అందుబాటులో మరో నాన్ చైనా బ్రాండ్..
దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ సంస్థ నుంచి ఎల్జీ వెల్‌వెట్ స్మార్ట్ ఫోన్ త్వరలో ఇండియాలో విడుదల చేయడానికి సిద్ధమవుతోది. కొన్ని నెలల క్రితం ఎల్‌జీ వెల్‌వెట్ 5జీ వేరియంట్‌ను అమెరికా, దక్షిణ కొరియా, యూరప్ వంటి మార్కెట్లలో విడుదల చేశారు. అయితే. ఎల్జీ తరువాత 5జి నెట్‌వర్క్ అందుబాటులోని మార్కెట్ల కోసం వెల్వెట్ యొక్క 4జి వేరియంట్‌ను విడుదల చేసింది, ఇది కూడా మన దేశానికి రాబోతోంది.
ఆఫ్‌లైన్ రిటైలర్ సుప్రీం మొబైల్స్ భారతదేశంలో ఎల్జీ వెల్వెట్ కోసం ముందస్తు ఆర్డర్లను తీసుకోవడం ప్రారంభించింది. కాగా ఎల్జీ వెల్వెట్‌కు ఇండియాలో రూ.39,990 ధర నిర్ణయించినట్లు పలు సామాజిక మాధ్యమాల్లో లీక్‌లు వచ్చాయి. అలాగే, అదనపు డ్యూయల్ స్క్రీన్ యాక్సెసరీ కలిగిన ఎల్జీ వెల్వెట్ ఫోన్ రూ.49,990కి ప్రీ-బుకింగ్ కోసం సిద్ధంగా ఉంది. ఈ నెలాఖరులోగా ఎల్‌జీ వెల్వెట్‌ను కంపెనీ విడుదల చేయనున్నప్పటికీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. వన్‌ప్లస్, శామ్‌సంగ్, ఒప్పో, గూగుల్ వంటి ఫోన్‌లకు ఈ ఎల్‌జీ వెల్‌వెట్ స్మార్ ఫోన్ గట్టి పోటీ ఇవ్వనుంది.
ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించడానికి తన ఫోన్ స్వరూపాన్ని అందంగా తీర్చిదిద్దింది. ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్లు ఆకట్టుకునేలా ఉన్నాసాఫ్ట్ వేర్ అప్‌డేట్‌లు అందించే విషయంలో మాత్రం ఎల్‌జీ ఎంతో వెనుకబడిపోయింది. ఎల్జీ కస్టమర్లకు ఇది ప్రధాన సమస్య.
LG వెల్వెట్ స్పెసిఫికేషన్లు..
ఎల్జీ వెల్వెట్ 6.8-అంగుళాల 1080p పోల్డ్ డిస్ప్లేతో 20.5: 9 కారక నిష్పత్తితో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్లో ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌ను వినియోగించారు. ఫోన్ యొక్క 5 జి వేరియంట్‌లో స్నాప్‌డ్రాగన్ 765 జి SoC వినియోగించారు. ఇందులో 8GB RAM , 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మైక్రో ఎస్టీ కార్డ్‌తో మెమోరీని 2TB వరకు పెంచుకోవచ్చు. ఎల్జీ వెల్వెట్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై నడుస్తుంది.
ఎల్జీ వెల్వెట్ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను చూడవచ్చు. ఇందులో 48 మెగాపిక్సెల్ లెన్స్ (ఆటో ఫోకస్ షూటర్), 8 మెగాపిక్సెల్ (అల్ట్రావైడ్ సెన్సార్), 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఇక ముందు వైపు సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరి ఉంటుంది. ఇది డిస్ప్లే పైభాగంలో ఉన్న గీత లోపల ఉంటుంది. LG వెల్వెట్ స్టైలస్‌కు సపోర్ట్‌తో వస్తుంది అలాగే IP68 డస్ట్, వాటర్ రిసిస్టెంట్‌గా ఉంటుంది. ఎల్‌జీ వెల్వెట్‌కు 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయగలిగిన 4300 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అమర్చారు.



0 Comments