Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ల స‌వ‌ర‌ణ‌


ప్ర‌భుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్  డిసెంబర్ 1 నుంచి ప‌లు రీచార్జి ప్లాన్ల‌ను పునరుద్ధరిస్తోంది. రూ.199, రూ.798, రూ .999 ధరతో మూడు కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లకు డేటా రోల్‌ఓవర్, యాడ్-ఆన్ బెనిఫిట్‌లతో తీసుకురాబోతోంది.అలాగే రూ .106 మరియు రూ.107 ప్లాన్ల‌ను కూడా స‌వ‌రించబోతోంది. 

బిఎస్ఎన్ఎల్ రూ .106, రూ .107 ప్రీపెయిడ్ ప్లాన్ల్ల‌ను స‌వ‌రించింది.  బిఎస్ఎన్ఎల్ ప‌ర్ సెకన్‌, ప‌ర్ మినెట్ ప్లాన్లు  రూ.106, 107 ప్లాన్ల వాలిడిటీ 28 రోజుల నుండి 100 రోజులకు పొడిగించింది. ముంబై మరియు Delhi తో సహా జాతీయ రోమింగ్ ఉన్న ఏ నెట్‌వర్క్‌కు 100 నిమిషాల ఉచిత వాయిస్ కాలింగ్‌, 3 జిబి ఉచిత డేటా, మ‌రియు ఉచిత బిఎస్‌ఎన్‌ఎల్ ట్యూన్స్ ను పొంద‌వ‌చ్చు. ఇంతకుముందు ఎఫ్‌ఆర్‌సి 106 అని పేర్కొన‌బ‌డిన ఈ రూ 106 ప్రీపెయిడ్ ప్లాన్‌కు ప్రీమియం పర్ సెకండ్ ప్లాన్‌గా, ఎఫ్‌ఆర్‌సి 107 పేరును ప్రీమియం పర్ మినిట్ ప్లాన్‌గా మార్చబడుతుంది. ఈ ప్లాన్‌లు పాన్-ఇండియా ప్రాతిపదికన సవరించబడతాయి. కొత్త ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ల‌ను తీసుకొస్తోంది.  

ప్రీపెయిడ్ ప్లాన్‌లపై బిఎస్‌ఎన్‌ఎల్ 25 శాతం తగ్గింపు: 

స్పెషల్ టారిఫ్ వోచర్ 187 మరియు ప్లాన్ వోచర్ 1,477 పై   కస్టమర్లకు 25 శాతం తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్ గ్రేస్ పీరియడ్ -2 లో లభిస్తుంది, అంటే  సిమ్ చెల్లుబాటు గడువు ముగిసిన 172 రోజుల తరువాత వినియోగదారులు ఈ ఆఫ‌ర్‌ను పొందగలుగుతారు . వినియోగదారులు తమ సేవలను పునరుద్ధరించడానికి STV 187 లేదా PV 1477 ఉపయోగించి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ నవంబర్ 30 వరకు భారతదేశ  వ్యాప్తంగా అన్ని స‌ర్కిళ్ల‌లో అందుబాటులో ఉంది.  

బిఎస్‌ఎన్‌ఎల్ ఎస్‌టివి 187: ఈ ప్లాన్ ముంబై, ఢిల్లీ సర్కిల్‌లతో సహా లోకల్, ఎస్‌టిడి మరియు రోమింగ్‌కు అపరిమిత వాయిస్ కాల్స్ ఇస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 2GB డేటాను ఇస్తుంది. 2GB వినియోగించుకున్న తరువాత వేగం 80 Kbps కు తగ్గించబడుతుంది. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్ ఇస్తుంది. డిస్కౌంట్ తరువాత, ఈ ప్లాన్ నిష్క్రియాత్మక కస్టమర్లకు 139 రూపాయలకు ల‌భిస్తుంది. 

బిఎస్‌ఎన్‌ఎల్ పివి 1499: ఈ ప్లాన్ వోచర్ రూ .1499 కు వస్తుంది. ఢిల్లీ, ముంబైలోని ఎమ్‌టిఎన్ఎల్ నెట్‌వర్క్ రోమింగ్ ఏరియాతో సహా హోమ్, నేషనల్ రోమింగ్‌లో అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్‌ను అందిస్తుంది. రోజుకు 100 ఉచిత SMSను ఇస్తుంది మరియు MTNL నెట్‌వర్క్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఈ ప్లాన్ 24GB అదనపు ఉచిత డేటాను ఇస్తుంది అలాగే ప్లాన్‌ చెల్లుబాటు 365 రోజులు. నిష్క్రియాత్మక కస్టమర్ల కోసం రాయితీ ఆఫర్ ఈ ప్లాన్‌ను 1199 రూపాయలకు తీసుకువస్తుంది. 


Post a Comment

0 Comments