Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

గూగుల్ మీట్‌కు కొత్త రూపు

తాజా అప్‌డేట్ ద్వారా కొత్త ఫీచ‌ర్లు



గూగుల్ సంస్థ‌కు చెందిన గ్రూప్ మీటింగ్ యాప్ గూగుల్‌మీట్‌కు కొత్త ఆప్‌డేట్ అందుకుంది. దీంతో గూగుల్‌ మీట్ స‌రికొత్త రూపును సంత‌రించుకుంది.  అప్‌డేట్ చేసుకున్న వినియోగ‌దారులు కొత్త ఇంటర్‌ఫేస్ (యుఐ) తో సరికొత్త రూపాన్నిగ‌మ‌నించారు. అప్‌డేట్ అయిన యూఐలో కొన్ని కొత్త బ‌ట‌న్లను తీసుకొచ్చారు. `ఒక వినియోగదారుడు “క్రొత్త సమావేశం” పై క్లిక్ చేసినప్పుడు, అతను లింక్‌ను షేర్ చేయడానికి, తక్షణమే సమావేశాన్ని ప్రారంభించడానికి, క్యాలెండర్‌లో షెడ్యూల్ చేయడానికి మరియు క్లోజ్ చేయ‌డానికి ఆప్ష‌న్ల‌ను పొందగ‌ల‌డు. అంతేకాకుండా, కొత్త గూగుల్ మీట్ దాని పాత ఆకుపచ్చ థీమ్‌ను తొలగించింది మరియు ఇప్పుడు నీలం రంగులో క‌నిపిస్తోంది.  

గూగుల్ మీట్ ఆండ్రాయిడ్ యాప్ కొత్త రూపం ఇకా దాని ఇంట‌ర్‌ఫేస్ (UI) జీమెయిల్ యాప్ ను చూసిన‌ట్లుగా ఉంటుంది. కొత్త ఫీచర్లు మొదట Gmail లోని గూగుల్ మీట్ టాబ్ అలాగే iOS కోసం గూగుల్ మీట్ యాప్ కోసం రూపొందించబడ్డాయి.  ఈ అప్‌డేట్ ఫీచ‌ర్లు ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి వ‌చ్చాయి. గూగుల్ ప్లేస్టోర్ ద్వారా గూగుల్ మీట్ యాప్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా ఈ అధుత‌న ఫీచ‌ర్ల‌ను మ‌నం పొంద‌వ‌చ్చు.  

కొంతమంది వినియోగదారులు చాట్‌బాక్స్ లేకపోవడం గురించి ఫిర్యాదు చేశారు, అయితే ప్రతిసారీ ఎవరైనా సమావేశానికి చేరినప్పుడు లేదా బ‌య‌టికి వెళ్లిన‌ప్పుడు విసుగుతెప్పించేలా నోటిఫికేష‌న్లు వ‌స్తున్నాయి.  

గత నెల, గూగుల్ మీట్ తన మీట్ సేవలో 2021 మార్చి 31 వరకు ఉచిత లాంగ్ కాల్స్ పొడిగింపును ప్రకటించింది. సెప్టెంబర్ చివరిలో ముగుస్తున్న ఈ ఫీచర్ ఇప్పుడు ఉన్నట్లుగానే కొనసాగుతుందని కంపెనీ తెలిపింది.  అలాగే కాల్ సమయంలో అన‌వ‌స‌ర‌ శబ్దాలను ఫిల్టర్ చేయగల ఒక ఫీచ‌ర్‌ను గూగుల్ మీట్ ప్రవేశపెట్టింది. ఈ యాప్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్‌ల ఫోన్ల‌లో నాయిస్ క్యాన్స‌లైజేష‌న్ ఫీచర్‌ను విడుదల చేసింది.  


LGvelvet smartphone

Post a Comment

1 Comments