నెట్‌ఫ్లిక్స్ లో త్వరలో రాబోతున్న ఫీచర్ ఇదే..
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ తల్లిదండ్రుల కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు పరీక్షలు జరుపుతోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో తమ పిల్లలు ఎటువంటి వీడియోలు చూస్తున్నారో తల్లిదండ్రులు అర్థం చేసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. నెట్‌ఫ్లిక్స్.. Kids Activity Report రూపొందించి తల్లిందండ్రులకు నివేదిస్తుంది. ఈ నివేదికలో పిల్లలు ప్రతీరోజు ఎలాంటి కంటెంట్‌ను చూస్తున్నారు, ఇది వారికి ఇష్టమైన పాత్ర మరియు పిల్లలు చూసే విధానాల ఆధారంగా రిపోర్టులు అందజేస్తుది. ఈమేరకు నెట్‌ఫ్లిక్స్ కొత్త ఫ్యామిలీ ప్రొఫైల్ సెట్టింగ్‌ను పరీక్షించడం ప్రారంభించింది.
గ్లోబల్ టెస్ట్‌లో భాగంగా నెట్‌ఫ్లిక్స్ ఈ వారాంతంలో తల్లిదండ్రులకు Kids Activity Report (పిల్లల కార్యాచరణ నివేదిక)ను ఇమెయిల్ ద్వారా పంపడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇది ప్రస్తుతానికి ఎంచుకున్న దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. పిల్లలు చూసే డేటాపై అంతర దృష్టిని అందిస్తుంది. పిల్లలు ఇష్టపడే షోలు, కార్యక్రమాల వివరాలు ఇవ్వడమే కాకుండా, వారు అభిమానించే కారెక్టర్ ఎవరు ? ప్రోగ్రాములు, అనేదానిపై కూడా వివరాలు అందిస్తుంది. వారికి ఇష్టమైన కొత్త కార్యక్రమాలను కూడా సిఫార్సు చేస్తుంది. పిల్లలతో వారి అభిమాన పాత్రల ఆధారంగా ఆడటానికి క్విజ్ గేమ్‌లను అందిస్తుంది.ఈ నివేదిక తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమి చూస్తున్నారో అర్థం చేసుకోవడం ద్వారా పిల్లలతో బాగా కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది.
నెట్‌ఫ్లిక్స్ ఫామిలీ ప్రొఫైల్..
మరోవైపు నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా కొత్త ఫ్యామిలీ ప్రొఫైల్ సెట్టింగ్‌ను పరీక్షించడం ప్రారంభించినట్లు తెలిసింది. ఇది ఒకే ప్రొఫైల్ కింద కుటుంబ సభ్యులకు ఇష్టమైన షోలు, చిత్రాలను పూల్ చేయడానికి సహాయపడుతుంది. నెట్‌ఫ్లిక్స్ ఫ్యామిలీ ప్రొఫైల్ ప్రస్తుతం సినిమాలను పిజి -13 రేటింగ్ వరకు పరిమితం చేస్తుంది. అలాగే టివి షోలను టివి -14 రేటింగ్ వరకు పరిమితం చేస్తుంది. మరింత పీజీ 18 సినిమాలు, టీవీ షోలను అనుమతించదని కంపెనీ పేర్కొంది.



0 Comments