తక్కువ ధరలోనే మంచి ఫీచర్లు
ఫ్లిప్‌కార్ట్‌లో డిసెంబర్ 29 నుంచి అందుబాటులోకి
స్మార్ట్ఫోన్లకు ప్రసిద్ధి చెందిన నోకియా సంస్థ తాజాగా Nokia Air Conditioners ఉత్పత్తి చేస్తోంది. ఇవి మనదేశంలోనే తయారవుతుతున్నాయి. నోకియా ఏసీలు అత్యాధునిక ఫీచర్లు కలిగి ఉన్నాయి. ఈ మోడళ్లన్నీ వై-ఫై-కనెక్ట్ చేసిన స్మార్ట్ క్లైమేట్ కంట్రోల్ మరియు కాస్టోమైజ్డ్ యూజర్ ప్రొఫైల్‌లతో కూడా వస్తాయి. ఇవీ ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్క్లూజింగ్గా అందుబాటులో ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఎయిర్ కండీషనర్లతో పాటు ఇప్పటికే నోకియా-బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు, మీడియా స్ట్రీమర్ వంటివి కూడా ఉన్నాయి. ఇటీవల టెన్త్ జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్లు, డాల్బీ విజన్ సపోర్ట్ కలిగిన నోకియా ల్యాప్‌టాప్‌లను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే..
నోకియా ఎయిర్ కండీషనర్ల ధర
ఫ్లిప్‌కార్ట్‌లో నోకియా ఎయిర్ కండిషనర్లు డిసెంబర్ 29 నుంచి సేల్స్‌లోకి వస్తాయి. వీటి ప్రారంభ ధర రూ.30,999. అయితే ఈ ఏసీలలో మొత్తం ఐదు వేరియంట్లు ఉంటాయని ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. టన్నుల తేడా మరియు శక్తి సామర్థ్యాలను బట్టి ధరలు ఉంటాయి.
నోకియా ఎయిర్ కండీషనర్స్ ఫీచర్లు
నోకియా ఎయిర్‌కండీషనర్స్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ఫోర్ ఇన్ వన్ అడ్జస్ట్మెంట్ చేయగల ఇన్వర్టర్ మోడ్‌తో పాటు సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీ ఉంటుంది. ఎయిర్ కండీషనర్లు డ్యూయల్ రోటరీ కంప్రెషర్లతో పాటు బ్రష్ లేని డిసి మోటార్లు ఉంటాయి. సిక్స్ ఇన్ వన్ ఎయిర్ ఫిల్టర్లు అలాగే నెగటివ్ అయానైజర్ కూడా ఉంటుంది.



1 Comments
Nice
ReplyDelete