ఈనెల 18 నుంచి 22 వరకు
స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్లు
ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరో Flipkart Big Saving Days Sale మేళాను ప్రకటించింది. డిసెంబర్ 18 మంగళవారం డిసెంబర్ 22న మంగళవారం వరకు వరకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ పేరుతో డిస్కౌంట్ సేల్స్‌ను నిర్వహిస్తోంది. ఇందులో పెద్దమొత్తంలో స్మార్ట్ఫోన్లపై డీల్స్, డిస్కౌంట్లు మరియు ఆఫర్లను అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్, రియల్మే 6, శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 41 తదితర మోడళ్లపై భారీ తగ్గింపులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సేల్స్మేళాలో ఎస్బిఐ కార్డులపై ఆఫర్లు ఉన్నాయి. ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేస్తే 10 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ఒక రోజు ముందే అంటే డిసెంబర్ 17, మధ్యాహ్నం 12 (మధ్యాహ్నం) నుంచే ప్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ ప్రారంభమవుతుంది.
ఫోన్లఫై భారీ డిస్కౌంట్
Flipkart Big Saving Days Saleకు సంబంధించి ఫ్లిప్‌కార్ట్ రూపొందించిన పేజీలో వివరాలు ఇలా ఉన్నాయి. రియల్మీ 6(6 జీబీ ర్యామ్ ) రూ. 14,999 అసలు ధర కాగా ఈ సేల్స్‌లో 12,999 రూపాయలకే లభించనుంది. అలాగే, రియల్మే 6( 8 జిబి + 128 జిబి స్టోరేజ్ వేరియంట్) ధర రూ. 16,999కు పొందవచ్చు. రియల్మీ నార్జో 20 ప్రో (₹ 14,999) సేల్స్‌లో రూ. 13,999, మరియు రియల్మీ 6i (₹ 13,999 ) బిగ్ సేవింగ్ డేస్‌లో రూ. 11,999కి లభిస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 41 (6 జిబి + 128 జిబి స్టోరేజ్ వేరియంట్) ధర రూ. 15,499కు లభిస్తోంది. కస్టమర్లు ఎక్స్ఛేంజ్ అఫర్ కింద మరో రూ.వెయ్యి డిస్కౌంట్ పొందవచ్చు. అలగే ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ రూ. 38,999 నుంచి ప్రారంభమవుతుంది. , ఈ ప్రీమియం ఫోన్ అసలు ధర (64 జీబీ వేరియంట్‌కు) రూ. 44,900. 128 జీబీ వేరియంట్‌కు 49,900 రూపాయలు.
అలాగే ఐఫోన్ ఎస్ఇ ప్రస్తుతం రూ. 64 జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌కు 35,900 రూపాయలు కాగా బిగ్ సేవింగ్ డేస్ మేళాలో రూ. 32,999లకు విక్రయించనున్నారు.
ఎల్జీ జీ8ఎక్స్ థింక్యూ ఫోన్ ధర (6 జీబీ ర్యామ్, 128 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్) మాములు సమయాల్లో రూ.33,480కి విక్రయించారు. కానీ ఈ మేళాలో కేవలం 27,990 రూపాయలకు అందుబాటులో ఉండనుంది.
ఒప్పో రెనో 2 ఎఫ్ ( 6 జిబి + 256 జిబి స్టోరేజ్ వేరియంట్)ను మాములు సమయాల్లో రూ. 24,900 కాగా ఈ సేల్స్‌లో కేవలం 15,990కి విక్రయిస్తున్నారు. ఒప్పో ఎఫ్ 15 4 జిబి + 128 జిబి స్టోరేజ్ వేరియంట్(అసలు ధరరూ. 19,674)ను రూ. 14,990కి అందుబాటులో ఉండనుంది.



1 Comments
Good
ReplyDelete