అక్టోబర్ 16 నుంచి 20వరకు డిస్కౌంట్ సేల్స్
‘కమ్ మెయిన్ దమ్’ దీపావళి విక్రయాల కోసం వినియోగదారులు తాము కొనాలనుకుంటున్న ఉత్పత్తులను ఎంచుకోవాలని స్నాప్‌డీల్ సర్వే చేపట్టగా అందులో పాల్గొన్న 1.25 లక్షలకు పైగా, 42 శాతం మంది రోజువారీగా ఉపయోగించుకునే గాడ్జెట్లను ఎంచుకున్నారు. 38 శాతం మంది వినియోగదారులు వంట సామగ్రిని ఎంచుకున్నారు. ఆ తరువాత గృహ అలంకరణ, గిఫ్టు వస్తువులు మరియు దుస్తులు ఎంచుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్లాట్‌ఫాం గత మూడు నెలల్లో 10,000 మంది అమ్మకందారులను చేర్చింది. గత సంవత్సరంతో పోలిస్తే ఉత్పత్తులకు తక్కువ ధర నిర్ణయించడానికి తయారీదారులతో ఒప్పందాలను కుదుర్చుకుంది. అలాగే స్నాప్‌డీల్ తన లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను అదనంగా 25 కొత్త కేంద్రాలకు విస్తరించుకుంది. అంతేకాకుండా దీపావళి సేల్స్ కు ముందస్తుగా రాబోయే రోజుల్లో మరిన్ని నగరాలకు విస్తరించాలని భావిస్తోంది.
బ్యాంకు కార్డులపై ఆఫర్లు..
స్నాప్‌డీల్ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి, బ్యాంక్ ఆఫ్ బరోడా, రత్నాకర్ బ్యాంక్ కార్డులపై డిస్కౌంట్‌తో పాటు పేటిఎం వంటి సంస్థల ఇ-వాలెట్ ఆఫర్లను అందించనుంది. స్నాప్‌డీల్ తన వినియోగదారులు ఎక్కువ శాతం మెట్రోయేతర నగరాల నుంచి వస్తుంన్నందున ఇది తన యాప్‌లో ఎనిమిది భాషలను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌లో ఇప్పుడు హిందీ, తెలుగు, తమిళం, పంజాబీ, మలయాళం, కన్నడ, గుజరాతీ, మరియు మరాఠీ లాంగ్వేజ్‌లను ఎంచుకోవచ్చు.
స్నాప్‌డీల్ తాజాగా ఓ కార్యక్రమం మొదలు పెట్టింది. ఇంట్లోనే స్నాక్స్, సావరీలు మరియు స్వీట్లు తయారు చేయడానికి స్మార్ట్ సొల్యూషన్స్‌తో కూడిన‘ ‘Diwali@Home' కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. లైట్లు, డెకర్, సుగంధాలు మరియు అలంకరణలపై అదనపు శ్రద్ధ వహిస్తున్నారు. మెరుగైన పండుగ షాపింగ్ అనుభవం కోసం నవరాత్రి, కార్వా చౌత్, ధంతేరాస్ మరియు మరెన్నో వాటి కోసం ప్రత్యేకమైన థీమ్ ఇ-స్టోర్లను కూడా కంపెనీ ప్రారంభించనుంది.



2 Comments
Nice
ReplyDeleteGood information
ReplyDelete