Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

సాంసంగ్ నుంచి గెలాక్సీ A52 5G ఫోన్‌



సౌత్‌కొరియాకు చెందిన శామ్సంగ్ సంస్థ త్వ‌ర‌లో సాంసంగ్  గెలాక్సీ A52 పేరుతో 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేయ‌నుంది. దీనికి సంబంధించిన గీక్బెంచ్ వెబ్‌సైట్‌లో క‌నిపించింది. ఈ నివేదిక ప్ర‌కారం.   గెలాక్సీ ఏ52లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 750G ప్రాసెస‌ర్‌ను వినియోగించ‌నున్నారు.గెలాక్సీ ఎ 52 5జి ఆండ్రాయిడ్ 11  ఆప‌రేటింగ్ సిస్టంపై న‌డుస్తుంది. ఇది 6 జిబి ర్యామ్, 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ను  వినియోగించారు.గెలాక్సీ ఎ51 5జి స్మార్ట్‌ఫోన్‌కు స‌క్సెస‌ర్‌గా  గెలాక్సీ ఏ52 5జి  మోడల్‌ను తీసుకొస్తున్నారు.  

రాబోయే సాం‌సంగ్ స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ నివేదిక ప్ర‌కారం.. ఇది సింగిల్-కోర్లో 298 పాయింట్లు మరియు మల్టీ-కోర్ లో 1,001 పాయింట్లను సాధించింది. GSMArena వెబ్‌సైట్‌ సూచించినట్లుగా.. గెలాక్సీ A51 5G ఈ విభాగాలలో సింగిల్-కోర్లో 700 పాయింట్లు మరియు మల్టీ-కోర్ పరీక్షలో 1,800 పాయింట్లతో మెరుగ్గా పనిచేస్తుంది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 52 5జిలో  64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో కూడిన క్వార్డ్ కెమెరా సెట‌ప్ ఉంటుంది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 52 4జీ ఎల్‌టీఈ వేరియంట్‌లో లభించే అవకాశం ఉంది.

సాంసంగ్ ఎ సిరిస్ ఫోన్ల‌కు అధునాత ఫీచ‌ర్లు

ఈ ఏడాది ప్రారంభంలో సాంసంగ్ దక్షిణ కొరియాలో ట్రేడ్ మార్క్ చేసిన తొమ్మిది ఫోన్లలో సాంసంగ్ గెలాక్సీ ఎ52 ఒకటి. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఇత‌ర కంపెనీలకు గ‌ట్టి పోటీనిచ్చేలా సాంసంగ్ త‌న ఏ సిరిస్ ఫోన్ల‌లో అధునాత‌న ఫీచ‌ర్ల‌ను జోడిస్తూ వ‌స్తోంది. ఇందులో భాగంగా గెలాక్సీ ఎ (2021) సిరీస్‌కు వైర్‌లెస్ ఛార్జింగ్ సౌక‌ర్యం క‌ల్పించ‌నుంది. అలాగే మ‌రో నివేదిక నివేదిక ప్ర‌కారం..  2021లో గెలాక్సీ ఎ-సిరీస్ ఫోన్ల‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) స‌పోర్ట్ అందిస్తుంద‌ని తెలుస్తోంది.  

Post a Comment

0 Comments