Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

నోకియా నుంచి 4జీ బడ్జెట్ ఫోన్లు

దేశీయ టెల్కో జియోకు పోటీగా ఫిన్‌లాండ్‌కు చెందిన నోకియా సంస్థ తాజాగా  4జీని స‌పోర్ట్ చేసే రెండు ఫీచ‌ర్ ఫోన్ల‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. నోకియా   215 4జి, నోకియా 2254 జి ఫీచర్ ఫోన్లు భారతదేశంలో లాంచ్ అయ్యాయి. కొత్త నోకియా ఫోన్లు 4 జి వీవోఎల్‌టీఈ  కాలింగ్‌కు స‌పోర్ట్‌ ఇస్తాయి. అంతేకాకుండా  వైర్‌లెస్ ఎఫ్‌ఎం రేడియో కూడా ఇందులో ఉంటాయి.  ఫీచర్ ఫోన్‌లలో డెడికేటెడ్  ఫంక్షన్ కీలు కూడా ఉన్నాయి. సింగిల్ చార్జిపై ఏకంగా 24 రోజుల స్టాండ్‌బై సమయాన్ని అందించ‌డం విశేషం.  నోకియా 225 4 జి మోడ‌ల్ రీర్ కెమెరా కూడా ఉంటుంది. అయితే నోకియా 215 4జి, నోకియా 225 4 జి తొలుత‌ ఈ నోకియా 215 4జి, నోకియా 225 4జి ధరలు నెలలో చైనాలో ప్ర‌వేశ‌పెట్టారు.  

నోకియా 215 4జి, నోకియా 225 4జి ధరలు..

ఇండియాలో నోకియా 215 4జి ధర రూ. 2,949గా నిర్ణ‌యించారు. ఇక‌ నోకియా 225 4జి ధర రూ. 3,499. నోకియా 215 4జి బ్లాక్, సియాన్ గ్రీన్ కలర్ల‌లో అందుబాటులో ఉంది. ఇక నోకియా 225 4జి బ్లాక్, క్లాసిక్ బ్లూ మరియు మెటాలిక్ సిలికాన్ షేడ్స్‌లో ల‌భిస్తోంది. నోకియా 215 4జి, నోకియా 225 4జి అక్టోబర్ 23 శుక్రవారం నుండి నోకియా ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండగా, ఆఫ్‌లైన్ రిటైలర్లు నవంబర్ 6 నుండి ఫోన్‌లను విక్ర‌యాల‌ను ప్రారంభించనున్నారు. నోకియా 225 4 జి శుక్రవారం నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా లభిస్తుంది.

నోకియా 215 4జి, 225 4జి స్పెసిఫికేషన్లు

రెండూ సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా RTOS లో నడుస్తాయి.  2.4-అంగుళాల QVGA డిస్ప్లేతో వస్తాయి. మైక్రో SD కార్డ్ (32GB వరకు) ద్వారా విస్తరించగలిగే 128MB ఆన్‌బోర్డ్ మెమోరీ ఉంటుంది. ఇక కనెక్టివిటీ పరంగా, నోకియా 215 4 జి మరియు నోకియా 225 4 జి రెండూ 4జి వీవోఎల్‌టీఈ , బ్లూటూత్ 5.0, ఎఫ్ఎమ్ రేడియో, మైక్రో-యుఎస్బి పోర్ట్ మరియు 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కలిగి ఉన్నాయి. ఫోన్లు ముందే ఇన్‌స్టాల్ చేసిన ఎమ్‌పి 3 ప్లేయర్‌తో వస్తాయి.

నోకియా ఫోన్ల‌లో1,150 ఎంఏహెచ్ రిమూవ‌బుల్ బ్యాట‌రీ ఉంటుంది. ఈ ఫోన్లు వెనుక‌వైపు 0.3మెగాపిక్సెల్ కెమెరాను క‌లిగి ఉంటాయి. నోకియా 215 90.3గ్రాములు, నోకియా 225 90.1గ్రాముల బ‌రువు ఉంటుంది.

వీవోఎల్టీఈ స‌పోర్ట్ క‌లిగి ఉన్నందున ఈ రెండు ఫోన్లలో జియో సిమ్‌ల‌ను వినియోగించుకోవ‌చ్చు. త‌క్కువ ధ‌ర‌లో 4జీ సేవ‌ల‌ను వినియోగించుకోవాలంటే ఈ ఫోన్ల‌పై ఓ లుక్కేయ‌వ‌చ్చు.


Post a Comment

2 Comments