Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

ఈ స్మార్ట్ టీవీలతో బొమ్మ దద్దరిల్లిపోతుంది..

స్మార్ట్ టెలివిజన్స్ విత్ ఇన్‌‌బిల్ట్ సౌండ్‌బార్స్‌



క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కూ సినిమా థియేట‌ర్లు తెరుచుకోలేదు. దీంతో కొత్త సినిమాల‌న్నీ ఓట‌టీలోనే విడుద‌ల‌వుతున్నాయి. సినిమా ప్రేమికులు స్మార్ట్‌ఫోన్లు, టెలివిజ‌న్ల‌లోనే చూడాల్సి వ‌స్తోంది. అయితే థియేట‌ర్ల‌లో చూసిన అనుభూతి వీటితో క‌లుగ‌దు. అందుకే వినియోగ‌దారులు అధునాతన‌ సౌండ్ సిస్టం క‌లిగిన స్మార్ట్ టీవీల‌ను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. స్మార్ట్ టీవీల‌తోపాటు విడిగా హోమ్ థియేట‌ర్ లేదా సౌండ్‌బార్ల‌ను ప్ర‌త్యేకంగా కొంటున్నారు. వినియోగ‌దారుల అభిరుచిని బ‌ట్టి ప‌లు టీవీల కంపెనీలు ఇప్పుడు స్మార్ట్‌టీవీల‌కే సౌండ్‌బ‌ర్ల‌ను అమ‌ర్చి త‌యారు చేస్తున్నారు. వీటి ధ‌ర‌లు కూడా త‌క్కువ‌గానే ఉంటున్నాయి. 

జ‌ర్మ‌నీకి చెందిన బ్లౌపంక్ట్ కంపెనీ సౌండ్‌బార్ క‌లిగిన‌ స్మార్ట్ టీవీల‌ను ఇండియాలో కొన్నేళ్ల క్రితం విడుద‌ల చేసింది. అక్క‌డి నుంచి మొద‌లు వీయూ(అమెరికా), నోకియా, మోట‌రోలా టీవీలు కూడా సౌండ్‌బార్ క‌లిగిన స్మార్ట్‌టీవీల‌ను ఉత్ప‌త్తి చేసి అమ్మ‌కాలు కొన‌సాగిస్తున్నాయి.  ఈ టీవీలు చాలావ‌ర‌కు డాల్బీ, డీటీఎస్, డాల్బీ అట్మాస్; డ‌ల్బీ విజ‌న్‌కు స‌పోర్ట్ ఇవ్వ‌డం మ‌రో విశేషం.

Vu  Cinema Android Smart LED TV ( వీయూ సినిమా సిరీస్‌)


అమెరికా కాలిఫోర్నియాకు చెందిన వీయూ సినిమా టీవీ సిరీస్ ఇండియాలో చాలా పాపుల‌ర్ అయ్యాయి. అమేజాన్‌లో వీటిని ఎక్స్‌క్లూజింవ్‌గా విక్ర‌యిస్తున్నారు. వినియోగదారుల నుంచి వ‌స్తున్న డిమాండ్ కార‌ణంగా ఆన్‌లైన్‌లో వీయూ సినిమా సిరీస్ ఎప్పుడూ అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తోంది. 

Vu  (43 inches) 4K Ultra HD Cinema Android Smart TV 

Vu Cinema  4K (43 inches)  ధ‌ర :  రూ.36,900 

VU Cinema Full HD  ₹20,999 (Flipkart)

