Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Vi(వోడాఫోన్ -ఐడియా ) డబుల్ డేటా ప్రీపెయిడ్ ప్లాన్స్‌

 రూ. 299 నుంచి ప్లాన్లు మొద‌లు
గ‌రిష్టంగా 336 GB వరకు డేటా 
 


ఇటీవల Vi గా మ‌న‌ముందుకు వ‌చ్చిన వోడాఫోన్ ఐడియా త‌న ప్రీపెయిడ్ ప్లాన్‌లపై ఇప్పుడు డ‌బుల్‌ డేటాను అందిస్తోంది. దీని ప్ర‌కారం వినియోగదారులు త‌మ ప్లాన్‌పై రెట్టింపు డేటా ప్రయోజనాన్ని పొందుతారు. ఈ ప్లాన్లు ఆన్‌లైన్ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేయ‌డానికి, కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి లేదా వ‌ర్క్ ఫ్రం హోమ్ విధానంలో ప‌నిచేస్తున్న‌వారికి ఉప‌యుక్తంగా ఉంటాయి. వీఐ  రూ.929, రూ.449, రూ.699 ధరతో మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి.  

డబుల్ డేటా ఇచ్చే Vi ప్రీపెయిడ్ ప్లాన్లు

 Vi Rs 299 ప్రీపెయిడ్ ప్లాన్: 

ఈ డబుల్ డేటా ప్లాన్ లో రోజుకు 4GB డేటా ల‌భిస్తుంది. 28 రోజుల వాలిడిటీ ఉంటుంది. మొత్తం 114 జీబీ డేటాను 28 రోజులు తీసుకుంటుంది. ఈ ప్లాన్ అన్ని నెట్‌వర్క్‌లకు లోకల్‌  లేదా నేష‌నల్ కాల్స్ చేసుకోవ‌చ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్ పంపుకోవ‌చ్చు. Vi ఇటీవల డేటా రోల్‌ఓవర్ ప్రయోజనాన్నికూడా అందుబాటులోకి తెచ్చింది. ఇది వినియోగదారులు వారంలో డేటాను కూడబెట్టుకోవడానికి మరియు వారాంతంలో ఉపయోగించడానికి వీలుంటుంది. అలాగే వీఐ ఈ ప్లాన్‌తో అద‌న‌పు సౌక‌ర్యాలు అందిస్తోంది. ఈ ప్లాన్‌తో రూ .125 విలువైన ఆఫ‌ర్ల‌ను పొంద‌చ‌వ్చు. జోమాటో మరియు వి మూవీస్ & టివి యాక్సెస్ నుంచి ఫుడ్ ఆర్డర్‌లపై రోజూ రూ.75  తగ్గింపు. ఈ ప్రణాళికలో ఇటీవల ప్రారంభించిన వారాంతపు రోల్‌ఓవర్ ప్రయోజనం ఒక సంవత్సరానికి ఉంటుంది. 

Vi Rs 449 ప్రీపెయిడ్ ప్లాన్: 

ఈ డబుల్ డేటా ప్లాన్ 56 రోజుల చెల్లుబాటులో (2 ప్లస్ 2) రోజుకు 4GB డేటాను ఇస్తుంది. 56 రోజుల పాటు 224GB ల‌భిస్తుంది. ఈ ప్లాన్‌తో అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత లోక‌ల్‌, నేష‌న‌ల్ల్ కాల్స్ చేసుకోవ‌చ్చు. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా ఉంటాయి. మ‌రోవైపు Vi  డేటా రోల్‌ఓవర్ ప్ర‌యోజ‌నం కూడా ఉంటుంది. దీనితో వినియోగదారులు వారంలో డేటాను పోగుచేసుకొని వారాంతంలో వాడుకోవ‌చ్చు. వీటితోపాటు  రూ.125 భరోసా బోనస్ నగదు, జోమాటో మరియు వి మూవీస్ & టివి యాక్సెస్ నుండి ఫుడ్ ఆర్డర్‌లపై రోజూ రూ.75  తగ్గింపు ల‌భిస్తుంది.  

Vi రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్:

 ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాలు పైన పేర్కొన్న ప్లాన్ల‌కు సమానంగా ఉంటాయి. అయితే ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్ కోసం మొత్తం డేటా స్ప్రెడ్ 84 రోజులకు 336GB అవుతుంది. ఇక కాలింగ్, ఎస్ఎంఎస్ మరియు రోల్ఓవర్ డేటా ప్రయోజనాలు ఈ ప్లాన్‌కు మిగ‌తా ప్లాన్ల మాదిరిగానే ఉంటాయి.  

వీఐ వెబ్ మరియు యాప్ నుంచి  మాత్రమే రీఛార్జ్ చేసుకునే కొన్ని ప్లాన్‌ల కోసం Vi ఇటీవల 5GB అదనపు డేటా ప్రయోజనాన్ని పరిమితం చేసింది. ఈ ప్లాన్‌లు Vi యాప్ నుంచి రీచార్జ్ చేస్తే  రోజుకు 1.5GB డేటా తోపాటు అదనంగా 5GB డేటా ల‌భిస్తుంది. ఇటువంటి ప్లాన్ల వివ‌రాలు ఇవీ..

Vi Rs 249 ప్రీపెయిడ్ ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీ ఉంటుంది. రోజుకు 1.5GB డేటాను ఇస్తుంది. Vi యాప్ నుంచి వినియోగదారులు ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేస్తే, వారికి అద‌నంగా 5GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ కింద అన్‌లిమిటెడ్ లోక‌ల్ కాల్స్ తోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ల‌భిస్తాయి.  

Vi రూ 399 ప్రీపెయిడ్ ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 56 రోజుల వాలిడిటీ ఉంటుంది.  రోజుకు 1.5GB డేటాను ఇస్తుంది. Vi యాప్‌ను యాప్ నుంచి వినియోగదారులు ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేస్తే, వారికి 5GB అదనపు డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ లో కూడా అపరిమిత కాల్స్ , రోజుకు 100 SMS లను అందిస్తుంది.

Vi 599 ప్రీపెయిడ్ ప్లాన్: ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 56 రోజుల వాలిడిటీతో రోజుకు 1.5GB డేటాను ఇస్తుంది. Vi యాప్ నుంచి ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేస్తే అద‌నంగా 5GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ లో కూడా అపరిమిత కాల్స్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. పైన పేర్కొన్న అన్ని ప్లాన్లు వారాంతపు రోల్‌ఓవర్ ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి, దీని ద్వారా వినియోగదారులు డేటా మరియు అధిక వాచ్ షోలను పోగుచేసుకోవ‌చ్చు. లేదా వారాంతాల్లో డేటా-హెవీ డౌన్‌లోడ్‌లను చేసుకోవ‌చ్చు.  

Post a Comment

1 Comments

  1. is it available in warangal?sounds intresting. as data usage is increased with online classes consuming more and more data..even gb is not sufficient for online classes.useful information

    ReplyDelete