Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

ఆక‌ర్ష‌ణీయ ఫీచ‌ర్ల‌తో మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1

  • చైనా బ్రాండ్ల‌కు షాక్‌నిచ్చేలా ధ‌ర‌లు..

-----------------------------

మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 స్మార్ట్‌ఫోన్ ఫీచ‌ర్స్ :  మీడియా టెక్ హీలియో జి85, 5000ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ అండ్ రివ‌ర్స్ ఛార్జింగ్.‌ 48+5+2+2 క్వార్డ్ కెమెరా సెట‌ప్‌, 6.67ఇన్ డిస్ప్లే / ధ‌ర 10,999(4జీబీ+64జీబీ) 12,999(4జీబీ+128జీబీ)

మైక్రోమాక్స్ ఇన్ వ‌న్‌బీ స్మార్ట్‌ఫోన్ ఫీచ‌ర్స్ :  మీడియా టెక్ హీలియో జీ35, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 13+డూయ‌ల్ కెమెరా, 6.5 ఇన్చ్  ‌డిస్ప్లే, ధ‌ర రూ.6,999(2జీబీ+32జీబీ) రూ.7,999(4జీబీ+64జీబీ).

--------------------------------

స్వ‌దేశీ మొబైల్ త‌యారీ సంస్థ  మైక్రోమాక్స్ ఆక‌ర్ష‌ణీయ ఫీచ‌ర్లు, త‌క్కువ ధ‌ర‌ల‌తో చ‌క్క‌ని రెండు స్మార్ట్‌ఫోన్లు భార‌తీయ మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. దేశీయ విప‌ణిలో పాతుకుపోయిన చైనా బ్రాండ్ల‌కు షాక్‌నిచ్చేలా ఇవి ఉన్నాయి.  సుమారు రెండు సంవత్సరాల తరువాత మైక్రోమాక్స్ సంస్థ‌ ఆన్‌లైన్‌లో మంగ‌ళ‌వారం  రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుద‌ల చేసింది. మొద‌టిది Micromax In Note 1 మిడిల్ రేంజ్ ఫోన్ అని పిలుస్తారు, ఇది రెడ్‌మి మరియు రియల్‌మే ఫోన్‌లకు చెక్ పెట్టనుంది. ఇక  రెండవది Micromax In 1b  అని పిలువబడే బ‌డ్జెట్ హ్యాండ్‌సెట్, ఇది ఎంట్రీ లెవ‌ల్ వినియోగదారులకు మరింత అనుకూలంగా ఉంటుంది. ఇందులో వ‌రుస‌గా మీడియాటెక్ హీలియో జీ85, మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెస‌ర్‌ల‌ను వినియోగించారు.  దేశంలో ఒప్పో, వివో, మరియు షియోమి, పొకో, వ‌న్‌ప్ల‌స్ వంటి చైనా బ్రాండ్ల ఆధిపత్యం కొన‌సాగుతున్న తరుణంలో .పూర్తి స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో మ‌న‌దేశానికి చెందిన మైక్రోమాక్స్ సంస్థ చ‌క్క‌ని ఫీచ‌ర్ల‌తో ఫోన్ల‌ను తీసుకురావ‌డం శుభ‌ప‌రిణామం.

మైక్రోమాక్స్ IN నోట్ 1,మైక్రోమాక్స్  IN 1B ధర  

Micromax In Note 1 ( 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్  వేరియంట్) రూ.10,999 కాగా, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.12,999 ధ‌ర నిర్ణ‌యించారు. ఇది తెలుపు మరియు ఆకుపచ్చ రంగులో అందుబాటులో ఉన్నాయి.  ఈ రెండు క‌ల‌ర్ వేరియంట్లు వెనుక‌వైపు వేర్వేరు డిజైన్లు క‌లిగి ఉన్నాయి. ఆకుపచ్చ రంగు ఫోన్ వెనుక భాగంలో X ఆకారపు డిజైజ్ ఉండ‌గా తెలుపు రంగు వెనుక భాగంలో మాట్టీ ఫినిష్‌ను చూడొచ్చు. 

మైక్రోమాక్స్ IN 1B (2GB RAM మరియు 32GB స్టోరేజ్) వేరియంట్‌కు రూ.6,999. అలాగే ఇందులో 4GB RAM +64GB స్టోరేజ్  వేరియంట్‌కు రూ.7,999 ధరకు ల‌భిస్తుంది.. ఇది మూడు రంగుల్లో అందుబాటులో ఉంది.  మైక్రోమాక్స్ IN నోట్ 1 మరియు IN 1B రెండూ కూడా ఫ్లిప్‌కార్ట్ మరియు మైక్రోమాక్స్ ఆన్‌లైన్ స్టోర్ల‌లో విక్ర‌యిస్తారు. 

