- ప్రస్తతం బీటా వర్షన్‌లో పరీక్ష
- త్వరలో అందరికీ అందుబాటులో..
సెర్చ్ దిగ్గజం గూగుల్ త్వరలో ట్రూకాలర్ తరహా యాప్‌ను లాంచ్ చేసేందుకు అడుగులు వేస్తోంది. సోషల్‌మీడియాలో వస్తున్న నివేదికల ప్రకారం.. ఈ కాలింగ్ యాప్ గురించి గూగుల్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. గూగుల్ కాల్ యాప్ ను యూట్యూబ్‌లో వినియోగదారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ క్రొత్త గూగుల్ కాల్ కాలర్ ఐడి యాప్ ను ప్రస్తుతం బీటా వర్షన్‌లో పరీక్షిస్తున్నారు. ఇందులో ట్రూకాలర్లో కంటే మంచి ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. ట్రూకాలర్ యాప్ వాడడం అంత సేఫ్ కాదని, అందులో మన డేటా, లొకేషన్ వివరాలు అంతగా గోప్యంగా ఉండవని చాలారోజులుగా అనేక రూమర్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో గూగుల్ ప్రత్యేకంగా గుగుల్ కాలర్ ఐడీ యాప్‌ను తీసుకొస్తుండడం శుభపరిణామం.
YouTube లో ప్లే అవుతున్న ఓ యాడ్ రాబోయే Google కాలర్ ID యాప్ గురించి పలు విషయాలను వెల్లడిస్తోంది. Google కాల్ యాప్‌ను స్పష్టంగా చూపించే స్క్రీన్ షాట్‌ను వినియోగదారులు షేర్ చేశారు. “Know who’s calling. Reliable called ID lets you answer with confidence,” అని ప్రకటనలో మెసేజ్ ఉంది. ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అది ఎలా కనబడుతుందనే చిత్రం కూడా ఉంది. ఈ గూగుల్ కాల్ యాప్ ట్రూకాలర్ మాదిరిగా ఎవరు కాల్ చేస్తున్నారో మీకు తెలియజేస్తుంది.
ఫోన్ ఐకాన్ ఉన్న గూగుల్ కాల్ యాప్ ఇంకా గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో లేదు. అయితే, ఇప్పుడు గూగుల్ ఈ యాప్ గురించి యూట్యూబ్‌లో ప్రచారం చేసింది, ఇది త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ట్రూకాలర్ రూపొందించిన కొన్ని ముఖ్యమైన ఫీచర్లు ఈ గూగుల్ కాలర్ ఐడీ యాప్‌లో ఉన్నాయి. ముఖ్యంగా కాల్ రీజన్, షెడ్యూల్ ఎస్ఎంఎస్, ఎస్ఎంఎస్ ట్రాన్స్లేట్ వంటి ఫీచర్లను చూడవచ్చు. 250 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న ఈ యాప్ స్పామ్ కాల్స్‌ను ఇట్టే పసిగట్టవచ్చు. ఈ యాప్ ద్వారా ఎవరు కాల్ చేస్తున్నారో కనిపెట్టేయవచ్చు.
ఇందులో ఉన్న కాల్ రీజన్ ఫీచర్ ప్రకారం.. వినియోగదారులు వారి కాల్‌కు.. ఎందుకు కాల్ చేస్తున్నామో సెట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది.. తద్వారా రిసీవర్ అతను కాల్ తీసుకోవాలా లేదా అని నిర్ణయించుకోవచ్చు. కాల్ వ్యక్తిగత, వ్యాపారం లేదా అత్యవసరమైనదేనా అని కాల్ చేసేవారు సెట్ చేయవచ్చు. చాలా సార్లు, వినియోగదారులు చాలా బిజీగా ఉన్నప్పుడు మధ్యలో టెలికాలర్ల నుంచి కాల్స్ వస్తాయి. తాజా కాల్ రీజన్ ఫీచర్ ద్వారా మనకు వచ్చే కాల్స్ ఎటువంటివో ముందే గుర్తించి అందుకు అనుగుణంగా స్పందించవచ్చు.
=====================
టాటా స్కై సెట్‌టాప్‌బాక్స్‌లపై డిస్కౌంట్లు



1 Comments
Nice
ReplyDelete