భారతదేశపు ప్రముఖ పేమెంట్ సర్వీస్ యాప్ Paytm తన పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం కొత్తగా EMI ఆప్షన్ అందిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త ప్లాన్ ప్రకారం, Paytm లోని పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు ఇప్పుడు వారి ఖర్చులను ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ (EMI లు) గా మార్చవచ్చు. కొత్త ఫీచర్ ప్రకారం... వినియోగదారులు తమ బడ్జెట్ గురించి పెద్దగా ఆలోచించకుండా ఏదైనా వస్తువును కొనుగోలు చేయవచ్చు. సుమారు 5 లక్షల షాపులు మరియు వెబ్‌సైట్లలో వస్తువును కొనుగోలు చేసేందుకు “buy now and pay later” scheme పథకాన్ని పొందవచ్చు అని కంపెనీ తెలిపింది.
ఇక పేటియం కొత్త buy now and pay later” scheme తో పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు వారి మొత్తం ఖర్చులను సులభమైన వాయిదాల ప్రకారం చెల్లించవచ్చు. అదికూడా నామమాత్రపు వడ్డీ రేట్లు ఉంటాయని కంపెనీ పేర్కొంది.పోస్ట్‌పెయిడ్ బిల్లు చెల్లించడానికి యూజర్లు ఇప్పటికే యుపిఐ, డెబిట్ కార్డ్ మరియు నెట్ బ్యాంకింగ్ వంటివాటిపి ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు వారు ఇఎంఐలను కూడా పొందవచ్చు. “బిల్లు ఉత్పత్తి అయిన మొదటి 7 రోజుల్లోనే, పోస్ట్‌పెయిడ్ బిల్లును సౌకర్యవంతమైన EMI లుగా మార్చడానికి వారికి అవకాశం ఉంది. పోస్ట్‌పెయిడ్ ఎమౌంట్ లిమిట్ రు.ఒక లక్ష. వరకు ఉంటుంది. Paytm యాప్ వినియోగదారులకు వివిధ చెల్లింపుల కోసం తక్షణ క్రెడిట్ లైన్‌తో రెండు ప్రముఖ NBFC ల భాగస్వామ్యంతో ఇది అందించబడుతుంది, ”అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
పోస్ట్ పెయిడ్ ఫీచర్ అనేది లైట్, డిలైట్, ఎలైట్ అనే మూడు భాగాలుగా విభజించారు. లైట్ ఫీచర్ ద్వారా 20000 రూపాయల లిమిట్ వరకు ఇస్తుంటే.. డిలైట్, ఎలైట్ ఫీచర్ ద్వారా లక్ష రూపాయల వరకూ అవకాశం ఉందని కంపెనీ పేర్కొంది.
Paytm లో పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు కిరాణా దుకాణాల నుండి కిరాణా, పాలు మరియు ఇతర గృహ నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయవచ్చు, రిలయన్స్ ఫ్రెష్, హల్దిరామ్, అపోలో ఫార్మసీ, క్రోమా, షాపర్స్ స్టాప్ వంటి ప్రముఖ రిటైల్ సంస్థల్లో వస్తువులను EMI ల రూపంలో బిల్లును ఎంచుకోవచ్చు. ఉదాహరణకు, మొత్తం బిల్లు రూ .50 వేలు మరియు మీ ఖాతా నుండి ఒకేసారి చెల్లించలేమనుకుంటే మీరు ఇఎంఐ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అయితే ఇందుకు మీరు వడ్డీ చెల్లించాలి. మీరు యుపిఐ లేదా నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి మొత్తం మొత్తాన్ని క్లియర్ చేస్తే, మీరు అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
======================
Also Read
టాటా స్కై సెట్‌టాప్ బాక్స్‌పై డిస్కౌంట్లు
గూగుల్ ఫొటోస్ సేవలకు పరిమితి



1 Comments
Good information
ReplyDelete