మైక్రోమాక్స్ IN నోట్ 1 స్పెసిఫికేషన్లు

మైక్రోమాక్స్ కొత్త IN బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ల స్పెసిఫికేష‌న్లు అద్భుతంగా ఉన్నాయి. ప్రత్యర్థి చైనా బ్రాండ్లకు పోటీనిచ్చేలా మైక్రోమాక్స్ వీటిని విడుద‌ల చేసింది Micromax In Note 1 మోడ‌ల్  6.67-ఇంచుల భారీ స్క్రీన్ ఉంటుంది. ఇది ఫుల్‌హెచ్‌డీ ప్ల‌స్ LCDతో పంచ్-హోల్‌తో మ‌రియూ అల్ట్రా-బ్రైట్ టెక్నాలజీ క‌లిగిన డిస్ల్పేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో జి 85 ప్రాసెసర్ ఉంది, ఇదే ప్రాసెస‌ర్‌ను రియల్మీ నార్జో 20 వంటి ఫోన్‌లో వినియోగించారు. ఫోన్ వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను చూడొచ్చు. ఫొటోల కోసం మైక్రోమాక్స్ IN నోట్ 1 లో 48MP మెయిన్ కెమెరా, 5MP సెకండరీ కెమెరా(wide angle) తోపాటు  2MP(Macro), 2MP(Depth) క‌లిగిన రెండు కెమెరాలు ఉన్నాయి, సెల్ఫీల కోసం ముందు వైపు 13MP కెమెరా ఉంది.  ఇక ఇందులో బ్యాట‌రీ విష‌యానికొస్తే 5000ఎంఏహెచ్ బాట‌రీని వినియోగించారు. ఇది 18వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు స‌పోర్ట్ ఇస్తుంది. అంతేకాకుండా ఇది రివ‌ర్స్ చార్జింగ్‌కు కూడా స‌పోర్ట్ ఇవ్వ‌డి విశేషం. 

మైక్రోమాక్స్ IN  1B స్పెసిఫికేషన్లు



Micromax In 1b Model 6.5 ఇంచుల  హెచ్‌డీ ప్ల‌స్‌ డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇందులో మీడియా టెక్ హెలియో జి 35 ప్రాసెసర్‌ను వినియోగించారు. ఇది 2జీబీ రామ్‌+32 స్టోరేజ్ వేరియంట్‌తోపాటు 4 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. మైక్రో ఎస్‌డి కార్డు ద్వారా మెమోరీని పెంచుకోవ‌చ్చు. స్మార్ట్‌ఫోన్‌లో వెనుక‌వైపు 13 ఎంపి మెయిన్ కెమెరా,  2 ఎంపి సెకండరీ కెమెరా ఉండగా, ముందు కెమెరాలో 8 ఎంపి కెమెరా  ఉంది. మైక్రోమాక్స్ IN 1B లో 5000mAh బ్యాటరీ ఉంది, 10W చార్జింగ్ స‌పోర్టునిస్తుంది. రూ.7వేల బ‌డ్జెట్‌లోనూ  USB-C పోర్ట్ విని‌యోగించ‌డం విశేషం.  

చైనా ఫోన్ల‌కు మించిన ప్ర‌త్యేక‌త‌లు

  • గ‌తంలో మైక్రోమాక్స్ .. ఫోన్ల‌ను విడుద‌ల చేశాక వాటి సాఫ్ట్ వేర్ అప్‌డేట్ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోలేదు. కానీ ఈసారి క‌నీనం రెండేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఇస్తామ‌ని హామీ ఇచ్చింది.  రెండేళ్ల వ‌ర‌కు ఆండ్రాయిడ్ వెర్షన్ అప్‌గ్రేడ్ చేస్తామ‌ని మైక్రోమాక్స్ స‌హ‌వ్య‌వ‌స్థాప‌కుడు  రాహుల్‌శ‌ర్మ  ఈమేర‌కు లాంఛ్ ఈవెంట్ సంద‌ర్భంగా ప్ర‌క‌టించారు. 
  • మ‌రో విశేష‌మేమంటే మైక్రోమాక్స్ ఫోన్ల‌లో క్లీన్ ఆండ్రాయిడ్(స్టాక్ ఆండ్రాయిడ్‌) ఉంటుంది. అంటే ఇందులో ఏమాత్రం బ్లోట్‌వేర్ అంటే ప‌నికిరాని చెత్త యాప్‌లు ఏమాత్రం క‌నిపించ‌వు. అచ్చం నోకియా మరియు మోటరోలా యూఐ(యూజ‌ర్ ఇంట‌ర్‌ఫేస్‌) అన్న‌మాట‌.
  • ఇదే ధ‌ర‌ల శ్రేణిలో ల‌భిస్తున్న రెడ్‌మి, రియల్‌మీ ఒప్పో, వివో వంటి చైనా ఫోన్ల‌లో త‌క్కువ ధ‌ర‌కు ల‌భించినా అందులో  బ్లోట్‌వేర్లు అధికంగా ఉంటాయి. ఇవి ఎంతో రామ్‌,ఇంట‌ర్న‌ల్ మెమోరీని వినియోగించుకుంటాయి.  
  • మైక్రోమాక్స్ వ‌న్‌బీ మోడ‌ల్‌లో 5000ఎంఏహెచ్ బాట‌రీతోపాటు టైప్‌-సీ పోర్టు ఉంది. రూ.7వేల బడ్జెట్‌లో ఏ ఇత‌ర ఫోన్ల‌లోనూ టైప్‌సీ పోర్టు క‌నిపించ‌దు. వాటిలో పాత త‌రం మైక్రో యూఎస్‌బీ పోర్టు ఉంటుంది. 
  • అలాగే రూ.7వేల బ‌డ్జెట్‌లో ఫింగ‌ర్ ఫ్రింట్ సెన్సార్‌ను ఇవ్వ‌డం కూడా చాలా అరుదైన విష‌యం.
  • మైక్రోమాక్స్ ఐన్ ఫోన్ల‌లో గ‌తంలో మాదిరిగా కాకుండా అన్ని విడిభాగాల‌ను పూర్తిగా ఇండియాలోనే త‌యారు చేశారు. ఇది పూర్తి స్వ‌దేశీ ఫోన్‌. 
-----------------------------------

Post a Comment

2 Comments