Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

వాట్స‌ప్‌లో కొత్త‌గా స్టోరేజ్ టూల్‌

పేరుకుపోయిన కంటెంట్‌ను ఈజీగా తొల‌గించుకోవ‌చ్చు


సోష‌ల్‌మీడియా దిగ్గ‌జం వాట్సాప్ త్వ‌ర‌లో క్రొత్త స్టోరేజ్ టూల్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నుంది.  ఈ టూల్ సాయంతో వినియోగ‌దారులు త‌మ ఫోన్‌లో వాట్స‌ప్ ద్వారా పేరుకుపోయిన‌ కంటెంట్‌ను గుర్తించడం, ఎన‌లైజ్ చేయ‌డం, ఒకేసారి పెద్ద‌మొత్తంలో కంటెంట్‌(ఫొటోలు, వీడియోలు, ఇత‌ర ఫైళ్లు)ను  తొలగించడం వంటివి సులభత‌రం చేస్తుంది.

 వాట్సాప్ యూజర్లు తరచూ ఫార్వార్డ్ చేసిన ఫొటోలు, మరియు వీడియోలతో ఫోన్‌లో స్టోరేజ్ కొర‌త ఏర్ప‌డుతుంది. ఎప్ప‌టిక‌ప్పుడు వీటిని తొల‌గించుకునేందుకు  ఈ కొత్త స్టోరేజ్ టూల్ ఉప‌యోగ‌ప‌డుతుంది. అంతేకాకుండా, డౌన్‌లోడ్ చేసిన చిత్రాలు మరియు వీడియోలను కెమెరా రోల్‌లో సేవ్ చేయకుండా నిరోధించడానికి ఈ కొత్త టూల్ ఉప‌యోగ‌ప‌డుతుంది.  వాట్సాప్‌లో ఇప్పటికే ఆటో-డౌన్‌లోడ్‌ను నిలిపివేయడం, చాట్‌ల నుంచి ఎంపిక చేసిన మీడియాను క్లియర్ చేయడం వంటి సెట్టింగ్‌లు ఉన్నాయి. 

వాట్స‌ప్ స్టోరేజ్ టూల్‌.. వాట్సాప్ కంటెంట్‌ను సులభంగా క్లీన్ చేసుకునేందుకు సూచనలను కూడా అందిస్తుంది. అలాగే చాలాసార్లు ఫార్వార్డ్ చేయబడిన ఎక్కువ మెమోరీ క‌లిగిన ఫైళ్ల‌ను అవరోహణ క్రమంలో క్రమబద్ధీకరించడంతోపాటు  ఫైళ్ళను తొలగించే ముందు వాటిని ప్రివ్యూ చూసుకునే వెలుసుబాటు కూడా ఉంటుంది. వాట్సాప్ యూజర్లు బ‌ల్క్‌గా ఫొటోలు లేదా వీడియోలను  తొల‌గించేముందు మీడియా ప్రివ్యూను చూడవచ్చు.

Go to Settings > Storage and data > Manage storage

WhatsApp disappearing messages:

 వాట్సాప్ డిస‌ప్పియ‌రింగ్ మెసేజెస్ ఫీచర్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు వాట్సాప్ ప్రకటించింది. ఈ ఫీచ‌ర్ ప్ర‌కారం..వినియోగదారులు వాట్ప‌స్ యాప్‌ను యాక్సెస్ చేయకపోతే లేదా ఏడు రోజుల్లో చాట్ తెరవకపోతే, మ‌నం పంపిన‌ సందేశం చాట్ నుంచి అదృశ్యమవుతుంది. ప‌ర్స్‌న‌ల్ చాట్‌లో మెసేజ్‌ల‌ను డిస‌ప్పియ‌ర్ అయ్యే ఆప్ష‌న్‌ను  ఏ యూజర్ అయినా ప్రారంభించవచ్చు. గ్రూప్‌ చాట్‌లో  అదృశ్యమైన సందేశాలను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి గ్రూప్ అడ్మిన్లు మాత్రమే అనుమతించబడతారు.  ప్ర‌స్తుతం ఈ ఫీజ‌ర్‌ను బీటా వ‌ర్ష‌న్‌ల‌లో ప‌రీక్షిస్తున్నారు. త్వ‌ర‌లో ఇది అంద‌రికీ అందుబాటులోకి రానుంది. 

వాట్సాప్ ఇటీవల మ్యూట్ ఫరెవర్ ఆప్షన్‌ను కూడా కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ఆల్‌వేస్ మ్యూట్ ఆప్ష‌న్ ప్ర‌కారం.. ఏదైనా గ్రూప్ చాట్ నోటిఫికేష‌న్ల‌ను శాశ్వ‌తంగా  మ్యూట్ చేయడానికి ఇది ఉప‌క‌రిస్తుంది.  

--------------------------------

 

Post a Comment

6 Comments

  1. ఈ స్టోరేజ్ ప్రాబ్లం లేకపోతే వాట్సాప్ ఇంకా ఎక్కువ మంది ఎక్కువగా వాడతారు

    ReplyDelete
  2. అందరికి ఉపయోగకరమైన సమాచారం అందించావ్ అన్నా...

    ReplyDelete