రూ.29,999 నుంచి ప్రారంభం
డాల్డీ విజన్, డాల్బీ అట్మాస్, స్క్రీన్ మిర్రరింగ్ ఇతర ఫీచర్లు
అమెజాన్ బేసిక్స్ ఫైర్ టీవీ ఎడిషన్ అల్ట్రా- HD LED టీవీ
అమెజాన్ బేసిక్స్ విడుదల చేసిన ఈ కొత్త టెలివిజన్లు 50 అంగుళాలు (AB50U20PS) మరియు 55 అంగుళాలు (AB55U20PS) రెండు పరిమాణాలలో లభిస్తాయి - ఈ రెండూ అల్ట్రా- HD (3840x2160- పిక్సెల్) LED స్క్రీన్‌లను కలిగి ఉన్నాయి, డాల్బీ విజన్ ఫార్మాట్ వరకు HDR కి సపోర్ట్ ఇస్తాయి. 20W ఔట్‌పుట్ గల స్పీకర్లు డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ ఇస్తాయి.
అమెజాన్ బేసిక్స్ టీవీలు ఫైర్ టివి ఎడిషన్ డివైజ్ కు సపోర్ట్ ఇస్తాయి. ఈ టీవీలు, అమెజాన్‌కు చెందిన ఫైర్ టివి ఆపరేటింగ్ సిస్టంతో నడుస్తాయి. అమేజాన్ ఫైర్ టీవీ ఆపరేటింగ్ సిస్టంను ఫైర్ టివి స్టిక్ శ్రేణి స్ట్రీమింగ్ పరికరాలతోపాటు ఒనిడా మరియు అకాయ్ వంటి ఇతర బ్రాండ్ల టీవీల్లో గమచించవచ్చు. మీరు అమెజాన్ ఓఎస్ వద్దనుకుంటే మీ స్వంత సెట్ టాప్ బాక్స్‌ను కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ టీవీల్లో అమెజాన్ యొక్క వాయిస్ అసిస్టెంట్, అలెక్సాను కూడా ఉపయోగించవచ్చు, అవి సినిమాలు, సంగీతం లేదా టీవీ షోలను ప్లే కోసం కమాండ్ ఇవ్వొచ్చు. అలాగే సమాచారాన్ని పొందవచ్చు.
టీవీ విభాగంలో ప్రవేశించేందుకు అమెజాన్ చాలాకాలంగా ఎదురుచూస్తున్నది. ఈ రంగంలో గట్టిపోటీనిచ్చేందుకు అమెజాన్ తన టీవీలను కూడా సరసమైన ధరలకే అందుబాటులోకి తెచ్చింది. ఎంట్రీ లెవల్ 4కె సెగ్మెంట్‌లోని షియోమి, హిస్సెన్స్ వంటి పోటీ బ్రాండ్ల టీవీలకంటే అమేజాన్ బేసిక్స్ టీవీల ధరలు కొంతమేర తక్కువగానే ఉన్నాయి.




1 Comments
Nice
ReplyDelete