  • రిజల్యూషన్: 4 కె అల్ట్రా HD (3840x2160) | రిఫ్రెష్ రేట్: 60 హెర్ట్జ్ | వోల్టేజ్  ఎసి 230వి
  • కనెక్టివిటీ: సెట్ టాప్ బాక్స్, బ్లూ-రే ప్లేయర్స్, గేమింగ్ కన్సోల్ | కనెక్ట్ చేయడానికి 3 HDMI పోర్టులు హార్డ్ డ్రైవ్‌లు, 2 యుఎస్‌బి పోర్ట్‌లు
  • సౌండ్ : 40 వాట్స్ అవుట్పుట్,  4 స్పీకర్‌తో ఫ్రంట్ సౌండ్‌బార్,  డాల్బీ ఆడియో ప్రాసెసింగ్ , డైరెక్షనల్ సౌండ్ కోసం మాస్టర్ మరియు ట్వీటర్ స్పీకర్లు
  • స్మార్ట్ టీవీ ఫీచర్స్: ఆండ్రాయిడ్ పై 9.0 | గూగుల్ ప్లే స్టోర్ | గూగుల్ ఎకో సిస్టమ్ (సినిమా, టీవీ, మ్యూజిక్, గేమ్స్),  గూగుల్ గేమ్స్ | ఇన్‌బిల్ట్ క్రోమోకాస్ట్,  ఆపిల్ ఫోన్ కనెక్టివిటీ కోసం మ‌ల్టీ స్క్రీన్ షేరింగ్‌ | బ్లూటూత్ 5.0 | డెమో మరియు ట్రబుల్షూటింగ్ కోసం ప్ర‌త్యేకంగా వీయూ హెల్ప్ యాప్  
  • డిస్ప్లే : పిక్సెలియం బ్రైట్‌నెస్ టెక్నాలజీ | డీపర్ బ్లాక్ I కోసం ఇంటెలిజెంట్ బ్యాక్‌లైట్ 500 నిట్స్ బ్రైట్‌నెస్ | అప్‌స్కేలర్ చిప్ | VOD  | డాల్బీ విజన్, HDDR10, HLG | క్రికెట్ మోడ్ | PC మరియు గేమ్ మోడ్
  • అడిష‌నల్ స్పెసిఫికేష‌న్లు : రోబోటిక్ అసెంబ్లీ | లో బెజెల్ లెస్ డిజైన్ |  లైసెన్స్ పొందిన యాప్‌లు యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, గూగుల్ ప్లే | రిమోట్ కంట్రోల్‌పై హాట్‌కీలు | బ‌య‌ట నుంచి సౌండ్ సిస్టమ్‌ను కనెక్ట్ చేయడానికి ARC మరియు ఆప్టికల్ పోర్ట్
  • వారంటీ సమాచారం: కొనుగోలు చేసిన తేదీ నుండి వు అందించిన 1 సంవత్సరం వారంటీ
---------------------------------------- 

Nokia  LED Smart Android TV with Sound by Onkyo


32inch, 43inch Nokia Smart TV: 

నోకియా స్మార్ట్ టీవీ 32 ఇంచ్ మోడ‌ల్‌లో HD (1,366 × 768 పిక్సెల్స్) రిజల్యూషన్‌లో పనిచేస్తుంది. డిస్ప్లే 3000: 1 కాంట్రాస్ట్ రేషియోకు మద్దతు ఇస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 9  ఆప‌రేటింగ్ సిస్టంపై న‌డుస్తుంది. టెలివిజన్ మాక్స్బ్రైట్ డిస్ప్లే, మైక్రో డిమ్మింగ్, 1.5 జిబి ర్యామ్ + 8 జిబి స్టోరేజ్ ఉంటుంది. అలాగే క్వాడ్ కోర్ మాలి జిపియును ఉంటుంది. ఈ టీవీ 39W ఔట్‌పుట్ క‌లిగిన ఓన్కియో సౌండ్‌బార్‌ను అమ‌ర్చారు. ఈ సౌండ్ బార్‌లో 24W క్వాట్రోఎక్స్ స్పీకర్లు మరియు 15W ట్వీటర్లు ఉన్నాయి. ఈ టెలివిజన్‌లో రెండు USB, మూడు HDMI పోర్ట్‌లను చూడ‌వ‌చ్చు. Wi-Fi మరియు బ్లూటూత్. టీవీ రిమోట్‌లో ప్రత్యేకమైన నెట్‌ఫ్లిక్స్ మరియు జీ 5 హాట్‌కీలు ఉన్నాయి. 43 అంగుళాల నోకియా స్మార్ట్ టీవీలో కూడా పైన పేర్కొన్న ఫీచ‌ర్లు ఉంటాయి. ఒకే తేడా ఏమిటంటే ఇది ఫుల్ హెచ్‌డి (1,920 × 1,080 పిక్సెల్‌లు) రిజల్యూషన్‌తో మాక్స్బ్రైట్ డిస్ప్లే ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ లో నోకియా టీవీల‌ను ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉన్నాయి. ప్ర‌స్తుతం బిగ్ దీపావళి సేల్స్‌లో భాగంగా వీటిపై ప‌లు ఆఫ‌ర్లు ఉన్నాయి.  

