Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

అత్యాధునిక ఫీచ‌ర్ల‌తో వీయూ సినిమా యాక్ష‌న్ టీవీలు

  • 100వాట్స్ ఔట్‌పుట్‌తో జేబీఎల్ స్పీక‌ర్లు
  • ధ‌ర‌.. ఫీచ‌ర్లు ఇవీ.. 


వీయూ సినిమా టీవీ యాక్షన్ సిరీస్ భారతదేశంలో లాంచ్ అయింది.  55ఇంచులు, 65-ఇంచుల వేరియంట్ల‌లో ఇవి అందుబాటులో ఉండ‌నున్నాయి. ఈ యాక్షన్ సిరీస్ గతంలో విడుదలైన వీయూ సినిమా టీవీ సిరీస్‌కు  అప్‌గ్రేడ్‌గా వచ్చింది.  యాక్షన్ సిరీస్‌లో భాగంగా 55LX మరియు 65LX మోడ‌ళ్లు ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ ద్వారా అందుబాటులో ఉంటాయి. వీయూ సినిమా టివి యాక్షన్ సిరీస్‌లో జెబిఎల్ ఆడియో మరియు పిక్సెలియం టెక్నాలజీ 500 నిట్ల గరిష్ట బ్రైట్‌నెస్‌తో ఉంటాయి. అవి మెరుగైన మోషన్ స్మూతీంగ్ (ఎంఇఎంసి) టెక్నాలజీని కూడా కలిగి ఉన్నాయి.

ఇండియాలో వీటి ధ‌ర‌లు..

భారతదేశంలో వీయూ సినిమా టివి యాక్షన్ సిరీస్ 55LX, మోడ‌ల్ ధర రూ. 49,999 ఉండగా, వీయూ సినిమా టీవీ యాక్షన్ సిరీస్ 65LX ధర రూ. 69,999గా నిర్ణ‌యించారు. ఇవి రెండూ అమెజాన్ (55LX, 65LX) మరియు ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.  

వీయూ సినిమా టివి యాక్షన్ సిరీస్ 55LX , 65LX ఫీచర్స్

వీయూ సినిమా టివి యాక్షన్ సిరీస్ 55LX, వీయూ సినిమా టివి యాక్షన్ సిరీస్ 65LX మోడల్స్ గూగుల్ ప్లే యాక్సెస్ తో ఆండ్రాయిడ్ 9.0పై న‌డుస్తాయి.  ఇవి  రెండూ 4కె (3,840x2,160 పిక్సెల్స్) రిజల్యూషన్ కలిగివుంటాయి. 40 శాతం మెరుగైన బ్రైట్‌నెస్‌తో పిక్సెలియం గ్లాస్‌ను ఉపయోగించారు.. 55 ఎల్ఎక్స్ మోడల్ 400 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది, 65 ఎల్‌ఎక్స్ మోడల్‌లో 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కాంపెన్సేషన్ (ఎంఇఎంసి) టెక్నాలజీకి స‌పోర్ట్ ఇసా్త‌యి.  

వీయూ సినిమా టివి యాక్షన్ సిరీస్ 55 ఎల్ఎక్స్, వీయూ సినిమా టివి యాక్షన్ సిరీస్ 65 ఎల్ఎక్స్ హెచ్‌డీఆర్ 10, డాల్బీ విజన్ తో వస్తాయి. అవి ఇన్‌బిల్ట్ క్రోమ్‌కాస్ట్, నెట్‌ఫ్లిక్స్ కోసం లైసెన్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, యూట్యూబ్ మరియు గూగుల్ ప్లేతో పాటు వీయూ యాక్టివాయిస్ కంట్రోల్‌తో ఫాస్ట్ వాయిస్ రికగ్నిషన్‌తో వస్తాయి.  

2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌

రెండు మోడళ్లలో 2 జిబి ర్యామ్ మరియు 16 జిబి స్టోరేజ్ ఉన్న 64-బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్లు ఉన్నాయి. వీయూ సినిమా టీవీ యాక్షన్ సిరీస్ 55 ఎల్ఎక్స్, 65 ఎల్ఎక్స్ మోడ‌ళు్ల డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.0, మూడు హెచ్‌డిఎంఐ పోర్ట్‌లు, రెండు యుఎస్‌బి పోర్ట్‌లు, ఇయర్‌ఫోన్ జాక్ అలాగే  ఆర్జె 45 పోర్టులను కలిగి ఉన్నాయి. రిమోట్‌లో కూడా OTT క‌నెక్టివిటీ కీలు ఉన్నాయి.  ఆరు జెబిఎల్ స్పీకర్ల నుంచి మొత్తం 100W సౌండ్ ఔట్‌పుట్ వ‌స్తుంది. ఇందులో నాలుగు మాస్టర్స్ స్పీక‌ర్లు, మరియు ఇద్దరు ట్వీటర్లు ఉన్నారు. రెండు మోడల్స్ DTS వర్చువల్ X సరౌండ్ సౌండ్ మరియు డాల్బీ ఆడియోకు స‌పోర్ట్ ఇస్తాయి.  

Post a Comment

0 Comments