ఎయిర్టెల్, జియో మరియు వీఐ(వొడఫోన్-ఐడియా), బీఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థలు 28 రోజులు, 56 రోజులు, 84 రోజులతోపాటు 365 రోజుల వాలిడిటీతో ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే వీటిల్లో ఎక్కువ మంది వినియోగదారులు 84 రోజుల ప్లాన్‌నే రీచార్జి చేసుకునేందుకే ఇష్టపడతారు. ఎందుకంటే ఇది పూర్తిగా దీర్ఘకాలిక ప్రణాళిక కాదు అలాగని చాలా తక్కువ కాదు. దాదాపు మూడు నెలలు రీఛార్జ్ చేయకుండా నిశ్చింతగా ఉండొచ్చు. పైగా నెలవారీ రీచార్జి కంటే డబ్బులు కూడా ఆదా అవుతాయి. అయితే ఎయిర్‌టెల్, వీఐ, జియో కంపెనీలు అందిస్తున్న 84 రోజుల వాలిడిటీ కలిగిన పలు ప్లాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
జియో రూ 555 ప్రీపెయిడ్ ప్లాన్:
జియో రూపొందించిన ఈ ప్రీపెయిడ్ ప్లాన్లో 84 రోజుల పాటు మొత్తం 126 జిబి డేటా లభిస్తుంది. రోజుకు 1.5 జిబి డేటాను వాడుకునే పరిమితి ఉంటుంది. ఈ ప్లాన్ జియో టు జియో నెట్‌వర్క్‌కు అపరిమిత టాక్‌టైమ్‌ను కూడా ఇస్తుంది. ఆఫ్-నెట్ లేదా జియో నుండి వేరే నెట్‌వర్క్‌కు కాల్స్ కోసం 3000 నిమిషాల FUP పరిమితితో అపరిమిత టాక్‌టైమ్‌ను ఇస్తుంది. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. మరోవైపు జియో యాప్‌లను ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు.
జియో రూ 599 ప్రీపెయిడ్ ప్లాన్:
ఈ ప్లాన్ ప్రకారం.. 84రోజుల పాటు మొత్తం 168 జిబి డేటా లభిస్తుంది. రోజుకు 2 జిబి డేటాను వాడుకోవచ్చు. ఈ ప్లాన్‌లో కూడా జియో టు జియో నెట్‌వర్క్‌కు అపరిమిత టాక్‌టైమ్ ఉంటుంది. ఆఫ్-నెట్ లేదా జియో నుండి వేరే నెట్‌వర్క్‌కు కాల్స్ కోసం, ఈ ప్లాన్ 3000 నిమిషాల FUP పరిమితితో అపరిమిత టాక్‌టైమ్‌ను ఇస్తుంది. ఈ ప్లాన్ లో కూఆ 100 ఉచిత ఎస్ఎంఎస్ లు వస్తాయి. జియో యాప్‌లను కూడా ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు.
ఎయిర్‌టెల్ రూ 379 ప్రీపెయిడ్ ప్లాన్:
ఇది 6 జిబి డేటాను 84 రోజుల వాలిడిటీ మరియు 900 ఎస్‌ఎంఎస్‌లతో ఇస్తుంది. ఈ ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనాలు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, ఫ్రీ హెలోటూన్స్, వింక్ మ్యూజిక్, ఉచిత ఆన్‌లైన్ కోర్సులు మరియు ఫాస్టాగ్‌లో రూ .150 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
ఎయిర్టెల్ రూ 598 ప్రీపెయిడ్ ప్లాన్:
ఈ ప్లాన్ 84రోజుల వాలిడిటీ ఉంటుంది. రోజుకు 1.5 జిబి డేటాను వాడుకోవచ్చు. అపరిమిత కాల్స్ మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్ ఇస్తుంది. ఈ ప్లాన్ అదనపు ప్రయోజనాలు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, ఫ్రీ హెలోటూన్స్, వింక్ మ్యూజిక్, ఉచిత ఆన్‌లైన్ కోర్సులు మరియు ఫాస్టాగ్‌లో రూ .150 క్యాష్‌బ్యాక్ లభిస్తాయి.