43inch, 50inch 4K Smart TVs

43 ఇంచ్‌ 4కె నోకియా స్మార్ట్ టివిలో అల్ట్రా హెచ్‌డి రిజల్యూషన్, హెచ్‌డిఆర్ 10 సపోర్ట్‌తో మాక్స్బ్రైట్ డిస్‌ప్లే ఉంటుంది.  ఆండ్రాయిడ్ 9 ఆప‌రేటింగ్ సిస్టంపై న‌డుస్తుంది. దీనిలో మైక్రో డిమ్మింగ్, 5,000: 1 కాంట్రాస్ట్ రేషియో, క్వాడ్-కోర్ SoC మరియు 2GB RAM + 16GB స్టోరేజ్ స‌పోర్ట్ ఉంటుంది. ఇక టీవీతోపాటు వ‌చ్చే 34వాట్స్ ఓంక్కో ‌ సౌండ్‌బార్‌లో 24W స్పీకర్లు మరియు 15W ట్వీటర్లు ఉంటాయి. కనెక్టివిటీ పరంగా.. నోకియా స్మార్ట్ టీవీలో మూడు హెచ్‌డిఎంఐ, రెండు యుఎస్‌బి పోర్ట్‌లు, వై-ఫై,  బ్లూటూత్ వంటి ఫీచ‌ర్లు చూడ‌వ‌చ్చు. 

మరోవైపు 50 అంగుళాల నోకియా స్మార్ట్ టీవీ 4 కె మోడ‌ల్‌లో మాక్స్ బ్రైట్ డిస్ప్లే, హెచ్‌డిఆర్ 10 సపోర్ట్ ఉంటుంది.  మిగతా అన్ని ఫీచర్లు ఒకేలా ఉన్నాయి, కానీ ఒకదానితో 30W స్పీకర్లు, 18W ట్వీటర్లతో 48W సౌండ్‌బార్ లభిస్తుంది. దీనికి డాల్బీ ఆడియో స‌పోర్ట్‌ కూడా ఉంది.  

Nokia 55 inch,  65 inch 4K Smart TVs: 

నోకియా 55 ఇంచ్‌, 65 ఇంచ్ 4కే స్మార్ట్ టీవీలు MaxBrite display తో వస్తాయి, ఇవి అల్ట్రా HD (3,840 × 2,160 పిక్సెల్స్) రిజల్యూషన్, HDR10 సపోర్ట్ చేస్తాయి. 55-అంగుళాల మోడల్‌లో 420 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది. 65-ఇంచ్ వేరియంట్ 450 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంటుంది.  ఆండ్రాయిడ్ టీవీలు క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తాయి, ఇవి 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ స్టోరేజ్‌తో  వ‌స్తాయి.. ఇందులో  30W స్పీకర్లు మరియు 18W ట్వీటర్లతో 48W ఔట్‌పుట్ క‌లిగిన సౌండ్‌బార్ లభిస్తుంది. కనెక్టివిటీ విష‌యానికొస్తే  వై-ఫై మరియు బ్లూటూత్, రెండు యుఎస్‌బి మరియు మూడు హెచ్‌డిఎంఐ పోర్ట్‌లు ఉన్నాయి.

============================

  మోటరోలా  రేవౌ, జెడ్‌ఎక్స్-2 స్మార్ట్ టీవీ  


మోటరోలా రెవౌ 55-ఇంచుల అల్ట్రా హెచ్‌డి  టీవీ ఇది ప్రీమియం కేట‌గిరీ కింద‌కు వ‌స్తుంది. దీని ధ‌ర రూ. 40,999. మోటరోలా రేవౌ రేంజ్‌లో మరో స్మార్ట్ టీవీ ఉంది ఇది మోటరోలా రేవౌ 43-అంగుళాల అల్ట్రా హెచ్‌డి టీవీ దీని ధ‌ర 30,999.  అలాగే మోటరోలా జెడ్‌ఎక్స్ 2 సిరీస్ లో మోటరోలా జెడ్‌ఎక్స్ 2 32ఇంచుల హెచ్‌డి రెడీ టీవీ ధర రూ. 13,999, మోటరోలా జెడ్‌ఎక్స్ 2 40ఇంచుల ఫుల్-హెచ్‌డీ టీవీ ధర రూ.19,999. ఈ స్మార్ట్ టీవీలన్నీ ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించబడతాయి.
  • Motorola ZX2 32-inch HD Ready TV : Rs. 13,999  
  • Motorola ZX2 43inch FHD TV : Rs. 19,999
  • Motorola revou 43inch 4K UHD TV : Rs. 30,999
  • Motorola revou 55inch 4K UHD TV :  Rs. 40,999
మోటరోలా రేవౌ, జెడ్‌ఎక్స్ 2 స్మార్ట్ టీవీల స్పెసిఫికేష‌న్లు
కొత్తగా ప్ర‌వేశ‌పెట్టిన నాలుగు మోటరోలా స్మార్ట్ టీవీలు ఆండ్రాయిడ్ 10 ఫ్లాట్‌ఫాంపై ప‌నిచేస్తాయి. 1.5GHz CA53 క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో న‌డుస్తాయి. ఈ టీవీల్లో 2GB RAM మరియు మాలి- G52 GPU ను వినియోగించారు. 
మోటరోలా జెడ్‌ఎక్స్ 2 సిరీస్‌లో ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ 16 జిబి ఉంటుంది. అయితే మోటరోలా ప్రీమియం సిరీస్ అయిన మోట‌రోలా రేవౌ టీవీల్లో 32 జిబి ఇన్‌బిల్ట్ మెమోరీ ఉంటుంది. అన్ని టీవీలు డాల్బీ అట్మోస్, డాల్బీ ఆడియో, డాల్బీ స్టూడియో సౌండ్, డాల్బీ విజన్ మరియు హెచ్‌డిఆర్ 10 మద్దతును ఇస్తుండ‌డం గొప్ప విష‌యం. మోట‌రోలా రేవౌ, జెడ్ ఎక్స్ టీవీలు రెండూ  డ్యూయల్-బ్యాండ్ వై-ఫైకు క‌నెక్ట్ అవు‌తాయి.  

