Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

అమేజాన్ ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్‌

ఈనెల 22 నుంచి 25వ‌ర‌కు డిస్కౌంట్ సేల్స్‌



ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమేజాన్ మ‌రికొద్ది రోజుల్లో స్మార్ట్ ఫోన్ల‌పై భారీ డిస్కౌంట్ సేల్స్‌ను నిర్వ‌హించ‌నుంది. Amazon Fab Phones Fest Sale పేరుతో జ‌రిగే ఈ అమ్మ‌కాలు డిసెంబర్ 22 నుండి 25వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి. ఈ సేల్స్‌లో స్మార్ట్ఫోన్లు మరియు యాక్సెసిరీస్‌పై సుమారు 40 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. ఇందులో ఆపిల్, శామ్‌సంగ్, వన్‌ప్లస్, షియోమి మరియు మరిన్ని బ్రాండ్ల పై డిస్కౌంట్ ఇత‌ర‌ ఆఫర్‌లను పొంద‌వ‌చ్చు. వీటితోపాటు అమెజాన్ నో-కాస్ట్ EMI ఆప్ష‌న్‌, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.  హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డులు మరియు ఇఎంఐ లావాదేవీలపై 1,500 రాయితీని పొంద‌వ‌చ్చు.

అమెజాన్ వెబ్‌సైట్‌లో Amazon Fab Phones Fest Sale లో రాయితీలు ల‌భించే ఫోన్లు, ఇత‌ర ఉప‌క‌ర‌ణాల జ‌బితా ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈ . ఫోన్లలో ఐఫోన్ 11, వన్‌ప్లస్ 8టి, వన్‌ప్లస్ నార్డ్, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం51, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం21, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం31, రెడ్‌మి 9 ప్రైమ్, మరియు రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ వంటివి ఉన్నాయి. ఏ ఫోన్ల‌పై ఎంత త‌గ్గింపు ఉంటుంద‌నేది ఈనెల 19న అమెజాన్ వెల్లడించ‌నుంది.  పైన చెప్పినట్లుగా, అమ్మకం డిసెంబర్ 22, మంగళవారం నుంచి  ప్రారంభమై క్రిస్మస్ రోజు వరకు కొనసాగుతుంది.

అంతేకాకుండా, అమెజాన్ యొక్క Amazon Fab Phones Fest సందర్భంగా విక్రయించబడే ఉపకరణాలలో పవర్ బ్యాంకులు, హెడ్‌సెట్‌లు, కేసులు, కవర్లు, కేబుల్స్ మరియు ఛార్జర్‌లు కూడా ఉన్నాయి.  అమెజాన్ ప్రస్తుతం జాబ్రా డేస్ సేల్స్‌ను కొన‌సాగిస్తోంది. ఇందులో భాగంగా  ఇది డిసెంబర్ 25 వరకు ఉంటుంది. ఇందులో జబ్రా ఉత్పత్తులను 70 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయ‌వ‌చ్చు.  మ‌రోవైపు ఇటీవల లాంచ్ చేసిన ఫోన్లలో డిస్కౌంట్లను కూడా అందిస్తోంది.  

Post a Comment

1 Comments