Header Ads Widget

Ticker

6/recent/ticker-posts

Vi కొత్త వినియోదారుల‌కు కొత్త ప్లాన్‌

రూ.399 ప్లాన్‌తో డేటా, వాయిస్‌కాల్స్ ప్ర‌యోజ‌నాలు


వీఐ(వోడాఫోన్ ఐడియా) కొత్త సిమ్ కొనుగోలు చేసే కొత్త కస్టమర్ల కోసం 399 ప్లాన్‌ను విడుద‌ల ‌చేసింది.. ఈ ప్లాన్ డిజిటల్ ఎక్స్‌క్లూజివ్, Vi వెబ్‌సైట్ ద్వారా మాత్రమే పొందవచ్చు.  మొదటిసారి వోడాఫోన్ ఐడియా సిమ్‌ను కొనుగోలు చేసిన ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం వీఐ(వొడ‌ఫోన్‌-ఐడియా) కొత్త ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ప్లాన్‌ MNP (మొబైల్ నంబర్ పోర్టబిలిటీ) చేసుకున్న‌వారికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఒక వినియోగదారు వెబ్‌సైట్ నుంచి కొత్త సిమ్ కొనుగోలు చేసిన‌ప్పుడు  రూ. 399 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.   

రోజుకు 1.5GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ 

రూ. 399 ప్లాన్‌లో ప్రీపెయిడ్ వినియోగదారులకు రోజుకు 1.5GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ మరియు రోజుకు 100 SMS లు వ‌స్తాయి. ఈ ప్లాన్ 56 రోజుల వాలిడిటీ ఉంటుంది. అలాగే Vi మూవీస్ & టీవీకి యాక్సెస్ వంటి అదనపు ప్రయోజనాలను కూడా పొంద‌వ‌చ్చు.మ‌రోవైపు రూ. 297 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంది. రెంటికీ ఒకే తేడా ఏమిటంటే రూ. 297 ప్లాన్‌కు 28 రోజుల చెల్లుబాటు ఉండగా రూ. 399 ఒకటి 56 రోజుల వర‌కు ఉంటుంది.  

పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు రూ. 399 ప్లాన్‌లో 40 జీబీ డేటా, 6 నెలలు అదనంగా 150 జీబీ డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా అందుకోవ‌చ్చు. వీటితోపాటు అపరిమిత వాయిస్ కాల్స్, 200 జీబీ డేటాను రోల్ చేసే ఆప్షన్ ఉంటుంది.  ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్ కింద‌ Vi మూవీస్ యాప్‌ను టీవీల్లో కూడా యాక్సెస్ చేసుకోవ‌చ్చు 

Vi ప్రస్తుతం కొత్త క‌స్ట‌మ‌ర్ల కోసం ప్ర‌త్యేక‌మైన ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అవి రూ.97, రూ.197, రూ.7, రూ.497, మరియు రూ. 647. ఈ ప్లాన్ల‌న్నీ ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ లో కొనుగోలు చేయవచ్చు. అయితే కొత్త‌గా వ‌చ్చిన రూ.399 ప్లాన్ ఇప్పుడు వెబ్‌సైట్‌లో లైవ్‌లో ఉది. మరియు Vi వెబ్‌సైట్> న్యూ కనెక్షన్> పోస్ట్‌పెయిడ్ లేదా ప్రీపెయిడ్ కనెక్షన్ ఎంపికకు వెళ్ళడం ద్వారా కొనుగోలు చేయవచ్చు. 

----------------------

ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్‌
అమేజాన్ ఫాబ్ ఫోన్ ఫెస్ట్‌

Post a Comment

1 Comments