మోటరోలా రెవౌ శ్రేణి స్మార్ట్ టీవీలు మెటల్ వైర్ ఫినిషింగ్ కలిగి ఉన్న స్పేస్‌మాటిక్ స్టాండ్‌తో వస్తాయి. ఈ టీవీల బిల్ట్ క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. ఇది డ్యూయల్-టోన్ స్వీడిష్ ఫినిషింగ్‌తో వ‌స్తాయి. ఇంటిగ్రేటెడ్ సౌండ్‌బార్ రేజర్ సన్నని డిజైన్ మరియు టీవీ అంచులు స‌న్న‌గా ఉంటూ ఆక‌ర్ష‌నీయంగా క‌నిపిస్తుంది. 55-అంగుళాల మోడల్‌లో రెండు స్పీకర్లు, రెండు ట్వీటర్లు ఉన్నాయి. 50వాట్స్ సౌండ్ ఔట్‌పుట్ ఇస్తుంది. ఇక. 43 అంగుళాల మోడల్ రెండు స్పీకర్లతో మొత్తం 24W అవుట్పుట్ తో వస్తుంది 
---------------------------------------

Blaupunkt Smart TV


జ‌ర్మ‌నీకి చెందిన బ్లోపంక్ట్ టీవీలు కూడా సౌండ్‌బార్‌తో కూడిన స్మార్ట్ టీవీలను ఉత్ప‌త్తి చేస్తోంది. ఈ టీవీలు ఫ్లిప్‌కార్ట్‌, అమేజాన్‌లో అందుబాటులో ఉన్నాయి. బ్లోపంక్ట్ టీవీలు కొన్ని ఎక్స్‌ట‌ర్న‌ల్ సౌండ్‌బార్‌తో కూడా వ‌స్తున్నాయి. అంటే బ్లోపంక్ట్ టీవీ కొంటే ఉచితంగా విడిగా సౌండ్‌బార్‌ను పొంద‌వ‌చ్చు. వీటి ధ‌ర‌లు రూ.19వేల నుంచి ప్రారంభ‌మ‌వుతున్నాయి. 

 Blaupunkt (43-inch) 4K Ultra HD Smart TV

  •  ధ‌ర రూ.27,999
  • రిజల్యూషన్, 3840 x 2160పిక్సెల్స్‌
  • వైఫై, ఈథర్నెట్
  • 4 స్పీకర్లు, 60 w అవుట్పుట్
  • కార్టెక్స్- A53 క్వాడ్ కోర్ 1.5 GHz ప్రాసెసర్, 1 GB RAM, 8 GB నిల్వ
  • 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్
------------------------

 Blaupunkt (49 inch) Ultra HD (4K) LED Smart TV 

  •  ధ‌ర రూ.28,999
  • అల్ట్రా HD (4K) 3840 x 2160 పిక్సెల్స్‌
  • ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 
  • 60 W స్పీకర్ అవుట్పుట్
  • 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 3 x HDMI | 2 x USB
  • A + గ్రేడ్ DLED ప్యానెల్
  • అంతర్నిర్మిత సౌండ్‌బార్ (60W) 

Blaupunkt (55 inch) Ultra HD (4K) LED Smart TV  

  •   ధ‌ర రూ.33,999
  • ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ బేస్డ్
  • అల్ట్రా HD (4K) 3840 x 2160 పిక్సెళ్ళు
  • 60 W స్పీకర్ అవుట్పుట్
  • 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • 3 x HDMI | 2 x USB
  • A + గ్రేడ్ DLED ప్యానెల్
  • అంతర్నిర్మిత సౌండ్‌బార్ (60W)
----------------------------

Post a Comment

1 Comments