Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

సామ్‌సంగ్ ఫోన్ల‌కు వ‌న్ యూఐ 2.1అప్‌డేట్‌

 సామ్సంగ్ గెలాక్సీ M31,  M 21 మోడ‌ళ్ల‌కు అదిరే ఫీచ‌ర్లు



సామ్సంగ్ సంస్థ ప‌లు మోడ‌ళ్ల‌కు వ‌న్‌యూఐ అప్‌డేట్‌ను రోల్ అవుట్ చేయ‌డం ప్రారంభించింది. Samsung Galaxy M31 మరియు Samsung Galaxy M21 మోడ‌ళ్ల‌లో ఈ అప్‌డేట్ ద్వారా కొత్త కెమెరా ఫీచర్లతో సహా కొత్త వన్ యుఐ 2.1 అప్‌డేట్‌లు స్వీక‌రిస్తున్నాయి. గెలాక్సీ M31 కి ఈనెల ప్రారంభంలో ఆండ్రాయిడ్ 10-ఆధారిత వన్ UI 2.1 లభించింది. ఇటీవ‌ల సామ్సంగ్ ఎం 31ఎస్ మోడ‌ళ్లో ప్ర‌వేశ‌పెట్టి న సింగిల్ టేక్, నైట్ హైపర్‌లాప్స్ మరియు మై ఫిల్టర్ వంటి ఆక‌ర్ష‌ణీయ‌మైన కొన్ని కెమెరా ఫీచర్లు తాజా అప్‌డేట్‌తో ఇప్పుడు గెలాక్సీ M31 మోడ‌ల్‌కు అందుతున్నాయి.  

శామ్సంగ్ గెలాక్సీ 31 firmware version  M315FXXU2ATIB ను స్వీకరిస్తుండగా, శామ్సంగ్ గెలాక్సీ M21 పూర్తి ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ UI 2.0 ఎక్స్‌పీరియ‌న్స్ M215FXXU2ATI9 అప్‌డేట్  ద్వారా స్వీక‌రిస్తోంది. అయితే ఈ గెలాక్సీ M31 అప్‌డేట్ సాఫ్ట్‌వేర్ మెమోరీ  498MB కాగా, గెలాక్సీ M21 సాఫ్ట్‌వేర్ మెమోరీ 1,292MB. ఈ అప్‌డేట్తో గెలాక్సీ ఎం 21 స్మార్ట్ ఫోన్‌కు సెప్టెంబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్‌ను కూడా అందుకుంటుంది.

ఆక‌ట్టుకునే సింగిల్ టేక్, నైట్ హైపర్‌లాప్స్ ఫీచ‌ర్లు

ఈ  వన్ UI 2.1 అప్‌డేట్ తో  My Filter అనే అప్ష‌న్ వ‌చ్చి చేరింది. దీనితో మీరు తీయ‌బోయే ఫొటోలకు ప‌లు క‌ల‌ర్ల‌ను, స్టైల్స్‌ను రూపొందించుకునేందుకు మార్చుకోవ‌డం వంటివి చేయ‌వ‌చ్చు.  ఇక సింగిల్ టేక్ ఫీచర్ ద్వారా మీరు ఒక్క క్లిక్‌తో ఒకేసారి ప‌లు ర‌కాల ఫోటోలు మరియు వీడియోలను తీయ‌వ‌చ్చు అలాగే ఈ అప్‌డేట్‌లో నైట్ హైపర్‌లాప్స్ మోడ్, అదే సమయంలో, తక్కువ లైట్‌లో హైపర్‌లాప్స్ వీడియోలను షూట్ చేయడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.  

ఇలా చెక్ చేసుకోండి

సాంసంగ్ విడుద‌ల చేసిన ఈఅప్‌డేట్ ఇండియాతోపాటు ఆసియా మరియు యూరప్‌లోని ఇతర మార్కెట్లలో రోల్ అవుట్ అవుతోంది. ఒక‌వేళ మీ ఫోన్‌కు ఈ అప్‌డేట్ రాక‌పోతే మీరు సెట్టింగులు ఆప్ష‌న్‌లోకి వెళ్లి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ పై క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత డౌన్‌లోడ్ అండ్ ఇన్‌స్టాల్ ను టాప్ చేయ‌డం ద్వారా మాన్యువల్‌గా చెక్ చేసుకోవ‌చ్చు.   

Post a Comment

1 Comments