Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

వాట్స‌ప్‌లో మ‌రో ఆక‌ర్ష‌ణీయ ఫీచ‌ర్

చాట్‌ నోటిఫికేష‌న్ల‌ను శాశ్వ‌తంగా మ్యూట్ చేయండిలా



వాట్స‌ప్ మ‌రో ఫీచ‌ర్‌ను జ‌త చేసింది. గ్రూప్ చాట్‌ సెట్టింగులలో మ్యూట్ నోటిఫికేష‌న్ విభాగంలో  కొత్తగా ‘ఆల్‌వేస్ ఎంపిక ఎనేబుల్ చేసింది. దీనిద్వారా ఏదైనా వాట్సప్ గ్రూప్‌ను శాశ్వ‌తంగా  మ్యూట్ చేయడానికి వెసులుబాటు ఉంటుంది. ఈ ఫీచ‌ర్‌ను వాట్స‌ప్ బీటా వెర్షన్‌లో పరీక్షించ‌గా ఇప్పుడు ఇది అంద‌రికీ అందుబాటులోకి వ‌స్తోంది. ఈ విష‌య‌మై వాట్స‌ప్ డెవలపర్లు ట్విట్టర్‌లో వెల్ల‌డించారు.  ప్ర‌స్తతం మ్యూట్ నోటిఫికేష‌న్‌లో 8 గంటలు, 1 వారం, ఒక సంత్స‌రం వంటి ఆప్ష‌న్లు ఉన్నాయి. తాజా అప్‌డేట్‌తో ఆల్‌వేస్ అనే ఆప్ష‌న్ కూడా వ‌చ్చి చేర‌నుంది. ఇది వ్యక్తిగత చాట్‌లను లేదా గ్రూప్ చాట్‌లను శాత్వ‌తంగా మ్యూట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

వాట్సాప్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. యూజర్లు ఇప్పుడు తమ చాట్లను శాశ్వ‌తంగా మ్యూట్ చేయవచ్చని పేర్కొంది. మ్యూట్ చాట్ సెట్టింగ్‌లు ఇప్పుడు ‘8 గంటలు’, ‘1 వీక్‌’ మరియు ‘ ఆల్‌వేస్  ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి.  ఒక సంవ‌త్స‌రం ఆప్ష‌న్ స్థానంలో ఇప్పుడు ఆల్‌వేస్ అనే ఆప్ష‌న్ ఉంటుంది.  వాట్సాప్ ఆ చాట్ కోసం నోటిఫికేషన్లను చూపించాలా వద్దా అని మీరు ఇంకా ఎంచుకోవాలి. ఈ క్రొత్త ఫీచర్ iOS మరియు Android పరికరాల్లో, అలాగే వాట్సాప్ వెబ్‌లో కూడా ఉంది.

ఫీచ‌ర్ సెట్టింగ్ ఇలా..

గ్రూప్ మ్యూట్ నోటిఫికేష‌న్ ను శాశ్వ‌తంగా మ్యూట్ చేయడానికి, చాట్‌ను తెరవండి, కుడిపైపు పైన ఉన్న మెను నొక్కండి ఆ త‌ర్వాత నోటిఫికేషన్‌లను మ్యూట్ చేయండి. అక్కడ ఉన్న మూడు ఆప్ష‌న్ల‌ను మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. అందులో చివర‌గా క‌నిపించే ఆల్‌వేస్ అనే ఆప్ష‌న్ ఎంచుకుని ఒకే బ‌ట‌న్‌ నొక్కండి. మీరు అల‌ర్ట్ లేకుండా నోటిఫికేషన్‌లను చూడాలనుకుంటే షో  నోటిఫికేషన్ ఆప్ష‌న్‌ను ఎంచుకోవచ్చు. మ్యూట్ చేసిన తర్వాత, మ్యూట్ నోటిఫికేషన్ ఎంపికకు బదులుగా చాట్ సెట్టింగులలో అన్మ్యూట్ నోటిఫికేషన్స్ ఎంపికను మీరు చూడవచ్చు. ఈ నెల ప్రారంభంలో ఈ  ‘ఆల్వేస్’ మ్యూట్ ఫీచర్ వాట్సాప్ బీటా వెర్షన్ 2.20.201.10 తో పాటు మరికొన్ని ఫీచర్లతో కనిపించింది.  

-----------------------------

 ఇవి కూడా చ‌ద‌వండి 

Post a Comment

0 Comments