Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

త్వ‌ర‌లో నోకియా లాప్‌టాప్‌లు

 


స్మార్ట్ ఫోన్ కంపెనీ దిగ్గ‌జం నోకియా భారతదేశంలో కొత్త‌గా ల్యాప్‌టాప్‌లను ప్ర‌వేశ‌పెట్టాల‌ని యోచిస్తోంది. మైక్రోమిక్కో సిరీస్ క్రింద ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లు మరియు మినీ ల్యాప్‌టాప్‌లను రూపొందిస్తోంది. 2009 నోకియా బ్రాండ్ నుండి చివ‌రిసారి  నోకియా బుక్‌లెట్ 3 జి, మినీ ల్యాప్‌టాప్ ప్ర‌వేపెట‌టింది. అప్ప‌టి నుంచి చాలా ఏళ్ల త‌రువాత ఇండియాలో మ‌ళ్లీ త‌న కంప్యూట‌ర్ సెగ్మెంట్‌ను  పునరుద్ధరించాలని చూస్తోంది. కాగా ఇటీవ‌ల నోకియా ల్యాప్‌టాప్‌లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్‌లో ధృవీకరించబడ్డాయి.

బీఐఎస్ వెబ్‌సైట్‌లో వివ‌రాలు

బిఐఎస్ వెబ్‌సైట్‌లోని సర్టిఫికేషన్ లిస్టింగ్ ప్రకారం, నోకియా ల్యాప్‌టాప్‌లు ఒకే సిరీస్ కింద తొమ్మిది వేర్వేరు మోడళ్లలోకి వస్తాయి. ఈ మోడళ్లకు మోడల్ సంఖ్యలు NKi510UL82S, NKi510UL85S, NKi510UL165S, NKi510UL810S, NKi510UL1610S, NKi310UL41S, NKi310UL42S, NKi310UL82S, మరియు NKi310UL85S. బీఐఎస్ స‌ర్టిఫికేష‌న్ ప్ర‌కారం చ‌స్తే ఇందులో కోర్ ఐ 5 ప్రాసెసర్‌తో ఐదు ల్యాప్‌టాప్‌లు ఉండొచ్చు. నాలుగు కోర్ ఐ 3 చిప్‌సెట్లతో న‌డుస్తాయి. ఈ పేర్ల‌లో ఎన్‌కే అక్ష‌రాల త‌రువాత ప‌రిశీలిస్తే ఈ ప్రాసెస‌ర్ల‌ను తెలుసుకోవ‌చ్చు.

ఈ పేర్లలో యుఎల్‌కు ముందు 10వ సంఖ్య ఉంది కాబ‌ట్టి ఈ ల్యాప్‌టాప్‌లు విండోస్ 10 లో నడుస్తాయ‌ని తెలుస్తోంది. నోకియా ల్యాప్‌టాప్‌లను బిఐఎస్ వెబ్‌సైట్‌లోని లిస్టింగ్ ప్రకారం చైనాలోని చైనా కంపెనీ టోంగ్‌ఫాంగ్ లిమిటెడ్ తయారు చేసిన‌ట్లు తెలుస్తోంది. నోకియా అధికారిక లైసెన్స్‌డ్ సంస్థ HMD గ్లోబల్ వీటిని త‌యారు చేయ‌లేదు. ఎందుకంటే  స్మార్ట్‌ఫోన్లు,, ఫీచర్ ఫోన్లు మరియు మొబైల్ ఉపకరణాల కోసం మాత్ర‌మే నోకియా బ్రాండ్‌కు హెచ్‌ఎండి గ్లోబల్ లైసెన్స్ ఇచ్చింది. స్ట్రీమింగ్ పరికరాలు, టెలివిజన్లు మరియు ప్‌టాప్‌లకు వేరే లైసెన్స్ హోల్డర్ ఉంది.

భారతదేశంలో నోకియా తన స్మార్ట్ టెలివిజన్లను ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం కుదుర్చుకుని  విక్రయిస్తుంది, ఇది ల్యాప్‌టాప్‌ల విషయంలో కూడా కావచ్చు. అది నిజమైతే, నోకియా ల్యాప్‌టాప్‌లు కేవ‌లం ఫ్లిప్‌కార్ట్‌లోనే ఎక్స్‌క్లూజివ్‌గా విక్ర‌యించ‌నుంది. ఇండియాలో నోకియా టెలివిజన్లు  స్ట్రీమింగ్ పరికరాల మాదిరిగానే ఇవి ఫ్లిప్‌కార్ట్‌లో మాత్ర‌మే అందుబాటులో ఉండొచ్చు. అయితే నోకియా దీనిపై అధికారికంగా ఏమీ చెప్పలేదు  

నోకియా లాప్‌టాప్‌ల‌ను  పరిశీలిస్తే, రూ .40,000 ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నా ఈ ధ‌ర‌లు నిజ‌మైతే. వినియోగ‌దారుల నుంచి నోకియా ల్యాప్‌టాప్‌లకు మంచి డిమాండ్ ఏర్ప‌డ‌నుంది. ప్రస్తుతం మార్కెట్ ఇప్పటికే అవిటా, ఆసుస్, హెచ్‌పి మరియు ఎసర్‌తో సహా వివిధ బ్రాండ్ల నుండి చాలా ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి నుంచి పోటీ త‌ట్ట‌కోవాలంటే ఆధునిక ఫీచ‌ర్ల‌తో త‌క్కువ ధ‌ర‌ల్లో లాప్‌టాప్‌ల‌ను నోకియా తీసుకురావాల్సి ఉంది.  

---------------------------

Post a Comment

1 Comments