నాలుగు హెచ్డిఎంఐ పోర్ట్‌లు, మూడు యుఎస్బి పోర్ట్‌లు ఉండడం విశేషం. మూడు టీవీ సెట్లు మెటల్ రిబ్బన్ స్టాండ్‌తో వస్తాయి.
MarQ by Flipkart Innoview 108cm (43 inch) Ultra HD (4K)
LED Smart Android TV
- ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్
- అల్ట్రా హెచ్డీ (4K) 3840x2160 Pixels
- 20 వాట్స్ స్పీకర్స్
- Netflix|Disney+Hotstar|Youtube
- 60 Hz రీఫ్రెష్ రేట్
- 4 x HDMI | 3 x USB
- ఒక సంవత్సరం వారంటీ
- ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంకుతోపాటు పలు క్రెడిట్కార్డులపై రాయితీలు అందుబాటులో ఉన్నాయి. అలాగే బజాజ్తోపాటు నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్లు ఉన్నాయి.
MarQ స్మార్ట్ స్పీకర్
మార్క్యూ స్మార్ట్ హోమ్ స్పీకర్ గూగుల్ అసిస్టెంట్ పై పనిచేస్తుంది. మరియు హిందీ భాషలో కూడా కంమాడ్స్ను ఇవ్వొచ్చు. స్థూపాకార ఆకారంలో ఉన్న స్పీకర్ రిమైండర్లు మరియు హెచ్చరికలతో పాటు వాతావరణం మరియు ట్రాఫిక్ అప్డేట్స్ ఇస్తుంది. స్పాటిఫై, యూట్యూబ్ మ్యూజిక్ మరియు ట్యూన్ఇన్ వంటి మ్యూజిక్ యాప్‌ల ద్వారా పాటలను స్ట్రీమింగ్‌ను చేయడానికి స్పీకర్ బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ స్పీకర్ కొన్న వినియోగదారులకు జియోసావ్న్ ప్రోకు మూడు నెలల చందా ఉచితంగా లభిస్తుంది. స్పీకర్ 2x వాటేజ్ మరియు ఫార్-ఫీల్డ్ వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీతో వస్తుంది.




2 Comments
Good information
ReplyDeleteNice
ReplyDelete