ఎయిర్టెల్ రూ .698 ప్రీపెయిడ్ ప్లాన్:
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కింద రోజుకు 2 జిబి డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ ఇస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్ అదనపు ప్రయోజనాలు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, ఫ్రీ హెలోటూన్స్, వింక్ మ్యూజిక్, ఉచిత ఆన్‌లైన్ కోర్సులు మరియు ఫాస్టాగ్‌లో రూ .150 క్యాష్‌బ్యాక్.
Vi రూ 599 ప్రీపెయిడ్ ప్లాన్:
ఈ ప్లాన్ కింద రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాల్స్ మరియు రోజుకు 100 SMSలను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో వారాంతపు రోల్‌ఓవర్ ప్రయోజనం ఉంది. దీనిలో వినియోగదారులు వారంలో తమ డేటాను ఆదా చేసుకోవచ్చు మరియు వారాంతంలో ఉపయోగించవచ్చు. Vi యాప్ నుంచి రీఛార్జ్ చేసే వినియోగదారులకు ఈ ప్లాన్ 5GB అదనపు డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ అదనపు ప్రయోజనాలు వి సినిమాలు, టివికి యాక్సెస్, జోమాటో నుండి ఫుడ్ ఆర్డర్‌లపై రూ.75 తగ్గింపు ఉంటుంది.
Vi రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్:
ఈ ప్లాన్ రోజుకు 4GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMS ఇస్తుంది. ఇది డబుల్ డేటా ప్లాన్. వారాంతపు రోల్ఓవర్ ప్రయోజనాన్ని కూడా ఇది అందిస్తుంది. అంటే దీనిలో వినియోగదారులు వారంలో తమ డేటాను ఆదా చేసుకోవచ్చు మరియు వారాంతంలో ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనాలు వి సినిమాలు మరియు టివికి యాక్సెస్, జోమాటో నుండి ఫుడ్ ఆర్డర్‌లపై రూ .75 తగ్గింపు.
Vi Rs 795 ప్రీపెయిడ్ ప్లాన్:
ఈ ప్లాన్ రీచార్జి చేసుకుంటే రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMSలను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో కూడా వారాంతపు రోల్‌ఓవర్ ప్రయోజనం ఉంది. ఈ ప్లాన్‌తో జీ5 ప్రీమియంను ఏడాది పాటు ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే వి సినిమాలు మరియు టివికి యాక్సెస్, జోమాటో నుండి ఫుడ్ ఆర్డర్‌లపై రూ .75 తగ్గింపు లభిస్తుంది.
డిజిటల్ ఇండియా ప్లాన్ 429
బీఎస్‌ఎన్ఎల్ 429 ప్లాన్ ప్రకారం.. కాల్స్ (రోజుకు 250 నిమిషాలు), రోజుకు 2జీబీ డేటా. అలాగే 100 ఎస్ఎంస్‌లు పొందచవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 81రోజులు ఉంటుంది.
బీఎస్ఎన్ఎల్ ప్లాన్ 485
ఈ ప్లాన్ కింద రోజుకు 2.5జీబీ డేటాను పొందవచ్చు. అపరిమిత కాల్స్(రోజుకు 250 నిమిషాలు) అలాగే ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్‌లు పంపుకోవచ్చు. ప్లాన్ వాలిడిటీ 90 రోజులు. ఈ ప్లాన్ కింద ఉచిత కాలర్‌ట్యూన్ కూడా పొందవచ్చు.
-----------------------------
- వాట్సప్‌లో కొత్తగా స్టోరేజ్ టూల్
- ఆకర్షణీయ ఫీచర్లు, తక్కువ ధరలో మైక్రోమాక్స్ ఫోన్లు
- పబ్జీ కథ కంచికి..
- చైనా మొబైల్ కంపెనీ షావోమీకి షాక్
- డార్క్ మోడ్‌లో ఫేస్బుక్



1 Comments
Nice
ReplyDelete