మీ ఫోన్‌లో సెటప్ చేయండిలా..
భారతదేశంలో వినియోగదారులకు WhatsApp Pay ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఫేస్‌బుక్ యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ 2018 లో సుమారు ఒక మిలియన్ వినియోగదారులతో ఈ ఫీచర్‌ను పరీక్షించింది. అయితే, రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు దీనికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) అనుమతి లభించింది. భారతదేశంలో యుపిఐ ఆధారిత చెల్లింపు వ్యవస్థను రూపొందించడానికి వాట్సాప్‌కు అనుమతి ఇచ్చినట్లు ఎన్‌పిసిఐ వెల్లడించింది.
భారతదేశంలో WhatsApp Payను ప్రారంభించడం పై ఫేస్‌బుక్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ “మేము నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కలిసి పని చేస్తున్నాం. వారు సురక్షితంగా, నమ్మదగినదిగా ఉండేలా ప్రతీ అంశాన్ని పర్యవేక్షిస్తారు. ఇండియా యొక్క Unified Payments Interface( ఏకీకృత చెల్లింపుల ఇంటర్‌ఫేస్)ను ఉపయోగించి మేము దీన్ని నిర్మించాము, ఇది వేర్వేరు యాప్‌లలో పేమెంట్స్‌ను తక్షణమే అంగీకరించడం సులభతరం చేస్తుంది - మరియు కంపెనీలకు, ప్రజలకు విలువైన సేవలను అందిస్తుందని తెలిపారు.
భారతదేశంలో యుపిఐ చెల్లింపులను మొదలుపెట్టేందుకు వాట్సాప్ ఐదు ప్రముఖ బ్యాంకులైన ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మరియు జియో పేమెంట్స్ బ్యాంకుతో భాగస్వామ్యం కలిగి ఉంది. వాట్సాప్ పే ద్వారా డబ్బు పంపడానికి లేదా స్వీకరించడానికి, మీరు మొదట బ్యాంక్ ఖాతా మరియు డెబిట్ కార్డు కలిగి ఉండాలి.
మీ ఫోన్‌లో వాట్సాప్ పేని ఇలా సెటప్ చేయవచ్చు
- వాట్సప్ పే పొందడానికి మొదట మీ ఫోన్‌లోని వాట్సప్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్‌లో అప్‌డేట్ చేయాలి
- మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాట్సాప్‌లో మీ చాట్ విండోను తెరిచి, కుడి వైపు పైన కార్నర్‌లో మూడు నిలువు చుక్కలపై ప్రెస్ చేయండి
- అక్కడ మీకు పేమెంట్ ఆప్షన్ కనిపిస్తుంది దానిపై టాప్ చేయండి
- పేమెంట్ విండో తెరిచిన తర్వాత Add new payments method ఆప్షన్‌పై ప్రెస్ చేయండి
- ఇంకా ముందుకు వెళ్లడానికి యాక్సెప్ట్ ఆప్షన్‌ను నొక్కండి
- మీరు యాక్సెప్ట్ ఆప్షన్ టాప్ చేయగానే మీరు వాట్సాప్‌తో బ్యాంకుల జాబితాతో ఒక కొత్త విండోకు తీసుకెళ్తుంది.
- - ఆ బ్యాంకు లిస్ట్ నుంచి మీ బ్యాంక్‌ను ఎంచుకోండి. అ తరువాత మీ ఫోన్ నంబర్‌ను ఉపయోగించి ఖాతాను ధ్రువీకరించండి. మీరు మీ బ్యాంకులో రిజిస్టర్ అయి ఉన్న ఫోన్ నంబర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది.
- వాట్సాప్ మీ ఖాతాను ధృవీకరించడానికి - మీరు నంబర్‌ను నమోదు చేసిన తర్వాత, వాట్సాప్ మీ బ్యాంక్‌తో ధృవీకరిస్తుంది అలాగే పేమెంట్ సిస్టంను సెటప్ చేస్తుంది.
- - పూర్తి చేసి, మీ చెల్లింపుల పేజీని యాక్సెస్ చేయండి.
వాట్సాప్‌లో డబ్బు ఎలా పంపాలి
- మీరు డబ్బు పంపించాలనుకుంటున్న కాంటాక్ట్‌ను ఎంచుకోండి
- చాట్ విండోలో, క్లిప్ చిహ్నంపై నొక్కండి.
- రూపాయి సింబల్‌ను ఎంచుకోండి
- అవసరమైతే మీరు నోట్‌తో పాటు పంపించదలిచిన మొత్తాన్ని నమోదు చేయండి.
- లావాదేవీని ప్రాసెస్ చేయడానికి మీ యుపిఐ పిన్ను నమోదు చేయండి.
- మీ చాట్ విండోలో నిర్ధారణ సందేశం వచ్చేవరకు వేచి ఉండండి.



1 Comments
Very nice
ReplyDelete