Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

రూ.54వేల ఫోన్.. రూ.20వేల‌కే..

డూయ‌ల్ స్క్రీన్ ఫోన్ ఎల్‌జీ 8ఎక్స్ పై బంప‌ర్ ఆఫ‌ర్

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్‌లో భాగంగా 71శాతం డిస్కౌంట్‌



ఈసారి ద‌స‌రా దీపావ‌ళి ప‌ర్వ‌దినా సంద‌ర్భంగా ఫ్లిప్‌కార్ట్‌, అమేజాన్ ఇత‌ర ఈ కామ‌ర్స్ సంస్థలు అనేక ఆక‌ర్ష‌ణీయ‌మైన ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియ‌న్ డేస్ 2020లో భాగంగా LG G8X ThinQ డ్యూయ‌ల్ స్క్రీన్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై ప్ర‌క‌టించిన ఆఫ‌ర్ అందరినీ విస్మ‌యానికి గురిచేసింది. అన్ని ర‌కాలుగా అత్యాధునిక ఫీచ‌ర్లు క‌లిగిన ఈ ఫోన్‌పై ఏకంగా 71% డిస్కౌంట్ ప్ర‌క‌టించ‌డంతో అంద‌రి దృష్టి దీనిపై ప‌డింది.  దీని ధ‌ర ప్ర‌స్తుతం రూ.54,999 ఉండ‌గా ఆఫ‌ర్ కింద రూ.19,990కే ల‌భించ‌నుంది. కొన్నాళ్ల క్రితం ఇదే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ ఆఫ‌ర్ కింద LG G8X ThinQ ఫోన్‌పై రూ.15వేల డిస్కౌంట్ ప్ర‌కటించింది. కానీ ఈ ఫోన్ ఎవ‌రికీ అందుబాటులోకి రాలేదు. అప్పుడు ఈ ఆఫ‌ర్ కేవ‌లం బిజినెస్ ట్రిక్‌గా అంద‌రూ కొట్టి ప‌డేశారు. తాజాగా బిగ్ బిలియ‌న్ డేస్‌లో కూడా అలాగే వ్య‌వ‌హ‌రిస్తారా అంద‌రూ అనుమానిస్తున్నారు. ఏదిఏమైనా ఈనెల 16న ఫ్లిప్‌కార్ట్‌లో దీనిని విక్ర‌యించనున్నారు. ఆ రోజు కోసం వినియోగ‌దారులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. LG G8X ThinQ మోడ‌ల్‌కు చాలా ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి. ఇది రెండు స్క్రీన్‌ల‌ను క‌లిగి ఉండి దేనిక‌ది ఇండిపెండెంట్ గా ప‌నిచేస్తాయి.  

 LG G8X ThinQ ప్ర‌త్యేక‌త‌లు ఇవీ..

ఇది డ్యూయల్ స్క్రీన్ మొబైల్, రెండు స్క్రీన్ల‌పై రెండు వేర్వేరు యాప్‌ల‌ను ఒకే సారి ఉప‌యోగించుకునే వెసులుబాటు ఉంటుంది. రెండు స్క్రీన్ల‌ను 360 ° తో మల‌చ‌వ‌చ్చు. సౌకర్యవంతంగా వీడియోస్ చూసేందుకు స్క్రీన్‌ను ఏ కోణంలోనైనా తిప్పడానికి సహాయపడుతుంది.  ఈ IP68 సర్టిఫైడ్ ఫోన్ అధునాతన 32 బిట్ హాయ్-ఫై క్వాడ్ DAC తో వస్తుంది, మ్యూజిక్‌ను లౌడ్‌గా, స్ప‌ష్టంగా వినిపిస్తుంది.  3డి సరౌండ్ సౌండ్‌తో పాటు స్టీరియో స్పీకర్లను ఇందులో వినియోగించారు. అంతేకాకుండా అత్యంత సమర్థవంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ ఏ విధంగానూ స్ట్ర‌క్ కాకుండా మ‌ల్టీటాస్కింగ్‌తో అద్భుత ప‌నితీరును క‌న‌బ‌రుస్తుంది. ఎల్‌జీ జి 8 ఎక్స్‌లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు, అలాగే ఆక‌ర్ష‌ణీయ‌మైన డూయల్ స్క్రీన్ డిస్ప్లేలో పక్కపక్కనే పని చేయవచ్చు.

