- 64ఎంపీ మెయిన్ కెమెరా, 6000ఎంఏహెచ్ బ్యాటరీ
- ధర రూ.11,999(4జీబీ+64జీబీ వేరియంట్)
లెనోవో యాజమాన్యంలోని మోటరోలా సంస్థ ఇండియాలో Moto G9 Power పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. కొత్త మోటో ఫోన్ లో 6,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వస్తుంది. హోల్-పంచ్ డిస్ప్లే డిజైన్ మరియు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను ఇందులో చూడొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ మరియు ఐపి 52 రేటెడ్ వాటర్-రిపెల్లెంట్ ఫీచర్ కూడా ఉండడం విశేషం. మోటరోలా దేశంలో మోటో జి 5జి మోడల్‌ను విడుదల చేసిన కొద్ది రోజులకే మోటో జి 9 పవర్‌ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది.
Moto G9 Power ధర వివరాలు
భారతదేశంలో Moto G9 Power ధరను సింగిల్ వేరియంట్‌నే( 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్)ను తీసుకొచ్చారు. దీని ధర 11,999 రూపాయలు. ఫోన్ ఎలక్ట్రిక్ వైలెట్ మరియు మెటాలిక్ సేజ్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇది డిసెంబర్ 15 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయించనున్నారు. యూరప్‌లో మోటో జి 9 పవర్ ప్రారంభంలో యూరోప్‌లో గత నెలలో ప్రారంభించారు. అక్కడ దీని ధర EUR 199 (సుమారు రూ .17,800).
Moto G9 Power స్పెసిఫికేషన్స్
మోటో జి 9 పవర్‌లో మైక్రో ఎస్‌డి కార్డ్ (512 జిబి వరకు) ద్వారా మెమోరీని విస్తరించుకోవచ్చు. కనెక్టివిటీల విషయానికొస్తే 4జి ఎల్‌టిఇ, వై-ఫై 802.11ac, బ్లూటూత్ వి 5.0, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి, మరియు 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో కూడా ఉంటుంది. మోటరోలా 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో వినియోగిచారు. ఈ ఫోన్ 172.14x76.79x9.66mm మందం, 221 గ్రాముల బరువు ఉంటుంది.
బ్యాంకు ఆఫర్లు ఇవీ..
మోటో జీ9 పవర్ ఫోన్ కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్‌లో పలు ఆఫర్లు ఉందుటాటులో ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డులు లేదా డెబిట్ కార్డ్ తో ఫోన్ను కొనుగోలు చేసే్త రూ.1750 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో 5% డిస్కౌంట్, బ్యాంక్ ఆఫ్ బరోడా మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డ్ తో రూ.100 డిస్కౌంట్ లభించనుంది. అలాగే బజాజ్ ఫిన్‌సర్వ్‌తోపాటు పలు బ్యాంకుల నుంచి ఈఎంఐ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
-------------------------




0 Comments