Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

మోట‌రోలా నుంచి కొత్త స్మార్ట్ టీవీలు

ఆండ్రాయిడ్ 10తో న‌డిచే తొలి టీవీలు ఇవే..

ఇన్‌బిల్ట్ సౌండ్‌బార్‌తో 50వాట్స్ సౌండ్ ఔట్‌పుట్‌




టెలివిజ‌ర్ రంగంలో మోటరోలా సంస్థ దూసుకుపోతోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్2020 వేదిక‌గా ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫీచ‌ర్లు క‌లిగిన స్మార్ట్ టీవీల‌ను తాజాగా విడుద‌ల చేసింది.  ఈ కొత్త స్మార్ట్ టీవీల‌న్నీ గూగుల్‌ ఆండ్రాయిడ్ 10 ఆప‌రేటింగ్ సిస్టంపై న‌డుస్తాయి. ఆండ్రాయిడ్ 10 ఆప‌రేటింగ్ సిస్టంతో వ‌చ్చిన తొలి స్మార్ట్ టీవీలు ఇవే కావ‌డం విశేషం. ఫ్లిప్ కార్ట్‘బిగ్ బిలియన్ డేస్ లో భాగంగా అక్టోబర్ 15 నుంచి అందుబాటులో ఉంటాయి.  మోటరోలా  మొత్తం నాలుగు కొత్త స్మార్ట్ టీవీలను  విడుద‌ల చేసింది. అవి 32-ఇంచుల‌ HD, 40- ఇంచుల ఫుల్ HD, 43 ఇంచులు, 55-ఇంచుల 4K రిజల్యూషన్ టీవీలు ఉన్నాయి. 
 

రేవౌ,  మోటరోలా జెడ్‌ఎక్స్-2 స్మార్ట్ టీవీల ధరలు..

మోటరోలా రెవౌ 55-ఇంచుల అల్ట్రా హెచ్‌డి  టీవీ ఇది ప్రీమియం కేట‌గిరీ కింద‌కు వ‌స్తుంది. దీని ధ‌ర రూ. 40,999. మోటరోలా రేవౌ రేంజ్‌లో మరో స్మార్ట్ టీవీ ఉంది, ఇది మోటరోలా రేవౌ 43-అంగుళాల అల్ట్రా హెచ్‌డి టీవీ అని పిలుస్తారు. దీని ధ‌ర 30,999.  అలాగే మోటరోలా జెడ్‌ఎక్స్ 2 సిరీస్ లో మోటరోలా జెడ్‌ఎక్స్ 2 32ఇంచుల హెచ్‌డి రెడీ టీవీ ధర రూ. 13,999, మోటరోలా జెడ్‌ఎక్స్ 2 40ఇంచుల ఫుల్-హెచ్‌డీ టీవీ ధర రూ.19,999. ఈ స్మార్ట్ టీవీలన్నీ అక్టోబర్ 15 నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించబడతాయి.

మోటరోలా రేవౌ, జెడ్‌ఎక్స్ 2 స్మార్ట్ టీవీల స్పెసిఫికేష‌న్లు

కొత్తగా ప్ర‌వేశ‌పెట్టిన నాలుగు మోటరోలా స్మార్ట్ టీవీలు ఆండ్రాయిడ్ 10 ఫ్లాట్‌ఫాంపై ప‌నిచేస్తాయి. 1.5GHz CA53 క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో న‌డుస్తాయి. ఈ టీవీల్లో 2GB RAM మరియు మాలి- G52 GPU ను వినియోగించారు. 
మోటరోలా జెడ్‌ఎక్స్ 2 సిరీస్‌లో ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ 16 జిబి ఉంటుంది. అయితే మోటరోలా ప్రీమియం సిరీస్ అయిన మోట‌రోలా రేవౌ టీవీల్లో 32 జిబి ఇన్‌బిల్ట్ మెమోరీ ఉంటుంది. అన్ని టీవీలు డాల్బీ అట్మోస్, డాల్బీ ఆడియో, డాల్బీ స్టూడియో సౌండ్, డాల్బీ విజన్ మరియు హెచ్‌డిఆర్ 10 మద్దతును ఇస్తుండ‌డం గొప్ప విష‌యం. మోట‌రోలా రేవౌ, జెడ్ ఎక్స్ టీవీలు రెండూ  డ్యూయల్-బ్యాండ్ వై-ఫైకు క‌నెక్ట్ అవు‌తాయి.  

మోటరోలా రెవౌ శ్రేణి స్మార్ట్ టీవీలు మెటల్ వైర్ ఫినిషింగ్ కలిగి ఉన్న స్పేస్‌మాటిక్ స్టాండ్‌తో వస్తాయి. ఈ టీవీల బిల్ట్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఇది డ్యూయల్-టోన్ స్వీడిష్ ఫినిషింగ్‌తో వ‌స్తాయి. ఇంటిగ్రేటెడ్ సౌండ్‌బార్ రేజర్ సన్నని డిజైన్ మరియు టీవీ అంచులు స‌న్న‌గా ఉంటూ ఆక‌ర్ష‌నీయంగా క‌నిపిస్తుంది. 55-అంగుళాల మోడల్‌లో రెండు స్పీకర్లు, రెండు ట్వీటర్లు ఉన్నాయి. 50వాట్స్ సౌండ్ ఔట్‌పుట్ ఇస్తుంది. ఇక. 43 అంగుళాల మోడల్ రెండు స్పీకర్లతో మొత్తం 24W అవుట్పుట్ తో వస్తుంది 

 


Post a Comment

2 Comments

  1. Brother e Blog theme free theme ee na? Free theme ki adsense approval vastada. Reply and help brother

    ReplyDelete
  2. Hi Arun garu.. nenu vaadedi free theme.. free theme ki kuda Adsense ok avuthundi.. kani seo cheyali.. anni rules kachitam ga patinchali

    ReplyDelete