ఒకేసారి తెర‌లు

LG G8X  ఫోన్‌  రెండు స్క్రీన్లలో ఒకేసారి పనిచేయవ‌చ్చు. ఒక వేళ మీకు రెండు తెర‌లు అవ‌సరం లేకుంటే సెకండ‌రీ స్క్రీన్‌ను వేరుచేసి  మొబైల్‌ను సాధారణ ఫోన్‌గా  ఉపయోగించవచ్చు. రెండు స్ర్కీన్ల ఫోన్ కాబ‌ట్టి దీనిని చిన్న‌పాటి  ల్యాప్‌టాప్‌గా ఉపయోగించుకోవచ్చు 

వాట‌ర్ రిసిస్టెంట్‌

LG G8X ఫోన్ AI యాక్షన్ షాట్ ఫీచర్‌తో వస్తుంది. మంచి నాణ్య‌మైన ఫొటోలు, వీడియోల‌ను తీయ‌వ‌చ్చు.  ఎల్జీ జి 8 ఎక్స్ ఫోన్లో  ఫ్రంట్ కెమెరాతో అండర్ గ్లాస్ డిజైన్ కలిగి ఉంటుంది. డిస్ప్లే ప‌రిశీలిస్తే  16.25 సెం.మీ (6.4) OLED ఫుల్‌విజన్ డిస్ప్లేతో వస్తుంది, అండ‌ర్ డిస్ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్ ఉంది. LG G8X అనేది IP68 సర్టిఫైడ్ పరికరం కాబ‌ట్టి వాట‌ర్ రిసిస్టెంట్‌గా ప‌నిచేస్తుంది. ఫోన్‌పై నీరు డ‌స్ట్ ప‌డినా స‌మ‌స్య ఉండ‌బోదు.  ఇందులో  4000 mAh బ్యాటరీని వినియోగించారు . 

డిస్ల్పే ఫీచ‌ర్లు 

  • సైజ్ 16.26 cm (6.4 inch)
  • రెజొల్యూష‌న్  2340 x 1080 pixel
  • రెజొల్యూష‌న్ టైప్  Full HD+ , Display Type G-OLED
  • HD Game Support

---------------------------

ప్రాసెస‌ర్ 

  • క్వాల్క‌మ్ స్నాప్‌డ్రాగ‌న్ ™ 855 ఆక్టాకోర్ (up to 2.84 GHz x 1 + 2.42 GHz x 3 + 1.79 GHz x 4)
  • ప్రైమ‌రీ క్లాక్ స్పీడ్ 2.84 GHz, సెకండ‌రీ Clock Speed 2.42 GHz

మెమోరీ 

  • రామ్ 6 GB
  •  ఇంట‌ర్న‌ల్ స్టోరేస్  128 GB
  • ఎక్స్‌పాండ‌బుల్ అప్‌టూ  2 TB
  • డెడికేటెడ్ మెమోరీ కార్డ్ స్లాట్  

---------------------------------

కెమెరా సెట‌ప్  

  • ప్రైమ‌రీ కెమెరా  12MP + 13MP
  • సెకెండ‌రీ కెమెరా  32MP  Flash
  • కెమెరా ఫీచ‌ర్లు, హెచ్‌డీ, ఫుల్ హెచ్‌డీ రికార్డింగ్‌


-----------------------------------------------------

LG Velvet SmartPhone


Post a Comment

1 Comments