ఎయిర్టెల్ కాని వినియోగదారులూ యాక్సెస్ చేయొచ్చు.
టెలికాం కంపెనీలు తమ వినియోగదారులకు ప్రత్యేకంగా స్ట్రీమింగ్ యాప్‌లను అందిస్తుంటాయి. కేవలం ఆ టెలికాం సబ్స్క్రైబర్లకు మాత్రమే వీటిని యాక్సెస్ చేసే వీలుంటుంది. ఉదాహరణకు ఎంటర్టైన్మెంట్ యాప్‌లైన Vi మువీస్ మరియు TV, అలాగే JioTV, జియో సినిమా వంటి యాప్‌లు కేవలం తమ వినియోగదారులకు మాత్రమే యాక్సెస్ చేసేందుకు అనుమతిస్తాయి. అయితే ఎయిర్టెల్ యొక్క ఎంటర్టైన్మెంట్ యాప్ ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ను ఇప్పుడు ఎయిర్టెల్ కాని వినియోగదారులు కూడా యాక్సెస్ చేయవచ్చు. గతంలో ఎయిర్టెల్ వినియోగదారులు మాత్రమే ఈ యాప్‌ను ఉపయోగించడానికి వీలుండేది. మరియు ఎయిర్టెల్ ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, డీటిహెచ్ లేదా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌కు చందా పొందడం ద్వారా దీన్ని ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. ఇప్పుడు, తాజాగా ఆన్లైన్ లో వచ్చిన ఓ నివేదిక ప్రకారం ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ అనువర్తనాన్ని ఆన్లైన్ ప్లాన్ రీచార్జి చేయడం ద్వారా ఎయిర్టెల్ కాని వినియోగదారులు కూడా యాక్సెస్ చేయవచ్చు.
ఎలా ఉపయోగించాలి..
ప్లేస్టోర్‌లోని ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌కు కొత్త అప్డేట్ వచ్చింది. నాన్-ఎయిర్టెల్ యూజర్లు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యొక్క యాప్ చందాను ఏడాదికి రూ .499 చెల్లించి ఉపయోగించుకోవచ్చు. ఆ మేరకు ఎయిర్టెల్ సంస్థ తన పేమెంట్ పద్ధతులను పునరుద్ధరించింది. యూపీఐ, పేటిఎమ్, గూగుల్ పే లేదా ఫోన్‌పే వంటి ఇతర వాలెట్ల ద్వారా చందాను చెల్లించుకోవచ్చు. కార్డు చెల్లింపుల ద్వారా కరూడా వినియోగదారులు చందా పొందవచ్చు. అయితే ఎయిర్టెల్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇది తొందర్లోనే అందుబాటులోకి రానుంది.
ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ లో వినియోగదారులు తమ వ్యక్తిగత వాచ్ లిస్టులను రూపొందించుకోవచ్చు. దీనిని ఒకేసారి ఐదు వివిధ డివైజ్‌లలో లాగిన్ కావొచ్చు(మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌టీవీలు ,టాబ్, కంప్యూటర్లు వంటివి). ఇందులో 350కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లు, సినిమాలు మరియు టీవీ షోలను చూడవచ్చు. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ క్రోమ్‌కాస్ట్ ఫీచర్, ఆండ్రాయిడ్ టివి మరియు ఫైర్ టివి స్టిక్‌లకు కూడా మద్దతు ఇస్తుంది. ఏదేమైనా, ఈ ఫీచర్‌ను పొందాలంటే వినియోగదారులు వార్షిక చందా కల్టాల్సి ఉంటుంది. నెలవారీ రీచార్జి కూడా చేయొచ్చు. అందుకు నెలకు 49 రూపాయలు చెల్లించి ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బేసిక్ నుండి ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియానికి అప్‌గ్రేడ్ చేయవచ్చు. ప్రీపెయిడ్ ప్లాన్లతో రూ .149 నుంచి ప్రారంభమయ్యే ఎయిర్టెల్ యూజర్లు, పోస్ట్‌పెయిడ్ యూజర్లు అందరూ ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌కు అదనపు ఛార్జీ లేకుండా యాక్సెస్ పొందుతారు.
హాట్‌స్టార్, అమేజాన్ ప్రైమ్, జీ5
బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల విషయానికి వస్తే, ఎయిర్టెల్ నుండి వచ్చే అన్ని ప్లాన్లు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ OTT సేవలతో పాటు అపరిమిత డేటాను ఇస్తాయి. అన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ 4 కె టివి బాక్స్‌తో పాటు 10,000+ సినిమాలు, టీవీ షోస్, మరియు 7 OTT యాప్‌లు మరియు 5 స్టూడియోల నుండి ఒరిజినల్ సిరీస్‌లు ఉన్నాయి. ఎక్స్‌స్ట్రీమ్ బండిల్ 1500 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్‌తో వస్తుంది, దీని కింద ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఆండ్రాయిడ్ 4 కె టివి బాక్స్ వస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ మరియు జీ 5 సేవలకు పొందవచ్చు.



1 Comments
Good
ReplyDelete