ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా రేపు విడుదల
స్మార్ట్ ఫోన్లకు ప్రసిద్ధి చెందిన మోటరోలా కంపెనీ క్రమంగా గృహోపకరణాల తయారీ రంగంలోకి ప్రవేశిస్తోంది. కొన్నాళ్ల కిందట పలు స్మార్ట్ టీవీలను విడుదల చేసిన మోటోరోలా కొత్తగా రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్‌మిషన్లను ప్రవేశపెట్టనుంది. బిగ్ బిలియన్ డేస్ వేదికగా ఫ్లిప్‌కార్ట్‌లో అక్టోబర్ 9 న మధ్యాహ్నం 3 గంటలకు వీటిని ప్రారంభించనున్నారు. సంబంధిత వివరాలను ఫ్లిప్‌కార్ట్ తన మోటరోలా స్టోర్ పేజీలో వెల్లడించింది. అయితే ఉపకరణాలపై పూర్తి వివరాలు అందుబాటులో ఉంచలేదు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లో వీటి ప్రారంభోత్సవానికి సంబంధించి వర్చువల్ ఈవెంట్ ఉంటుంది, అది ఫ్లిప్‌కార్ట్‌లోనే ప్రసారం చేయనున్నారు..
ఫ్లిప్‌కార్ట్‌లోని మోటరోలా స్టోర్ పేజీ ప్రకారం ఎయిర్ కండీషనర్, వాషింగ్ మెషీన్ మరియు మోటరోలా బ్రాండింగ్‌తో కూడిన రిఫ్రిజిరేటర్ ఈనెల 9న మధ్యాహ్నం 3 గంటలకు ఇండియాలో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మోటరోలా సంస్థకు సంబంధించి స్మార్ట్. " ఉపకరణాల సమాచారం అందుబాటులో లేదు. అయితే మోటోరోలా నుంచి ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెషీన్ మరియు డబుల్ డోర్ ఫ్రిజ్ ప్రారంభించబడుతుందని స్పష్టమవుతోంది. ప్రస్తుతానికి, ఉపకరణాలు, ధర, స్పెస్పెసిఫికేషన్ల మరియు లభ్యత గురించి ఖచ్చితమైన వివరాలు తెలియవు. బిగ్ బిలియన్ డేస్ విక్రయాలు ఈనెల 16 నుంచి ప్రారంభమవుతాయి. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ఈనెల 15 నుంచే మొదలవుతుంది.
బిగ్ బిలియన్ డేస్ వేదికగా ఎన్నో ఉత్పత్తులు
ప్రముఖ బ్రాండ్‌లతో భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఫ్లిప్‌కార్ట్ తన ‘బిగ్ బిలియన్ డేస్ స్పెషల్స్’ లో కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తుంది. ఈ ఏడాది ఫ్లిప్‌కార్ట్ కొత్త 3-ఇన్ -1 స్మార్ట్ వైర్‌లెస్ డివైజ్ కోసం మోటరోలా, అలాగే నోకియా స్మార్ట్ టీవీలను ముందుకు తెస్తోంది. అలాగే కొత్త వైరస్ డీయాక్టివేటర్ ఏసీలను ప్రారంభించడానికి ఫ్లిప్‌కార్ట్ బ్లూస్టార్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా 200 కంటే ఎక్కువ స్పెషల్ ఎడిషన్ ఉత్పత్తులను అందించడానికి మరెన్నో బ్రాండ్లు ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో వస్తున్నాయి.
---------------------------



2 Comments
Nice anna
ReplyDeleteNice
ReplyDelete