ఆపిల్ ఐఫోన్లు, ఐపాడ్లపై భారీ డిస్కౌంట్లు
సేల్స్ ముగింపు తేదీ డిసెంబరు 16
పలు మోడళ్లపై భారీ తగ్గింపు
Amazon Apple Daysలో భాగంగా 2,990 రూపాయల తగ్గింపుతో ఐఫోన్ 11 ను రూ.51,999కి విక్రయిస్తోంది. మరోవైపు ఐఫోన్ 7(32జీబీ) రూ.23,900 కు అందుబాటులో ఉంది.
ఐఫోన్ ఎక్స్‌ఆర్ (64 జీబీ వేరియంట్) రూ.40,999 కు లభిస్తుంది. మామూలు సమయాల్లో దీని ధర రూ.47,900. ఆపిల్ సేల్స్‌లో భాగంగా ఈ మోడల్‌పై రూ.7,000 తగ్గింపుతో లభిస్తుంది. మరో పైపు మీ పాత ఫోన్‌కు బదులుగా రూ.15,150 వరకు ఎక్సేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. ఐఫోన్ ఎస్‌ఇని ఫ్లిప్‌కార్ట్‌లో రూ .32,999 కు విక్రయిస్తున్నారు.
అయితే, కొత్తగా విడుదల చేసిన ఐఫోన్ 12 సిరీస్‌పై అమెజాన్ లేదా ఫ్లిప్‌కార్ట్ లలో ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వడం లేదు. కానీ మీరు హెచ్‌డిఎఫ్‌సి కార్డును ఉపయోగిస్తే భారీ తగ్గింపులను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12 ను కొనుగోలు చేస్తే రూ.6000 రూపాయల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే EMI ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. హెచ్‌డిఎఫ్‌సి కార్డును ఉపయోగించి ఐఫోన్ 12(అసలు ధర రూ .79,900)ను కొనుగోలు చేస్తే, రూ.73,900కే పొందవచ్చు.
బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులపైనా..
అలాగే పలు బ్యంకులు డెబిట్, క్రెడిట్ కార్డులపై డిస్కౌంట్లు కూడా అందిస్తున్నాయి. ఇందులో యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ తోపాటు నో-కాస్ట్ ఇఎంఐ ఆప్షన్లను అందిస్తోంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులపై రూ 3,000 అదనపు తగ్గింపు పొందడానికి కొనుగోలుదారులు ఐప్యాడ్ మినీపై రూ .5 వేల డిస్కౌంట్ పొందవచ్చు. హెచ్‌డిఎఫ్‌సి కార్డుదారులు ఆపిల్ మాక్‌బుక్ ప్రో కొనుగోలు చేస్తే రూ. 6000 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు.
అదేవిధంగా, మీరు హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ మరియు డెబిట్ కార్డు ఉపయోగించి ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12 ప్రోను కొనుగోలు చేస్తే, మీకు రూ .5 వేల తగ్గింపు లభిస్తుంది. కొనుగోలుదారులు తమ పాత స్మార్ట్‌ఫోన్‌లను ఐఫోన్ 12 కోసం మార్పిడి చేసుకోవచ్చు మరియు సులభంగా EMI ఎంపికలను పొందవచ్చు.
------------------------------



0 Comments