జియో, ఎయిర్‌టెల్‌ను వెనక్కి నెట్టిన వీఐ
TRAI తన మై కాల్ డాష్‌బోర్డ్‌లో తాజా వివరాలను ప్రదర్శించింది. ఇది వోడాఫోన్, ఐడియా కాల్ క్వాలిటీ మిగతా వాటికంటే మెరుగైన స్థానంలో ఉన్నట్లుతెలిపింది. 5రేటింగ్లో 4.9 రేటింగ్‌తో ఐడియా అగ్రస్థానంలో ఉంది అలాగే వొడాఫోన్ 5లో 4.6 తో ఉంది. ఇక ఆ తరువాత స్థానంలో బిఎస్‌ఎన్‌ఎల్ 4.1 ఉంది. ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో రెండూ 5 రేటింగ్‌లో 3.8 తో వెనుకబడి ఉన్నాయి.
టాప్ పొజిషన్‌లో Idea .. చిట్టచివరన జియో..
మొత్తంమీద, 88.4 శాతం మంది వినియోగదారులు సంతృప్తికరమైన వాయిస్ నాణ్యతను, 8.24 వాయిస్ నాణ్యతను, మరియు 3.62 శాతం కాల్స్ డ్రాప్‌లను ఎక్స్‌పీరియన్స్ చేశారు. ఇండోర్ కాల్ నాణ్యత పరంగా వోడాఫోన్ 4.6 రేటింగ్ పొందగా, అవుట్డోర్ కాల్ నాణ్యత 4.3 గా ఉంది. ఐడియా, ఇండోర్లో 4.9 మరియు అవుట్డోర్ కాల్ నాణ్యతకు 4.8 రాంకు వచ్చింది ఎయిర్‌టెల్‌కు వరుసగా 3.9, 3.5, బిఎస్‌ఎన్‌ఎల్ 3.9 మరియు 4.3, జియో 3.9, 3.6 లభించాయి.
అక్టోబరులో ఇలా..
అక్టోబర్ నెలలో, బిఎస్ఎన్ఎల్ వాయిస్ క్వాలిటీ పరంగా 3.7 రేటింగ్తో ఎయిర్టెల్ ఫాలోయింగ్ సూట్ 3.5 తో, ఐడియా 3.3 తో, జియో 3.2 తో, మరియు వోడాఫోన్ 3.1 తో చివరి స్థానంలో నిలిచింది.
-------------------------



0 Comments