Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్స్ ఆఫ‌ర్లు ఇవే..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్స్ లో భాగంగా అందించే ఆఫ‌ర్ల స‌మాచారాన్ని ఫ్లిప్‌కార్ట్ వెల్ల‌డించింది. అక్టోబర్ 29 నుండి ఈ అమ్మకాలు ప్రారంభ‌మై నవంబర్ 4 వరకు కొన‌సాగుతాయి. ఇందులో పోకో, మోటరోలా, రియల్‌మీతోపాటు మ‌రిన్ని స్మార్ట్‌ఫోన్‌ల‌పై  డిస్కౌంట్లు ల‌భిస్తాయి. అలాగే వివిధ బ్యాంక్ ఆఫర్‌లతో పాటు. ఫ్లిప్‌కార్ట్ స్వయంగా యాక్సిస్ బ్యాంక్ వినియోగదారులకు డిస్కౌంట్లను అందిస్తోంది. మ‌రోవైపు ఫ్లిప్‌కార్ట్ ఎల్‌జీ జి 8 ఎక్స్‌(డూయ‌ల్ స్క్రీన్ డిస్ప్లే) మోడ‌ల్‌పై భారీ డిస్కౌంట్‌ను ప్ర‌క‌టించింది.  

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ ఆఫర్లు

అక్టోబర్ 29 నుండి బిగ్ దీపావళి మేళాలో రియల్‌మీ నార్జో 20 ప్రో (6GB + 64GB వేరియంట్‌) ఎమ్మార్పీ రూ. 14,999 కాగా ఆఫ‌ర్ కింద రూ.13,999 కి ల‌భిస్తోంది. అలాగే 8GB + 128GB వేరియంట్ పై కూడా రూ. 1,000 డిస్కౌంట్ ఉండొచ్చు.. రియల్‌మె సి 11 మోడ‌ల్ రూ.7499 నుంచి రూ. 6,999కి త‌గ్గింది. రియల్‌మే సి 15 మోడ‌ల్ రూ.9499 నుంచి రూ. 8,999కి త‌గ్గింది.  రియల్‌మే 6(4 జీబీ + 64 జీబీ వేరియంట్‌ ) ఎంఆర్‌పి 13,999 కాగా ప్ర‌స్తుతం 12,999 రూపాయలకు అందుబాటులో ఉంది.  

ఇక పోకో స్మార్ట్‌ఫోన్‌ల విషయానికొస్తే ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో  పోకో సి3 రూ.7,499కి, పోకో ఎం2 రూ.10,999, పోకో ఎం2 ప్రో రూ.13,999 అందుబాటులో ఉన్నాయి. పోకో సి3 (3 జిబి + 32 జిబి) మోడ‌ల్‌పై రూ.500 త‌గ్గింపుతో  రూ. 7,499కి పొంద‌వ‌చ్చు. పోకో ఎం 2 (6 జిబి + 64 జిబి) పై రూ.500 త‌గ్గింపుతో రూ. 10,499కి ల‌భిస్తోంది ప‌లు బ్యాంకు కార్డుల‌తో మ‌రో రూ.500ల‌కు త‌గ్గ‌వ‌చ్చు..  పోకో ఎం 2 ప్రో యొక్క మూడు వేరియంట్‌లపై రూ. 1,000 డిస్కౌంట్ ల‌భిస్తోంది. (4 జిబి + 64 జిబిఔ వేరియంట్ రూ. 12,999కి, 6 జిబి + 64 జిబి వేరియంట్‌  రూ. 13,999 ల‌కు, 6 జిబి + 128 జిబి వేరియంట్‌కు రూ. 15,999 . ఇంకా, పోకో ఎక్స్ 2  6 జిబి + 64 జిబి వేరియంట్ రూ. 20,250కి అలాగే ‌6 జిబి + 128 జిబి వేరియంట్ పై రూ. 1,000 డిస్కౌంట్ ల‌భిస్తోంది అన్ని మొబైళ్ల‌పై అదనంగా, యాక్సిస్ బ్యాంక్ EMI, క్రెడిట్ మరియు డెబిట్ కార్డుల ద్వారా చేసిన లావాదేవీలతో అదనంగా 10 శాతం తక్షణ తగ్గింపును పొందవ‌చ్చు.


మోటరోలా తన మోటరోలా వన్ ఫ్యూజన్ +  ఎంఆర్‌పి రూ.16,999 కాగా రూ. 16,499కు కి ల‌భిస్తోంది . మోటో జి 9 ఎంఆర్‌పి ఎంఆర్‌పి రూ. 11,499కి  బ‌దులుగా రూ. 9,999కి ల‌భిస్తోంది. అలాగే  మోటో ఈ7 ప్లస్ ఎంఆర్‌పి  రూ. 9,499కి బ‌దులుగా రూ.8,499కి రూ. వెయ్యి డిస్కౌంట్‌లో ల‌భిస్తున్నాయి.  యాక్సిస్ బ్యాంక్ కార్డుల ద్వారా చేసిన లావాదేవీలతో 10 శాతం తక్షణ తగ్గింపు ఇక్కడ కూడా చెల్లుతుంది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి మేళాలో భాగంగా ఐఫోన్ ఎక్స్‌ఆర్ రూ. 47,500 (64 జిబి) పై 7,900 తగ్గింపుతో 39,999కి ల‌భిస్తోంది. ఐఫోన్ ఎస్‌ఇ (64 జిబి) ధర రూ.39000 కాగా ప్ర్రస్తుతం . 32,999 కి అందుబాటులో ఉంది.  

ఫ్లిప్‌కార్ట్ ఈ ఆఫ‌ర్ల‌ను మొద‌లు పెట్టినప్ప‌టి నుంచి అంద‌రి దృష్టి ఎల్‌జీ డూయ‌ల్ స్క్రీన్ మోడ‌ల్  ఎల్‌జీ జీ 8 ఎక్స్‌పై ప‌డింది. ఈ ఫోన్ సాధారణంగా రూ. 54,990, కాగా డిస్కౌంట్ సేల్స్‌లో భాగంగా దీనిని కేవ‌లం రూ. 24,990కే విక్ర‌యించ‌నున్నారు. ఇది నవంబర్ 3 న మధ్యాహ్నం 12 గంటల నుంచి  అందుబాటులో ఉంటుంద‌ని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్ ఇటీవల తన బిగ్ బిలియన్ డేస్ మేళా సంద‌ర్భంగా ఈ మోడ‌ల్‌ను రూ.19,900కే విక్ర‌యించిన విష‌యం తెలిసిందే.  

ఇక ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్స్‌లో భాగంగా మిగ‌తా ఫోన్లు శామ్‌సంగ్, నోకియా, ఒప్పో, వివో,  షియోమి, ఇన్ఫినిక్స్,  టెక్నో, హానర్ ఇంకా మరెన్నో ఫోన్ల పై ఆక‌ర్ష‌నీయ‌మైన డిస్కౌంట్లను అందిస్తోంది. 

-------------------------------

Post a Comment

0 Comments