Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

శాసంగ్ నుంచి మ‌రో బ‌డ్జెట్ ఫోన్‌

డ్యూయల్ రియర్ కెమెరాలతో శామ్సంగ్ గెలాక్సీ M02,  
ధర, స్పెసిఫికేష‌న్లు ఇవీ..


శామ్సంగ్ పంస్థ ఇండియాలో కొత్త‌గా Samsung Galaxy M02 మోడ‌ల్‌ను లాంచ్ చేసింది.  గత ఏడాది జూన్‌లో విడుద‌ల చేసిన గెలాక్సీ ఎం 01 కి ఇది కొన‌సాగింపు.  శామ్సంగ్ గెలాక్సీ M02 డ్యూయల్ రియర్ కెమెరాలతో వస్తుంది. ఇందులో మీడియా టెక్ ప్రాసెస‌ర్‌ను వినియోగించారు. ఇందులో  5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. అలాగే 32 జిబి ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, ఈ గెలాక్సీ ఎం 02 పోకో సి 3, రెడ్‌మి 9, రియల్‌మీ సి 15, మైక్రోమాక్స్ ఇన్ 1 బి వంటి వాటితో పోటీ పడనుంది.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎం02 ధర.. 

ఇండియాలో Samsung Galaxy M02 ధర 2జిబి + 32 జిబి స్టోరేజ్ వేరియంట్‌కు 6,999 రూపాయలు. అయితే తొలిద‌శ‌లో ఆఫ‌ర్ కింద‌ రూ.6,799కి ల‌భ్యం కానుంది.  ఇందులో  3GB + 32GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది అయితే దాని ధ‌ర ఇంకా వెల్ల‌డికాలేదు. గెలాక్సీ M02 బ్లాక్, బ్లూ, గ్రే మరియు రెడ్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇది అమెజాన్, శామ్సంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ తోపాటు ప్రముఖ ఆఫ్‌లైన్ రిటైలర్లలో ఫిబ్రవరి 9 నుంచి విక్ర‌యించ‌నున్నారు.  



Samsung Galaxy M02 స్పెసిఫికేష‌న్స్‌.. 

శామ్‌సంగ్ గెలాక్సీ ఎం 02 మోడ‌ల్ డ్యూయల్ సిమ్ (నానో) క‌లిగి ఆండ్రాయిడ్ 10లో వన్ యుఐతో నడుస్తుంది. ఇది 6.5-అంగుళాల HD + ఇన్ఫినిటీ-వి డిస్ప్లేను కలిగి ఉంది. ఇది మీడియాటెక్ SoC తో పాటు 3GB వరకు RAM తో వస్తుంది.  గెలాక్సీ M02 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. ఈ ఫోన్ ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది.

Samsung Galaxy M02 కనెక్టివిటీ విష‌యానికొస్తే 4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్ / ఎ-జిపిఎస్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. అలాగే 10W ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.  


Post a Comment

0 Comments