Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

నేటి నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఫిప్‌స్టార్ట్ డేస్‌

ప‌లు వ‌స్తువుల‌పై డిస్కౌంట్లు 



ఫ్లిప్‌కార్ట్‌‌లో మంగ‌ళ‌వారం నుంచి  ఫ్లిప్‌స్టార్ట్ డేస్ పేరుతో మ‌రో డిస్కౌంట్ సేల్స్ మేళా ప్రారంమైంది. ఇది డిసెంబర్ 3 వరకు కొన‌సాగ‌నుంది. ఈ సేల్స్‌లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై 80 శాతం వరకు. టీవీలు, ఏసీలు మరియు రిఫ్రిజిరేటర్లపై 50 శాతం వరకు తగ్గింపును అందిస్తున్న‌ట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది.  అల‌గే ఈ మేళాలో దుస్తులు, పాదరక్షలు, యాక్సెసిరీస్‌, బ్యూటీ, స్పోర్ట్‌, ఫర్నిచర్, గృహాలంకరణ మరియు ఇతర వ‌స్తువుల‌పై డిస్కౌంట్ మరియు ఆఫర్లను ఇస్తున్నారు.   

ఆఫ‌ర్లు ఇలా..

ఫ్లిప్‌కార్ట్ యొక్క ఫ్లిప్‌స్టార్ట్ డేస్ లో హెడ్‌ఫోన్‌లు మరియు స్పీకర్లకు 70 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. ల్యాప్‌టాప్‌ల కొనుగోలుపై 30 శాతం వరకు డిస్కౌంట్ ఉంది. అలాగే స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లు వంటి వేరియ‌బుల్ వస్తువులు రూ. 1,299 నుంచి ప్రారంభ‌మవుతున్నాయి.. అయితే చాలా ర‌కాల‌ వ‌స్తువుల‌పై  నోకాస్ట్ EMI ఆప్ష‌న్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు లేదు. కానీ పొడిగించిన వారంటీలతో వస్తాయి. ఇక స్మార్ట్ టీవీలు రూ.8,999 నుంచి ప్రారంభ‌మ‌వుతున్నాయి. 

ఈ డిస్కౌంట సేల్స్‌లో చాలా త‌క్కువ ర‌కాల వ‌స్తువుల‌పై మాత్ర‌మే డిస్కౌంట్లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇందులో ఆఫీస్ కుర్చీలు మరియు ల్యాప్‌టాప్ టేబుళ్లపై కొన్ని కాస్త  మెరుగైన డీల్స్  ఉన్న‌ట్లు క‌నిపిస్తున్నాయి. ఒకవేళ మీరు మీ ఆఫీసు పనిని ఇంటి సెటప్ చేయాల‌నుకుంటే ఈ సేల్స్ మీకు ఉపయోగ‌ప‌డ‌నుంది.  

Post a Comment

0 Comments